BigTV English

Mathura Krishna Janmabhoomi : కృష్ణ జన్మ భూమి వివాదం.. షాహీ ఈద్గాలో సర్వేకు సుప్రీం బ్రేక్‌..

Mathura Krishna Janmabhoomi : ఉత్తరప్రదేశ్‌లోని మథురలో కృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ ఆలయం చెంతనే ఉన్న షాహీ ఈద్గా మసీదులో శాస్త్రీయ సర్వేకు అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సర్వోన్నత సుప్రీం కోర్టు నిలిపి వేసింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్లపై తమ స్పందన తెలియజేయాలని హిందూ సంఘాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో శ్రీకృష్ణుడు జన్మించిన స్థలంలో షాహీ ఈద్గా నిర్మించారని, దీనిపై సర్వే చేయించాలంటూ మథుర జిల్లా కోర్టులో గతంలో 9 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని మథుర జిల్లా కోర్టు నుంచి అలహాబాద్‌ ఉన్నత న్యాయస్థానానికి బదిలీ చేశారు. దీనిపై గతేడాది డిసెంబరులో హైకోర్టు విచారణ జరిపింది. న్యాయస్థానం పర్యవేక్షణలో షాహీ ఈద్గాలో శాస్త్రీయ సర్వే నిర్వహించేందుకు అడ్వొకేట్‌ కమిషనర్‌ను నియమించారు.

అయితే హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ముస్లిం కమిటీ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం.. హైకోర్టు ఆదేశాల అమలుపై స్టే ఇచ్చింది. దీనిపై హిందూ సంఘాలకు నోటీసు జారీ చేసింది. ఈ వివాదంపై హైకోర్టు ఎదుట విచారణ కొనసాగుతోందని స్పష్టం చేసింది.

Mathura Krishna Janmabhoomi, Mathura Krishna Janmabhoomi Land dispute,

Tags

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×