Gundeninda GudiGantalu Today episode September 4th: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనాని ఓదార్చే పనిలో వారిద్దరి మధ్య జరిగిన సంఘటనలను గుర్తుచేస్తుంది మీనా. ఇక అప్పుడే ప్రభావతి మీనాపై అరుస్తూ కేకలు వేస్తుంది.. మీనాని ప్రభావతి పిలుస్తున్న సమయంలోనే పార్వతి ఇంటికి వస్తుంది. రేపు బాలు మీనాల పెళ్లిరోజు కదా బట్టలు పెడదామని వచ్చానని అంటుంది. ఆ మాట వినగానే నువ్వు ఎందుకు వచ్చావు అమ్మ ఇక్కడికి అని మీనా అంటుంది. రేపు మీ పెళ్లి రోజు కదమ్మా అందుకే మీకు బట్టలు పెడదామని వచ్చానని పార్వతి అంటుంది. ఒక ప్లేట్ తీసుకురమ్మని పార్వతి మీనా తో అంటుంది.. పార్వతిని ప్రభావతి అవమానిస్తుంది. బాలు మీనాల పెళ్లిరోజును గ్రాండ్గా చేయాలని సుశీల ఊరు నుంచి వస్తుంది. మౌనిక కి ఫోన్ చేసి రమ్మని చెప్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. సుశీలను చూసి అందరూ సంతోషపడతారు. ఎన్నాళ్లయింది మిమ్మల్ని చూసి అని అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ప్రభావతి మాత్రం ఎందుకు వచ్చిందా అని అడుగుతుంది. రేపు నా మనవడు మనవరాలు పెళ్లిరోజు కదా గ్రాండ్ గా చేయాలి అని అంటుంది సుశీల. ప్రభావతి మాత్రం ఏంటి ఫంక్షన్ హాల్ అంత డబ్బులు మా దగ్గర ఉన్నాయి మీరు అనుకుంటున్నారా అని అంటుంది. మౌనికొస్తే ఏదైనా గొడవ చేస్తారేమో అని టెన్షన్ పడుతుంది మీనా. ప్రభావతి మౌనికకు ఫోన్ చేస్తే సుశీల మాట్లాడుతుంది. సుశీల మౌనిక వాళ్ళ అత్తతో మాట్లాడి వాళ్ళని పంపించండి అమ్మ అని అడుగుతుంది..
సువర్ణ తప్పకుండా వాళ్ళిద్దర్నీ పంపిస్తానని అంటుంది.. అప్పుడే అక్కడికి వచ్చిన సంజయ్ ఏంటో సంతోషము ఎక్కడికో పంపిస్తానని అంటున్నారు ఏంటి అని అడుగుతాడు.. ఏం లేదురా వీళ్ల బాలు అన్నయ్య మీనా వదినల పెళ్లిరోజు అంట వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి రమ్మని అడిగారు అని అంటుంది.. ఇంటి అల్లున్ని కనీసం నాకు ఫోన్ చేసి ఏ విషయం కూడా చెప్పలేదు అలాంటిది నా గురించి ఎలా ఆలోచిస్తారు వాళ్ళు అని సంజయ్ అంటాడు.. ముందుగా నీకే ఫోన్ చేశారంట నీ ఫోన్ కలవలేదని మౌనికకు ఫోన్ చేశారు. పక్కనే ఉంటే ఇవ్వమన్నారు కానీ లేడు అని చెప్పాను. పదేపదే రమ్మని అడిగారు అని సువర్ణ అంటుంది.
ఇంటి అల్లుడుగా బాలు నాకు ఏ రోజు మర్యాద ఇవ్వలేదు ఇప్పుడు ఎలా ఇస్తారు కొత్తగాని సంజయ్ అంటాడు. మా వాళ్ళకి మీరంటే గౌరవం అండి అని మౌనిక అంటుంది. వాడు రాకపోతే నేమా నువ్వు వెళ్లి మీ ఇంట్లో వాళ్లతో సంతోషంగా ఉండి రా అనేసి సువర్ణ అంటుంది. సంజయ్ ఇదొక్కటే అక్కడికి వెళ్లి సంతోషంగా ఉంటుందా అసలు ఉండనివ్వను అని అనుకుంటాడు. నేను కూడా వెళ్తాను అని సంజయ్ అంటాడు. ఏంటి నువ్వు వెళ్తావా అని సువర్ణ అంటుంది ఇక మౌనికని తీసుకొని సంజయ్ వాళ్ళింటికి వెళ్తాడు.
బాలు మీనాల ఫంక్షన్ గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు కానీ ప్రభావతి వస్తే అందరూ మౌనంగా ఉంటారు. మనోజ్ కూడా ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళందరూ అని అడుగుతాడు.. కానీ సుశీల మాత్రం ఇదంతా కాదు ఫంక్షన్ నీకు గ్రాండ్ గా చేయాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మౌనిక వచ్చి పిలుస్తుంది. అందరూ మౌనిక దగ్గరికి వెళ్లి సంతోషంగా పలకరిస్తారు.. అందరూ మౌనికతోనే మాట్లాడడం సంజయ్ ఓర్చుకోలేక పోతాడు.. మీ కూతురు మాత్రమే కాదు ఇక్కడ నేనొకడు వచ్చాను అది గమనించరే మీరు అని సంజయ్ అంటాడు. అందరూ కలిసి సంజయ్ ని ఇంట్లోకి తీసుకొస్తారు.
ఇంటికి అల్లుడు వచ్చారు కనీసం మర్యాదలు కూడా చేయరా అని సంజయ్ మొహం మీదే అనేస్తాడు. ప్రభావతి మీ నాకు మంచినీళ్లు తీసుకురమ్మని చెప్తుంది. కానీ మీనా మాత్రం సంజయ్ చేసిన పనిని గుర్తు చేసుకుని ఇవ్వడానికి ఇష్టపడదు. ఇక శృతి మీ అల్లుడు గారికి మీరే బాగా మర్యాదలు చేసుకోండి. మాకు ఎలా చేయాలో తెలియదు కదా అని వెటకారంగా మాట్లాడుతుంది. ప్రభావతి కాఫీ ని తెచ్చి ఇస్తుంది. ఇక మీనా బాలుని వంట గదిలోకి తీసుకొని వెళ్తుంది.
హాల్లో అంతమంది ఉంటే మనిద్దరం వంటగదిలో ఉంటే ఏమైనా బాగుంటుందా చెప్పు మీనా? దానికి రాత్రి సమయం ఉంది కదా అని అంటాడు.. నేను పిలిచింది అందుకు కాదు మీరు నోరుని కంట్రోల్లో పెట్టుకోవాలి ముల్లకంప అని అంటుంది.. సంజయ్ కావాలనే మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు అది మీరు గుర్తించి ఏ గొడవ చేయకుండా అంటే సంతోషమని అంటుంది. ఇక ప్రభావతి అప్పుడే వంటగదిలోకి ఎంట్రీ ఇస్తుంది. నువ్వు అబ్బాయి వెళ్లే లోగా నోరు మూసుకొని ఉండు ఎక్స్ట్రాలు మాట్లాడితే బాగోదు అని బాలు కి వార్నింగ్ ఇస్తుంది. దానికి బాలు ప్రయత్నిస్తాను అని అంటాడు.
ప్రభావతి మీనాకు ఒక పెద్ద లిస్ట్ ఇచ్చి ఇవన్నీ వెంటనే తయారు చేయాలి అని అంటుంది. ఆ లిస్టును చూసి మీనా ఇన్ని చెయ్యాలా అని అంటుంది.. బాలు ఇవన్నీ చేయడం నీకు సమస్యగా ఉందా ఏదో ఒకటి చేసి పడేయ్ అనేసి అంటాడు.. నాకు వంట చేయడం ఇబ్బంది కాదండి వాడి నోరు కంట్రోల్లో పెట్టుకోకపోతే నేను కంట్రోల్ తప్పేలా ఉన్నాను అని అంటుంది. ఇక సంజయ్ కి గది ఇవ్వడం గురించి మాట్లాడుకుంటారు. ఆ రోహిణి మా గదిలో మనోజ్ కి కింద పడుకుంటే నిద్ర రాదు అత్తయ్య. గది ఇవ్వడం కుదరదు.
Also Read : పల్లవికి అవని స్ట్రాంగ్ వార్నింగ్.. శ్రీకర్ ను వదిలేసిన శ్రీయా.. పార్వతికి అవమానం..
ఇకపోతే మీనాకు వంటల లిస్ట్ ఇస్తుంది ప్రభావతి. ఒక్కొక్కటిగా వంటలు చేసావా అని అడుగుతుంది. మీనాకు ఆర్డర్ వేయడం చూసిన సుశీల అన్ని ఒక్కటే ఎలా చేస్తుంది? నీ అల్లుడికి నువ్వే చేసుకోవాలి కదా కోడలు ఎవరైనా చేస్తారా అని అడుగుతుంది. మీ అల్లుడు నీకు గొప్ప అయినప్పుడు నువ్వే చేసుకోవాలి అంతేకనీ మీనా చేయాల్సిన అవసరం లేదు కదా అని సుశీల అంటుంది..ఆ మాటకి ప్రభావతి షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో బాలు మౌనిక గురించి నిజం తెలుసుకుంటాడేమో చూడాలి..