Chinmayi Sripada : టాలీవుడ్ లో తరచుగా వివాదాలతో వార్తలు నిలిచే సెలబ్రిటీలో సింగర్ చిన్మయి (Chinmayi Sripada) కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. సామాజిక అంశాలపై స్పందిస్తూ, తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పే చిన్మయికి ఓ వర్గం సపోర్ట్ చేస్తే, మరో వర్గం ట్రోల్ చేస్తూ ఉంటుంది. అయినప్పటికీ పట్టించుకోకుండా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తుంది చిన్మయి. అయితే తాజాగా ఈ అమ్మడు “మరోసారి వర్జిన్ భార్య కావాలంటే ఆశలన్నీ వదిలేసుకోవాల్సిందే” అంటూ ఓ నెటిజన్ చేసిన పోస్ట్ కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది.
తాజాగా సోషల్ మీడియా లో ఓ నెటిజన్ “ఒక్క బ్లింక్ ఇట్ యాప్ నుంచే ఒక్కరోజులోనే లక్షకు పైగా కండోమ్స్ అమ్ముడయ్యాయి అని బ్లింక్ ఇట్ సీఈవో అన్నారు. ఇంకా ఇతర ఈ కామర్స్ సైట్స్ నుంచి అమ్ముడైన వీటి సంఖ్య చూస్తే షాక్ అవుతారు. ఈ మార్కెట్స్, మార్కెట్ సేల్స్ నుంచి ఆల్మోస్ట్ రోజుకు 10 మిలియన్లకు పైగానే కండోమ్ లు అమ్ముడు అవుతున్నాయి. ఈ లెక్కన చూస్తే వర్జిన్ అమ్మాయి భార్యగా వస్తుందనే ఆశను వదిలి పెట్టాల్సిందే” అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశాడు.
అయితే ఆ పోస్ట్ చూసిన చిన్మయి (Chinmayi Sripada) ఈ ట్వీట్ పై తాజాగా స్పందిస్తూ “మగాళ్లు పెళ్ళికి ముందు అమ్మాయిలతో అలాంటి పని చేయడం మానుకోవాలి. మీ అన్నదమ్ముల్ని, ఫ్రెండ్స్ ని పెళ్లి అయ్యేదాకా అలాంటి పని చేయొద్దని చెప్పండి” అంటూ అదిరిపోయే కౌంటర్ వేసింది. అక్కడితో ఆగలేదు ఇంకాస్త స్ట్రాంగ్ వర్డ్స్ వాడుతూ గట్టిగానే సమాధానం చెప్పింది. దీంతో చిన్మయి ఇచ్చిన ఆ రిప్లైకి సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, కొత్త చర్చకు దారి తీశాయి.
అసలే చిన్మయి (Chinmayi Sripada) తరచుగా ఇండియా మీద, తల్లిదండ్రుల మీద, పేరెంట్స్ పెంపకం మీద అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ట్వీట్స్ వేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇండియా మహిళలకు సేఫ్ కానే కాదు అనే విధంగా మాట్లాడుతుంది. ఇక్కడ అమ్మాయిల మీద జరిగే ఘోరాల గురించి తరచుగా ఆమె పోస్టులు చేసే సంగతి కూడా తెలిసిందే. ఎవరైనా అమ్మాయి తనకు అన్యాయం జరిగింది అంటే చాలు వెంటనే స్టాండ్ తీసుకుంటుంది. దానికి కారణమైన వాళ్ళను ఉతికి ఆరేస్తుంది.
అంతేకాకుండా ఒకప్పుడు క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమంలో చిన్మయి పేరు మార్మోగిపోయింది. ఆ టైంలో వైరాముత్తు మీద ఆమె చేసిన ఆరోపణల వల్ల కోలీవుడ్లో బ్యాన్ కావాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే అక్కడ చిన్మయికి పాటలు పాడే ఛాన్స్ తో పాటు డబ్బింగ్ చెప్పే అవకాశాలను కూడా ఇస్తున్నారు. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా , సందర్భం వచ్చినప్పుడల్లా శివంగిలా సింగర్ కార్తీక్, వైరాముత్తు వంటి ప్రముఖుల బండారాన్ని బయట పెట్టే విధంగా కామెంట్స్ చేస్తూ ఉంటుంది. ఇక ఎప్పటిలాగే ఇప్పుడు కూడా వర్జిన్ అమ్మాయి కావాలంటే ముందు మీరు అలాంటి పనులు చేయడం మానేయండి అంటూ సెటైర్ వేసింది.