BigTV English

Imran Khan : ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ కు రంగం సిద్ధం..! ఎందుకంటే..?

Imran Khan : ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ కు రంగం సిద్ధం..! ఎందుకంటే..?

Imran Khan : పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, తెహ్రీక్‌ -ఏ- ఇన్సాఫ్‌ అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్‌ ను అరెస్ట్ చేసేందుకు ఇస్లామాబాద్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీంతో లాహోర్ లోని ఇమ్రాన్ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. తెహ్రీక్-ఏ- ఇన్సాఫ్ కార్యకర్తలు అక్కడి భారీగా చేరుకున్నారు. ఈ సమయంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఇమ్రాన్‌ ఖాన్‌ కీలక ప్రసంగం చేశారు. పాక్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. షెహబాజ్‌ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. అవినీతికి పాల్పడిన నేతను ప్రధానిని చేయడం వల్లే పాక్ పతనమైందని మండిపడ్డారు.


ఇమ్రాన్ బౌన్సర్లు..
భారతదేశ ఛానళ్లను చూసి పాకిస్థాన్‌ ప్రపంచవ్యాప్తంగా ఎందుకు విమర్శలకు గురవుతుందో తెలుసుకోవాలని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బజ్వా కాపాడి హెహబాజ్ ను ప్రధానిని చేశారని ఆరోపించారు. ఇంటీరియర్‌ మినిస్టర్‌ పైనా హత్యారోపణలు ఉన్నాయన్నారు. అసిఫ్‌ జర్దారీ హంతకుడని విమర్శించారు. ప్రభుత్వంలోని అగ్ర నేతలే నేరస్థులైతే.. ఇక దేశం ఏమవుతుందని ప్రశ్నించారు. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని, అత్యధిక ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. వజీరాబాద్‌లో తనపై జరిగిన హత్యాయత్నం వెనుక అధికార పార్టీ నేతలే ఉన్నారంటూ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌, ఇంటీరియర్‌ మంత్రి రానా సనావుల్లా, ఇంటెలిజెన్స్‌ అధికారుల పేర్లను ఇమ్రాన్‌ ప్రస్తావించారు.

అరెస్ట్ ఎందుకంటే..?
ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రధాని ఉండగా.. విదేశీ పర్యటనల్లో వచ్చిన బహుమతులను విక్రయించారనే ఆరోపణలున్నాయి. ఆ బహుమతులను తోషాఖానాలో జమ చేయాలి. ఈ కేసులో మూడుసార్లు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినా ఇమ్రాన్‌ హాజరుకాకపోవడంతో సెషన్స్ కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్ జారీ చేసింది. మార్చి 7లోపు న్యాయస్థానం ఎదుట హాజరుపర్చాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ను అరెస్టు చేసేందుకు ఇస్లామాబాద్‌ పోలీసులు లాహోర్‌లోని జమాన్‌ పార్క్‌ రెసిడెన్సీకి చేరుకున్నారు. అప్పటికే పీటీఐ నేత ఫవాద్‌ చౌధరి ఇచ్చిన పిలుపుతో పార్టీ కార్యకర్తలు ఇమ్రాన్‌ నివాసానికి తరలివచ్చారు. తాము ఇమ్రాన్ ను అరెస్ట్ చేస్తామని ఇస్లామాబాద్ పోలీస్‌ చీఫ్‌ తేల్చి చెప్పారు. ఒకవేళ ఇమ్రాన్ ను అరెస్టు చేస్తే నిరసనలను ఉద్ధృతం చేస్తామని పార్టీ శ్రేణులు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో లాహోర్ లో ఉద్రిక్తత కొనసాగుతోంది.


Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×