Phone Tapping Case Update: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో రోజుకో కొత్త విషయం బయటకొస్తోంది. తవ్వేకొద్దీ బయటకు వస్తూనే ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ పేరుతో చేసిన దందాలు వెలుగుచూస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్‌తో సంబంధం ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లను పోలీసులు విచారణ చేస్తున్నారు. తాజాగా పోలీసులు మరోక కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కానిస్టేబుల్ విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఫోన్ ట్యాపింగ్‌లో మహిళల వ్యక్తిగత విషయాలతో బ్లాక్‌మెయిల్ చేసి బాగా వెనకేసుకున్నట్లు తెలుస్తోంది.
పోలీస్ బాస్ సాన్నిహిత్యంతో పలు దందాల్లో జోక్యం చేసుకుని కోట్ల రూపాయలు వసూలు చేశారు. పోలీస్ బాస్ బినామీల పేరిట 9 ఎకరాల తోట కూడా సంపాదించారు. నార్కట్ పల్లి వద్ద గంజాయి కేసులో.. నిందితుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ఫోన్ కాల్స్ కానిస్టేబుల్ రికార్డు చేశాడు. వందల మందికి సంబంధించిన ఫోన్ కాల్స్ రికార్డ్స్ సేకరించాడు. 40 మంది మహిళలపై కానిస్టేబుల్ లైంగిక వేధింపులకి పాల్పడ్డాడు. పేకాట దందాల్లోనూ నెలకు మామూళ్లు వసూలు చేశారు.
దీంతో ఈ కేసులో ఇంకేం వెలుగులోకి వస్తాయి.. ఇంకేం సంచలనాలు నమోదవుతాయనేది ఆసక్తికరంగా మారింది.