BigTV English

Bangladesh Crisis: బంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ రాజీనామా.. ఎందుకంటే ?

Bangladesh Crisis: బంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ రాజీనామా..  ఎందుకంటే ?

Bangladesh Crisis: బంగ్లాదేశ్‌లో అల్లర్లు కొనసాగుతున్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసినా కూడా అల్లర్లు ఆగడం లేదు. ప్రధాని రాజీనామా విజయవంతం కావడంతో నిరసన కారులు మిగతా ప్రధాన పదవుల్లో ఉన్న వారిని టార్గెట్‌గా చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే నిరసనకారులు సుప్రీం కోర్టు ఆవరణలోకి చేరుకున్నారు. అనంతరం ప్రధాన న్యాయమూర్తి రాజీనామా చేయాలని లేకపోతే న్యాయమూర్తుల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. తప్పని పరిస్థితిలో బంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ ఒబైదుల్ హసన్ తన పదవికి రాజీనామా చేశారు. న్యాయమూర్తుల భద్రత దృష్ట్యా తాను రాజీనామా చేసినట్లు ప్రకటించారు.


హసన్ రాజీనామా తమకు అందిందని పార్లమెంటరీ వ్యవహారాల సలహాదారు ఆసిఫ్ నజ్‌రుల్ ప్రకటించారు. హసన్ తర్వాత మరో ఐదుగురు న్యాయమూర్తులు కూడా రాజీనామా చేసినట్లు వెల్లడించారు. తాత్కాలిక ప్రభుత్వం చట్ట విరుద్దం అని న్యాయమూర్తి ప్రకటించాలని అనుకున్నారని నిరసనకారులు ఆరోపించారు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఇదిలా ఉంటే ఢాకా యూనివర్సిటీ వీసీ మక్సూద్ కమల్, ఎస్‌యూఎస్‌టీ వీసీ ఫరీదుద్దిన్ అహ్మద్ కూడా రాజీనామా చేశారు.


Related News

Donald Trump: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. అందులో భారత్- పాక్ ఒకటి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Pakistan Military: సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించిన పాక్ జెట్స్.. 30 మందికి పైగా దుర్మరణం

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

Big Stories

×