Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్ ఆఫీసుకు వచ్చిన రణవీర్ అమర్ కోసం వెయిట్ చేస్తుంటాడు. ఇంతలో అమర్ వస్తాడు. చెప్పండి అమర్ అర్జెంట్ గా రమ్మని రాథోడ్ చెప్పారు అని అడుగుతాడు. దీంతో అమర్ ఏంటి రణవీర్ నెర్వస్‌గా ఉన్నావు అని అడుగుతాడు. అదేం లేదు.. అసలు నన్ను ఎందుకు రమ్మన్నారు అని రణవీర్ అడుగుతాడు. చెప్తాను.. ఆరోజు నేను మీ ఇంటిక వచ్చినప్పుడు నా కూతురు నాకు కావాలి అని అంత గట్టిగా మాట్లాడిన నువ్వు మళ్ళీ ఇంకోసారి నీ కూతురు గురించి ఎందుకు అడగలేదు.. అనడంతో అంటే పదే పదే చెప్పి మిమ్మల్ని విసిగించడం ఎందుకని అడగలేదు అంటాడు రణవీర్.
సో నువ్వే సొంతంగా ట్రై చేస్తున్నావు అన్నమాట అని అమర్ అనగానే.. రణవీర్ భయంగా ఏంటి అమర్ గారు మీరు అంటుంది నాకేం అర్థం కావడం లేదు.. అంటాడు. అదే నీ కూతురు కోసం నువ్వే సర్చ్ చేస్తున్నావు అన్నమాట.. ఎంత వరకు వచ్చింది అని అమర్ అడగ్గానే.. ఏంటిది..? నాకు అర్థం కావడం లేదు.. అంటాడు రణవీర్. అదే నీ సొంత ప్రయత్నం.. అంటాడు అమర్. నేను కూడా నలుగురైదుగురికి చెప్పి ఉంచాను.. వాళ్లు కూడా వెతికే పనిలో ఉన్నారు అంటాడు రణవీర్. ఓకే నీకు మాయలు మంత్రాల పైన నమ్మకం ఉందా..? అని అమర్ అడగ్గానే.. రణవీర్ భయంతో.. మాయలు మంత్రాలా..? అంటూ ఏమీ తెలియనట్టు అనుమానంగా అడుగుతాడు. దీంతో అమర్ అదే రణవీర్.. సూపర్ న్యాచురల్ పవర్స్.. బ్లాక్ మ్యాజిక్, ఎక్సెట్రా.. ఎక్సెట్రా..అంటాడు అమర్.
దీంతో రణవీర్ ఎందుకు అలా అడుగుతున్నారు.. అంటాడు. ఏదో జస్ట్ తెలుసుకుందామని అమర్ చెప్పగానే.. రణవీర్ తాను చంభాను తీసుకుని వెళ్లి అమర్ ఇంట్లో చేసిన పూజలు గుర్తు చేసుకుంటుంటాడు. ఇంతలో అమర్ గట్టిగా రణవీర్ చెప్పు ఏమైనా ఐడియా ఉందా… అని అడుగుతాడు. దీంతో రణవీర్ నాకు అలాంటి వాటి మీద నమ్మకం లేదు అమరేంద్రగారు అని చెప్తాడు. అయితే నువ్వు ఆత్మలను మంత్రాలను నమ్మవన్నమాట అని అడుగుతాడు. దీంతో రణవీర్.. ఇప్పటి వరకు నాకు అలాంటి అవసరం రాలేదు.. ఇంతకీ నన్ను ఎందుకు పిలిచారో చెప్తారా..? నాకు అర్జెంట్ వర్క్ ఉంది వెళ్లాలి అని రణవీర్ చెప్పగానే.. అమర్ వెంటనే మీ అమ్మాయి దొరికింది రణవీర్ అంటాడు. దీంతో రణవీర్ నిజమా..? ఎక్కడ ఉంది..? తనని నేను ఇప్పుడే చూడాలి.. ఎక్కడుంది తను.. చూపించండి ఫ్లీజ్ అంటూ ఎమోషనల్ అయినట్టు నటిస్తాడు.
ఇంతలో అమర్ పాప ఇక్కడ లేదు.. వేరే సిటీలో ఉంది. పాప రావడానికి వన్ డే పడుతుంది. ఇంతకీ మీ పాప దొరికిన విషయం మీ వైఫ్‌కు చెప్పవా..? అంటాడు అమర్. అవును ఇప్పుడే చెప్తాను.. అంటూ రణవీర్ ఫోన్ తీసి వెంటనే ఆగిపోతాడు. దీంతో అమర్ సో మీ వైఫ్ ఎక్కడుందో మీకు తెలుసన్న మాట. చెప్పు రణవీర్ మీ వైఫ్ ఎక్కడుందో మీకు తెలుసా..? అని అడగ్గానే.. లేదు అమరేంద్ర తను ఎక్కుడుందో నాకు నిజంగా తెలియదు.. తెలిస్తే తనను షూట్ చేసి పడేస్తాను.. అంటాడు రణవీర్. మరి పాప విషయం చెప్పగానే.. మీ వైఫ్‌తో చెప్తాను అన్నావు.. మొబైల్ కూడా తీశావు.. అని అమర్ అడగ్గానే.. అదే పాప దొరికిన ఆనందంలో ఆ ఎగ్జైట్‌మెంట్‌లో నేనేం మాట్లాడానో.. నేను ఫోన్ ఎందుకు తీశానో నాకే తెలియడం లేదు.. అని చెప్తాడు రణవీర్..
దీంతో అమర్ ష్యూర్ నిజమేనా..? అని అడగ్గానే.. యా ష్యూర్ అమరేంద్రం నిజం.. ట్రస్ట్ మి. నా వైఫ్ ఎక్కడుందో నాకు నిజంగా తెలియదు.. అమరేంద్ర ఇంతకీ నా పాప ఎలా ఉంది. తను ఫోటో ఏదైనా ఉందా.? నేను ఇప్పుడే తనతో మాట్లాడాలి.. మేము కోల్‌కతా వెళ్లిపోతాను.. అంటూ రణవీర్ అడుగుతుండగానే.. వన్ డే వెయిట్ చేయ్ రణవీర్ పాప నీ కళ్ల ముందు ఉంటుంది. అప్పుడు నీకు ఒక క్లారిటీ వస్తుంది. నాకు ఒక క్లారిటీ వస్తుంది. అని అమర్ చెప్పగానే.. క్లారిటీనా..? అని రణవీర్ అడుగుతాడు. ఐ మీన్ పాపను తీసుకుని నువ్వు కోల్‌కతా వెళ్లిపోతావు కదా..? ఆ తర్వాత నా పని నేను చేఉకుంటాను.. ఈ విషయం చెప్పడానికి నేను మిమ్మల్ని పిలిపించాను. ఇక మీరు బయలుదేరొచ్చు అనగానే థాంక్స్ అమరేంద్ర అంటూ రణవీర్ వెళ్లిపోతాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం