BigTV English

Bill Gates: 67 ఏళ్ల వయస్సులో మళ్లీ ప్రేమ! ఎంతవారుగానీ..! ‘బిల్’ జిల్ ‘పాలా’..

Bill Gates: 67 ఏళ్ల వయస్సులో మళ్లీ ప్రేమ! ఎంతవారుగానీ..! ‘బిల్’ జిల్ ‘పాలా’..

Bill Gates: బిల్ గేట్స్. పరిచయం అక్కరలేని పేరు. ఆ పేరు వినగానే మైక్రో సాఫ్ట్ కంపెనీయే గుర్తుకొస్తుంది. సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ ఆయన. అలాంటి బిల్ గేట్స్ గురించి ఇటీవల తరుచూ వేరే రకం న్యూస్ వినిపిస్తోంది. ఆయన విడాకుల గురించి కొన్ని నెలల పాటు చర్చలు నడిచాయి. ఆ టాపిక్ ఇప్పుడిప్పుడే మర్చిపోతుండగా.. బిల్ గేట్స్ పై మళ్లీ మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. అది.. ఆయన లవ్ ఎఫైర్ గురించి.


అవునుండీ అవును. బిల్ గేట్స్ లవ్ ఎఫైర్ గురించే ఇప్పుడు పెద్ద ఎత్తున డిస్కషన్ నడుస్తోంది. అదేంటి.. మనోడు ఆ ఏజ్ లో లవ్ ఏంటి అనుకోకండి. ఆ ఏజ్ లోనే కదా ఓ తోడు కావాల్సింది. 67 ఏళ్ల బిల్ గేట్స్.. లేటెస్ట్ గా ఓ మహిళతో సన్నిహితంగా ఉంటున్నారు. వారిద్దరూ తరచూ పబ్లిక్ ప్లేసెస్ లో క్లోజ్ గా కనిపిస్తున్నారు. ఆమె కూడా ఈయనలానే సాఫ్ట్ వేర్ బ్యాక్ గ్రౌండే. దివంగత ఒరాకిల్‌ మాజీ సీఈవో మార్క్‌ హర్డ్‌ భార్య పాలా హర్డ్‌తో ఏడాది నుంచి బిల్ గేట్స్ డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

రెండేళ్ల క్రితం మెలిందాతో విడాకులు తీసుకున్నారు. ఏడాదిగా 60 ఏళ్ల పాలా హర్డ్‌తో డేటింగ్‌ చేస్తున్నారు. భార్యను వదిలేయగానే ఈయన.. భర్త పోగానే ఆమె.. ఈ ఒంటరి పక్షులు రెండు జత కలిశాయని అంటున్నారు. ఆరు పదుల వయసున్న ఈ జంట లవ్ ట్రాక్ పై అంతర్జాతీయ మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్ గా మెల్‌బోర్న్‌లో జరిగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌ ఫైనల్‌లో వీరిద్దరూ పక్కపక్కనే కూర్చొని గేమ్ ను ఎంజాయ్ చేశారు. ఆ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అప్పటినుంచీ వీరి ఎఫైర్ పబ్లిక్ అయిపోయింది.


Tags

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×