Bird Flu In Humans In USA | అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు బర్డ్ ఫ్లూ వైరస్ (ఏవిషన్ ఇన్‌ఫ్లూయెన్జా – H5N1) ఇన్‌ఫెక్షన్ కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ వ్యాధి వ్యాపించకుండా ఇప్పటికే కోట్ల సంఖ్యలో కోళ్లను చంపేశారు. ఈ బర్డ్ ఫ్లూ కారణంగా అమెరికా కోళ్లు, కోడి గుడ్లు దిగుమతి చేసుకోవడం ఆపేసింది. దీని వల్ల అమెరికా కోడి గుడ్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లలో కోడి గుడ్లు లభించడంతో లేదు.
మరోవైపు కోళ్ల ద్వారా బర్డ్ ఫ్లూ వైరస్ ఇతర జంతువులకు, మనుషులకు కూడా సోకే అవకాశం ఉంది. అమెరికాలో వ్యాధుల నియంత్రణ విభాగం సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అధికారులు బర్డ్ ఫ్లూని నియంత్రించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టారు. అయితే మనుషులలో బర్డ్ ఫ్లూ వైరస్ సోకే అవకాశాలు తక్కువ అని వారు చెబుతున్నారు. కానీ ఇప్పటికే అమెరికాలోని మొత్తం 12 రాష్ట్రల్లో 69 మందికి సోకినట్లు అధికారిక సమాచారం. ఈ వైరస్ ఇన్‌ఫెక్షన్ వల్ల ఒక మనిషి మరణించాడు.
గత కొద్ది నెలల్లో అమెరికాలో ఈ ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా పశువుల్లో ఎక్కువగా వ్యాపిస్తోంది. కోళ్లు, ఇతర పక్షులు, ఆవులు, పెంపుడు పిల్లులకు కూడా వైరస్ సోకుతోంది. అమెరికా వ్యవసాయ విభాగం ప్రకారం.. ఒక్క జనవరి 2025లో 23 లక్షల కోళ్లు ఈ వైరస్ బారిన పడ్డాయి. ఫిబ్రవరి 2022 ను గణాంకాలు పరిశీలిస్తే మొత్తం కోటి 38 లక్షల కోళ్లకు ఈ ఇన్‌ఫ్లుయెన్జా వైరస్ సోకినట్లు సమాచారం.
Also Read: ట్రంప్ అంతా రివర్స్.. బర్డ్ ఫ్లూ వేళ వైద్య నిపుణులపై వేటు
తాజాగా ఫిబ్రవరి 13, 2025 సమాచారం మేరకు అమెరికాలో బర్డ్ ఫ్లూ మొత్తం 12 రాష్ట్రాలకు వ్యాపించింది. కోళ్లు, పాలిచ్చే ఆవులు ఎక్కువగా ఈ వైరస్ బారిన పడుతున్నాయి. ఈ 12 రాష్ట్రాల్లో వాషింగ్టన్, ఓరెగాన్, కాలిఫోర్నియా, నెవాడా, కొలొరాడో, టెక్సాస్, లూసియానా, లోవా, మిస్సోరి, విస్‌కాన్సిన్, మిచిగాన్, ఓహాయో.
శాఖాహార గుడ్లకు పెరుగుతున్న డిమాండ్
బర్డ్ ఫ్లూ భయంతో అమెరికాలో ప్రజలు కోడి గుడ్లకు బదులు శాఖాహార గుడ్లు (వీగన్ ఎగ్స్) తినడానికి ఇష్టపడుతున్నారు. సాధారణ కోడి గుడ్ల ధరలు విపరీతంగా పెరిగిపోతుండడంతో, లభ్యత కూడా భారీగా తగ్గిపోవడంతో వీగన్ ఎగ్స్ కు అక్కడ దేశవ్యాప్తంగా డిమాండ్ ఏర్పడింది.
ఒక్క జనవరి 2025 నెలలోనే వీగన్ ఎగ్స్ తయారు చేసే ఈట్ కంపెనీ ల్స్ 5 రెట్లు పెరిగిపోయాయి. ఈ కంపెనీ “జస్ట్ ఎగ్” పేరుతో వీగన్ ఎగ్స్ తయారు చేయడానికి మంగ్ బీన్స్, కెనోలా ఆయిల్ ని లిక్విడ్ గా చేసి గుడ్లు తయారు చేస్తుంది.
బర్డ్ ఫ్లూ లక్షణాలు మనుషుల్లో ఎలా గుర్తించాలంటే..
దగ్గు, గొంతు మంట, జ్వరం, అలసట, శ్వాసకోశ ఇబ్బందులు, కండరాల నొప్పులు సాధారణంగా కనిపిస్తాయి. ఇన్‌ఫెక్షన్ తీవ్రంగా ఉన్న సందర్భంలో ఫ్లూ న్యుమోనియా, అవయవ వైఫల్యం, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్, చివరి బాధితుడు చనిపోయే ప్రమాదం ఉంది. ఈ లక్షణాలలో ఏవైనా మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉంటే వెంటనే వైద్యులను ముఖ్యంగా ఊపిరితిత్తుల నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
భారత దేశంలో కూడా బర్డ్ ఫ్లూ కలకలం
ఇండియాలో కూడా ఈ వైరస్ వ్యాపిస్తోంది. మహారాష్ట్రలో ఇటీవలే వైరస్ సోకిన 7000 కోళ్లను వ్యాధి నియంత్రణ కోసం చంపేశారు.
తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ భయాందోళనలను కలిగిస్తోంది. కొన్ని వారాలుగా కోళ్ళ ఫారాల్లో లక్షల సంఖ్యలో కోళ్ళు మరణిస్తున్నాయి. ఈ వైరస్ కారణంగా చికెన్ తినేందుకు ప్రజలు భయపడుతున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో హైదరాబాద్ చికెన్ అమ్మకాలు భారీగా తగ్గాయి. ప్రజలు మటన్ మరియు చేపల వైపు మొగ్గు చూపుతున్నారు, దీనివల్ల వాటి గిరాకీ పెరిగింది.
తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు నాణ్యత లేని చికెన్ విక్రయిస్తున్న వ్యాపారులపై దాడులు చేస్తున్నారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు జరిపి, 500 క్వింటాల కుళ్లిన చికెన్ ను కనుగొన్నారు. వ్యాపారులపై కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ సోకి 5 లక్షల కోళ్ళు మరణించాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో చికెన్ తినడాన్ని నిషేధించారు. వైరస్ నేపథ్యంలో చికెన్ ను బాగా శుభ్రం చేసి ఉడికించి తినాలి. అయితే కొన్ని రోజులు చికెన్ తినకుండా ఉండటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.