BigTV English

South Korea Aeroplane Accident : పక్షులు విమానాన్ని కూల్చేస్తాయా? అదెలా సాధ్యం.. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటీ?

South Korea Aeroplane Accident : పక్షులు విమానాన్ని కూల్చేస్తాయా? అదెలా సాధ్యం.. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటీ?

South Korea Aeroplane Accident : అత్యంత సురక్షిత ప్రయాణ మార్గాల్లో విమాన ప్రయాణాలు మొదటి స్థానంలో ఉంటాయి. రోడ్డు, రైలు సహా ఇతర ప్రయాణాలతో పోల్చితే.. సురక్షిత, తక్కువ ప్రమాద రేటు కలిగిన ప్రయాణ సాధనాలుగా విమానాలు గుర్తింపు పొందాయి. కానీ.. ఇటీవల చోటుచేసుకున్న కొన్ని ప్రమాదాల్ని పరిశీలిస్తే.. విమానంలోని సాంకేతిక లోపాల కంటే.. బయటి పరిస్థితులే ప్రధాన కారణాలుగా తేలుతున్నాయి. వాటిలో ముఖ్యమైంది, ప్రమాదకరమైంది ఏంటో తెలుసా. పక్షులు ఢీ కొట్టడం. అవును.. చాలా విమాన ప్రమాదాలకు పక్షులే కారణంగా నిపుణులు చెబుతున్నారు.


రెండు రోజుల క్రితం సౌత్ కొరియాలోని మువాన్‌కు జెజు ఎయిర్ ఫ్లైట్ 7C2216 అనే విమానం.. థాయ్ రాజధాని బ్యాంకాక్ నుంచి వచ్చింది. ల్యాండింగ్ కేర్ లో సాంకేతిక సమస్య కారణంగా ఈ విమానం రన్ వే పై జారిపోయి ప్రమాదానికి గురైంది. ఇందులోని 181 మంది ప్రయాణికుల్లో 179 మంది మరణించారు. విమాన తోక భాగంలోని ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల సంఖ్యను బట్టి సౌత్ కొరియాలో అత్యంత ఎక్కువ మంది చనిపోయిన విమాన ప్రమాదంగా చెబుతున్నారు. కాగా.. ఈ ప్రమాదానికి కారణాల్ని అధికారులు అన్వేషిస్తున్నారు. అందులో..పక్షులు ఢీ కొట్టడం వల్ల ఏమైనా ప్రమాదం సంభవించిందా అనే కోణమూ ఉందని అధికారులు తెలిపారు. దీంతో.. పక్షలు కారణంగా విమాన ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి. వాటి తీవ్రత ఏంటి అనే విషయాలపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

పక్షులతో వచ్చే ప్రమాదం ఏంటి


విమాన భద్రతకు పక్షుల గుంపు కారణంగా వచ్చే ముప్పులు ప్రధాన సమస్యగా ఎయిర్ పోర్ట్ అధికారులు తెలుపుతున్నారు. ముఖ్యంగా.. ల్యాండింగ్, టేక్ ఆఫ్ సమయాల్లో పక్షుల కారణంగా అధిక ప్రమాదాలు జరుగుతాయని చెబుతున్నారు. రోజూ అంతర్జాతీయంగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. కానీ.. వాటిలో కొన్ని మాత్రం చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయంటున్నారు. విమాన క్యాబిన్ ను పక్షులు ఢీ కొట్టిన సందర్భాల్లో కంటే.. నేరుగా విమాన ఇంజిన్ ని ఢీ కొట్టినప్పుడు ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయని చెబుతున్నారు.

అత్యంత వేగంగా తిరిగే ఎయిర్ క్రాఫ్డ్ ఇంజిన్లు.. చాలా బలంగా గాలిని లోపలికి తీసుకుని బయటకు వదిలేస్తుంటాయి. ఈ క్రమంలో పక్షులు పరిసరాల్లోకి వస్తే.. లోపలికి లాగేసుకుంటాయి. దాంతో.. ఇంజిన్ పాడైపోతాయని అంటున్నారు. ఎగిరే సమయాల్లో వాటి థ్రస్ట్ కోల్పోయి.. ఘోరమైన ప్రమాదంలోకి వెళ్లే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
ఒకవేళ ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు తలెత్తితే.. వెంటనే ఫైలెట్లు.. సమీపంలోని విమానాశ్రయాల్లో అత్యవసర ల్యాండింగ్ చేస్తుంటారు. అలాగే.. విమాన క్యాబిన్ లోని ఫైలేట్ విండ్ షీల్డ్ ను బలంగా పక్షులు ఢీ కొట్టినప్పుడు ప్రమాదాల తీవ్రత అధికంగా ఉంటుందని చెబుతున్నారు. విండ్ షీల్డ్ కి పగుళ్లు వస్తే.. మొత్తం విమానం ప్రమాదంలో చిక్కుకున్నట్లే.. అలాంటి సందర్భాల్లోనూ విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేయాల్సిందే.

ఇలాంటి ప్రముఖ ఘటన ఒకటి 2009 లో చోటుచేసుకుంది. అమెరికాలోని లాగార్డియా విమానాశ్రయం నుంచి గాల్లోకి లేచిన యూఎస్ ఎయిర్ ప్లైట్.. నిముషం కంటే తక్కువ సమయంలోనే విమానంలోని రెండు ఇంజిన్లను పక్షులు ఢీకొట్టాయి. దీంతో.. విమానాన్ని ఎలా కిందకి దించాలనే నిర్ణయం తీసుకునేందుకు పైలెట్ కు కేవలం క్షణాలు మాత్రమే సమయం ఉండగా.. అత్యంత సాహసంతో మంచుతో గట్టకట్టిన నదిపై 140 కిలోమీటర్ల వేగంతో విమానాన్ని ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో 155 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కానీ.. విమానం.. అత్యంత ఎత్తులో ఉంటే మాత్రం ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

అయితే.. చాలా సంఘటనల్లో విమానంలో ఏదో ఓ ఇంజిన్ లోకి పక్షులు వెళుతుంటాయి. అప్పుడు ఒక ఇంజిన్ పాడైపోయినా, మరో ఇంజిన్ సాయంతో ఎయిర్ క్రాఫ్ట్ ను నేలకు దించేందుకు.. విమానయాన సంస్థలు బోయింగ్-737, ఎయిర్ బస్- A320 వంటివి సరికొత్త సాంకేతికతో నూతన విమానాల్ని తయారు చేస్తున్నాయి.

Also Read : 400 కి.మి పొడవు, 5 కి.మి వెడల్పుతో భారీ సోలార్ ప్రాజెక్టు.. ఇన్నాళ్లు రహస్యంగా నిర్మాణం

ఈ సమస్యకు పరిష్కారం ఏంటి.
సులువుగా చెప్పాలంటే.. ఎయిర్‌ఫీల్డ్ చుట్టూ పక్షుల స్థావరాలు ఉంటే పక్షులు ఢీకొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇందుకు అనేక కారణాలు.. వాటిలో వర్షాకాలంలో ఎయిర్ ఫీల్డ్ చుట్టూ ఉండే నీటి కుంటల్లో కీటకాలు గుడ్లు పెడతాయి ఇవి పక్షుల్ని ఆకర్షిస్తాయి. ఎయిర్‌ఫీల్డ్ చుట్టూ పక్షులను ఆకర్షించే ప్రాంతాలను నిరోధించాలని చెబుతుంటారు. ఉదాహరణకు.. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో ప్రతీ 10 వేల విమానాల రాకపోకలకు 11 పక్షుల కారణంగా ప్రమాదాలు జరిగినట్లు గుర్తించారు. ఇలా ఎందుకు జరుగుతుందని అధికారులు పరిశీలించగా.. విమానాశ్రయ రన్ వే కు సరిగా ఎదురుగా పెద్ద చెత్త కుప్ప ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వచ్చే పక్షులు.. నేరుగా విమానాల టేక్ ఆఫ్, ల్యాండింగ్ సమయాల్లో ప్రమాదకరంగా మారినట్లు గుర్తించారు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×