BigTV English

Blast In Lahore: పాకిస్తాన్‌లోని లాహోర్ సిటీలో వరుస పేలుళ్లు, ధృవీకరించిన అధికారులు, ఎయిర్‌పోర్టు మూసివేత

Blast In Lahore: పాకిస్తాన్‌లోని లాహోర్ సిటీలో వరుస పేలుళ్లు, ధృవీకరించిన అధికారులు, ఎయిర్‌పోర్టు మూసివేత

Blast In Lahore: పాకిస్తాన్‌‌కు అసలు టెన్షన్ మొదలైంది.ఆపరేషన్ సిందూర్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతోంది దాయాది దేశం పాకిస్తాన్. ఈ క్రమంలో గురువారం ఉదయం లాహోర్ సిటలో పేలుళ్లు సంభవించాయి. దీన్ని అధికారులు ధృవీకరించారు. ఈ నేపథ్యంలో లాహోర్ ఎయిర్ పోర్టును మూసివేశారు అధికారులు.


లాహోర్ సిటీలో వరుస పేలుళ్లు

గురువారం ఉదయం దాదాపు ఎనిమిది గంటల సమయంలో లాహోర్‌ సిటీలోని వాల్టన్ రోడ్డులో భారీ పేలుళ్లు సంభవించాయి. వాల్టన్ విమానాశ్రయానికి సమీపంలోని గోపాల్ నగర్, నసీరాబాద్ ప్రాంతాలలో వరుస పేలుళ్లు చోటు చేసుకున్నాయి. భారీ శబ్దంతో పేలుళ్లు సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.


భయంతో తమ ఇళ్ల నుండి ప్రజలు బయటకు పరుగులు తీశారు. గాలిలోదట్టమైన పొగ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ విషయాన్ని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పేలుడు జరిగిన కొద్దిసేపటికే ఆ ప్రాంతంలో సైరన్లు వినిపించాయి. చాన్నాళ్లు సైరన్ మోగడంతో లాహోర్ సిటీ వాసులు అలర్ట్ అయ్యారు. దీంతో ఆ సిటీలో అత్యవసర పరిస్థితిని మరింత పెంచింది.

పేలుళ్ల గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. పేలుడు జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. ఘటన గురించి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఈ ప్రాంతానికి బాంబులు పేలడానికి గల  కారణలేంటి? ఎవరైనా వాటిని తీసుకొచ్చారా? ఎవరైనా కావాలనే చేస్తున్నారా? ప్రజల్లో మరింత భయాందోళనలు రేకెత్తించడానికి ఈ తరహా ప్లాన్ చేస్తున్నారా? ఇలా అనేక అనుమానాలు మొదలయ్యాయి.

ALSO READ: యుద్దం జరిగితే పాకిస్థాన్ ప్రజలు ఇండియాను వ్యతిరేకించరు, పాక్ మత పెద్ద వ్యాఖ్య

ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆదేశ ప్రజల్లో కొంత భయం నెలకొంది. కేవలం ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ దాడులు చేసినా, తమ దేశంపై దాడి చేసినట్టుగా క్రియేట్ చేసే పనిలో పడింది దాయాది దేశం. దీనికితోడు  ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ కొన్ని సిటీల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. అధికారుల సెలవులను సైతం రద్దు చేసింది.  దీంతో అక్కడి ప్రజల్లో భయం నెలకొంది.

ఇదంతా ఒక వైపు వెర్షన్ మాత్రమే. రెండో వైపు వద్దాం. ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ దాడి చేసి 24 గంటలు గడుస్తోంది.  అయినా ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేదన్నది అతివాదుల మాట. ఈ క్రమంలో వరుస పేలుళ్లు చోటు చేసుకున్నాయని అంటున్నారు. మరోవైపు ఉగ్రవాదుల కీలక నేతల నుంచి పాక్‌‌ ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రమవుతున్నట్లు ఆదేశ మీడియాలో వార్తలు హంగామా చేస్తున్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో ఏం జరుగుతుందో తెలియన పాకిస్థాన్‌లోని ప్రజలు బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ టెన్షన్ ఎన్నాళ్లు అంటూ పలువురు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.  ఇప్పుడున్న పరిస్థితుల్లో పాక్ ప్రభుత్వానికి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నచందంగా మారింది. ఈ పరిస్థితి ఆదేశం ఎప్పుడు బయటపడుతుందో చూడాలి.

 

Related News

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Donald Trump: ట్రంప్ టారీఫ్ బాంబ్.. ఏ రంగాలపై ఎఫెక్ట్..?

Breaking News: కుప్పకూలిన మరో విమానం.. బూడిదైన శవాలు

Indian Army: అమెరికా చెప్పేదొకటి, చేసేదొకటి.. ట్రంప్ తీరుని ఎండగట్టిన ఇండియన్ ఆర్మీ

Trump on India: రష్యా నుంచి ఇండియా ఆయిల్ తీసుకుంటే.. ట్రంప్‌కు ఎందుకు మంట? కారణాలు ఇవే

Big Stories

×