NTR 30:యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ నెలలో సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది. మార్చి మూడో వారం నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే స్టార్ టెక్నీషియన్స్ రత్నవేలు, సాబు సిరిల్ వంటి వారు NTR 30లో భాగమయ్యారు. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కబోతున్న సినిమా కావటంతో నిర్మాతలు సినిమా విషయంలో అచి తూచి అడుగులు వేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయమొకటి వైరల్ అవుతుంది. అదేంటనే వివరాల్లోకి వెళితే…
NTR 30లో ప్రతినాయకుడు ఎవరనే దానిపై పలు రకాలైన వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. కొన్నాళ్లు ముందు సంజయ్ దత్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే లేటెస్ట్ సమాచారం మేరకు ఎన్టీఆర్‌ను ఢీ కొట్టే విలన్ పవర్‌ఫుల్‌గా కనిపించాలి. కాబట్టి.. కొరటాల శివ తమిళ విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ లేదా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ పేర్లను పరిశీలిస్తున్నారట. వీరిద్దరిలో ఎవరు ఒకే చెప్పినా సినిమాకు క్రేజ్ మరో రేంజ్‌లో ఉంటుందనటంలో సందేహమే లేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. దీంతో పాటు NTR 30లో శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుందనే టాక్ కూడా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే.
RRR వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తోన్న సినిమా కావటంతో RRRపై భారీ అంచనాలున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న సినిమాను విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటన ఇచ్చేశారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నారు. బరువు తగ్గారు గడ్డం పెంచారు. నందమూరి ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎన్టీఆర్, కొరటాల శివ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై ఈ చిత్రం రూపొందనుంది.