Nigeria: నైజీరియాలోని ఉత్తర-మధ్య నైజర్ ప్రాంతంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో దాదాపు 60 మంది మరణించారు. చాలామంది కోసం గాలింపు కొనసాగుతోంది. రక్షించివారిలో మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
నైజీరియాలోని ఉత్తర-మధ్య నైజర్ ప్రాంతంలో ఓ బోటు బయలుదేరింది. తుంగన్ సులే నుండి దుగ్గ పట్టణానికి సంతాప సందర్శన కోసం వెళ్తోంది. అయితే బోటులో లెక్కకు మించి ప్రజలు ఎక్కేశారు. దాదాపు 100 మంది బయలుదేరారు. దాని సామర్థ్యం కేవలం 50 మంది మాత్రమే.
మలాలే జిల్లాలో తుంగన్ సులే పట్టణం నుండి బయలుదేరిన ఆ బోటు కైంజి జలాశయం మీదుగా దుగ్గా పట్టణం వైపు వెళుతోంది. అయితే బోర్గు ప్రాంతానికి వచ్చేసరికి బోటు బ్యాలెన్స్ తప్పినట్టు కనిపిస్తోంది. గౌసావా కమ్యూనిటీ సమీపంలో నీటిలో మునిగిపోయిన పెద్ద చెట్టును ఆ బోటు ఢీ కొంది.
కిక్కిరిసిన ప్రయాణికులతో ఉన్న ఆ బోటు, వెంటనే బోల్తా పడింది. స్పాట్‌లో 30 మంది ఈలోకాన్ని విడిచిపెట్టారు. కొందరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మరికొందరు తోటివారిని రక్షించే ప్రయత్నం చేశారు. ఇప్పటివరకు వివిధ న్యూస్ ఏజెన్సీల ద్వారా అందుతున్న సమాచారం మేరకు దాదాపు 60 మంది మృత్యువాత పడినట్టు తెలుస్తోంది.
ALSO READ: గ్రీసులో జనాబా సంక్షోభం.. పిల్లలు లేక స్కూల్స్ మూసివేత
రక్షించినవారిలో మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారిని వెంటనే సమీపంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. గల్లంతు అయినవారిలో చాలామంది జాడ కనిపించలేదు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అక్కడి కాలమాన ప్రకారం ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
ఈ ప్రమాదం గురించి స్థానిక బోటు నిర్వాహకులు కొన్ని విషయాలు బయటపెట్టారు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే తాము అక్కడికి చేరుకున్నామని చెప్పారు. ఘటన సమయంలో పడవలో 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారని చెప్పాడు. నదిలో 31 మంది బాడీలను వెలికితీశామని, పడవను వెలికి తీసినట్టు తెలిపాడు. మరణించిన వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారని చెప్పాడు.
స్థానిక బోటు డైవర్లు, అత్యవసర సిబ్బంది.. గల్లంతు అయినవారి కోసం వెతుకుతున్నారని నైజర్ రాష్ట్ర అత్యవసర నిర్వహణ సంస్థ పేర్కొంది. ఓవర్‌లోడ్ కారణం ఒకటైతే.. నదిలో అడ్డుగా ఉన్న చెట్టుఢీకొట్టడం మరొక కారణంగా చెబుతున్నారు. నైజీరియాలో వర్షాకాలం సమయంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతాయి.
ఆ దేశంలో కొన్ని ప్రాంతాలకు అసలు రహదారులు ఉండవు. ఎక్కకైనా వెళ్లాలంటే పడవలను ప్రజలు ఆశ్రయిస్తారు. దీనికారణంగా పడవల వాడకం ఎక్కువగా పెరిగింది. దీనికితోడు భద్రతా లోపాలు వల్ల నిత్యం ఆ దేశంలో పడవ ప్రమాదాలు జరుగుతున్నాయి.