BigTV English

Trump Fire Disease Detectives: ట్రంప్ అంతా రివర్స్.. బర్డ్ ఫ్లూ వేళ వైద్య నిపుణులపై వేటు

Trump Fire Disease Detectives: ట్రంప్ అంతా రివర్స్.. బర్డ్ ఫ్లూ వేళ వైద్య నిపుణులపై వేటు

Trump Fire Disease Detectives| అమెరికా ప్రెసిడెంట్‌గా పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ప్రతిరోజూ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఆయన తాజాగా అమెరికా ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేశారు. ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులు, ప్రభుత్వ శాఖల్లో వృథా ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్న డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) యంత్రాంగం ఉద్యోగాల్లో భారీగా కోతలు పెడుతోంది. ఇటీవల, డిసీజ్ డిటెక్టివ్స్ (Disease Detectives) పై కూడా వేటు వేసినట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు పేర్కొన్నాయి. అంటువ్యాధుల (మహమ్మారి) నియంత్రణ, నిర్మూలన కార్యక్రమాల కోసం పనిచేసే వారినే ‘డిసీజ్ డిటెక్టివ్స్’గా పిలుస్తారు. బర్డ్ ఫ్లూ కేసులు పెరుగుతున్న ఈ సమయంలో వారిని తొలగించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.


ప్రొబేషన్‌లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరినీ తొలగించాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం గురువారం ఆదేశించింది. ఈ ఆదేశం ప్రకారం, ఒక సంవత్సరం కాలం ప్రొబేషన్‌లో ఉండి ఇంకా శాశ్వతంగా నియమించబడని లక్షల మంది ఉద్యోగులు తొలగించబడనున్నారు. మార్చి నెలలో ఒక సంవత్సరం కంటే తక్కువ కాలం ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న ప్రొబేషనరీ ఉద్యోగుల సంఖ్య 2,20,000 కి చేరుకుంది. విద్యా శాఖలో మరియు వినియోగదారుల ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణ సంస్థలో ప్రొబేషనరీ ఉద్యోగుల తొలగింపు ఈ వారం నుండి ప్రారంభమైంది. వృద్ధులకు క్యాన్సర్ చికిత్స, మాదకద్రవ్యాలకు బానిసలైన వారిని మామూలు పరిస్థితికి తీసుకురావడం వంటి కార్యక్రమాలలో నిమగ్నమైన పరిశోధక సిబ్బందిని కూడా తొలగిస్తున్నారు.

ట్రంప్ రెండో పరిపాలనలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ క్రమంలోనే, ట్రంప్ మస్క్‌కు మరిన్ని అధికారాలు అందించారు. మస్క్ నిర్వహిస్తున్న డోజె (DOGE) విభాగానికి ప్రత్యేక అధికారాలిచ్చే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ తాజాగా సంతకం చేశారు. ఇకపై ఫెడరల్ ఏజెన్సీలు డోజె సహకారం మరియు సంప్రదింపుల తర్వాతే ఉద్యోగుల తొలగింపు మరియు నియామకాలపై నిర్ణయాలు తీసుకోవాలని ట్రంప్ ఆదేశించారు. ప్రతి ఏజెన్సీ ఉద్యోగుల తగ్గింపుకు ప్రణాళికలు రూపొందించాలని మరియు అవసరమైన స్థాయిలో మాత్రమే నియామకాలు చేయాలని ఈ ఆదేశాలలో పేర్కొన్నారు.


Also Read: ఎలన్ మస్క్‌కు రహస్య సంతానం.. తన బిడ్డేనని ప్రకటించిన అమెరికా రచయిత్రి

మస్క్ నిర్ణయంపై అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ లోని ఓ సీనియర్ ఎపిడెమియోలాజిస్ట్ (మహమ్మారి వ్యాధుల నిపుణుడు) ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. “అమెరికా మరో మహమ్మారి అంచున ఉంది. ఇలాంటి సమయంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడగలిగే వైద్య నిపుణులను ఉద్యోగాల నుంచి తొలగించేస్తున్నాం. ఇది వివేకమేనా?” అని ప్రశ్నించారు.

యూఎస్ మిలిటరీలో ట్రాన్స్‌జెండర్ల నియామకాలపై కూడా నిషేధం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పరిపాలనలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల, మహిళల క్రీడా పోటీల్లో ట్రాన్స్‌జెండర్లు పాల్గొనడాన్ని నిషేధించినట్లు తెలిసిందే. ఇప్పుడు, ఆ దేశ మిలిటరీ విభాగంలో ట్రాన్స్‌జెండర్ల నియామకాన్ని కూడా నిషేధించారు. ఈ విషయంలో అమెరికా సైన్యం ఒక ప్రకటన జారీ చేసింది.

‘ట్రాన్స్‌జెండర్లు సైన్యంలో చేరడాన్ని అమెరికా మిలిటరీ విభాగం నిషేధిస్తుంది. అదే విధంగా, సర్వీసులో ఉండగా లింగమార్పిడి చికిత్సలకు అనుమతించబోము. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుంది. అమెరికాకు సేవ చేయాలనుకునే జెండర్ డిస్ఫోరియా వ్యక్తులను మేం గౌరవిస్తాం. కానీ, తమను తాము ట్రాన్స్‌జెండర్లుగా భావించే వారి నియామకాలను ఆపేస్తున్నాం. ఇప్పటికే సర్వీసులో ఉన్నవారు లింగమార్పిడి చికిత్సలు చేయించుకోవడానికి సంబంధించిన వైద్య ప్రక్రియలను కూడా నిలిపివేస్తున్నాం’ అని సైన్యం తన ప్రకటనలో పేర్కొంది.

ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ట్రాన్స్‌జెండర్లు సాయుధ దళాల్లో చేరకుండా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, అప్పటికే మిలిటరీలో పనిచేస్తున్న వారిని కొనసాగించారు. ఇప్పుడు, ప్రమాణస్వీకారానికి ముందు నిర్వహించిన ర్యాలీలో మహిళల క్రీడల్లో ట్రాన్స్‌జెండర్లు పాల్గొనకుండా నిలువరిస్తానని ట్రంప్ పేర్కొన్నారు. ఆ దిశగా ఇటీవల కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. ఇప్పుడు, ఆర్మీలో ట్రాన్స్‌జెండర్ల నియామకాన్ని పూర్తిగా తొలగించారు.

ట్రాన్స్‌జెండర్ల హక్కులపై రిపబ్లికన్ పార్టీ నేతలు తీవ్ర అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం, ఒలింపిక్స్ వేదికగా అల్జీరియాకు చెందిన ఇమానె ఖెలిఫ్ విషయంలో లింగ వివాదం నడిచింది. అప్పుడు, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మహిళల ఆటల్లో పురుషులు పాల్గొనకుండా చేస్తానని వ్యాఖ్యానించారు. ఇటీవల ఎన్నికల్లో గెలిచిన డెమోక్రటిక్ సభ్యురాలు, ట్రాన్స్‌జెండర్ సారా మెక్‌బ్రైడ్ (Transgender Sarah McBride)ను మహిళల బాత్‌రూమ్‌లోకి అనుమతించబోమని రిపబ్లికన్లు ప్రత్యేక తీర్మానం తీసుకువచ్చారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×