
Boris Johnson : బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ త్వరలో ఓ కొత్త అవతారం ఎత్తబోతున్నారు. ‘జీబీ న్యూస్’ అనే ఓ యూకె టెలివిజన్ ఛానెల్‌లో ఆయన న్యూస్ ప్రెజెంటర్‌గా పని చేయబోతున్నారని ఆయన స్వయంగా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
“రష్యా నుండి చైనా వరకు, ఉక్రెయిన్‌లో యుద్ధం, ఆ సవాళ్లన్నింటినీ మనం ఎలా ఎదుర్కొంటాం, మనకు ఎదురుగా ఉన్న భారీ అవకాశాల గురించి నేను ఈ అద్భుతమైన కొత్త టీవీ ఛానెల్‌కు నా స్పష్టమైన అభిప్రాయాలను అందించబోతున్నాను” అని బోరిస్ జాన్సన్ తన ఎక్స్ (ట్విట్టర్) లో తెలిపారు.
ఇతర బ్రిటీష్ ఛానెళ్లకు భిన్నంగా ఫాక్స్ న్యూస్ వంటి యూఎస్ నెట్‌వర్క్‌ల మాదిరిగా వార్తలు, అభిప్రాయాలు, విశ్లేషణల మిశ్రమంతో జీబీ టీవీ ఛానెల్ 2021లో ప్రారంభమైంది. అయితే బ్రిటన్ బ్రాడ్‌కాస్టింగ్ వాచ్‌డాగ్ వివిధ సందర్భాలలో ‘జీబీ న్యూస్’ నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపణలు చేసింది.
రాజకీయాల్లోకి రాకముందు బోరిస్ జాన్సన్ పలు మీడియా సంస్థల్లో జర్నలిస్టుగా పనిచేశారు. ఇంతకు ముందే బోరిస్ జాన్సన్ ప్రపంచమంతా ప్రాచుర్యం పొందిన ‘డైలీ మెయిల్’ అనే వార్తాపత్రికకు కాలమిస్ట్‌గా పనిచేశారు. దేశ ప్రధానిగా పనిచేసిన ఓ వ్యక్తి ఓ న్యూస్ ప్రెజెంటర్‌గా మారితే ఆ వార్తల విశ్లేషణను చూసే వారి సంఖ్య మామూలుగా ఉండదు.
2019లో యూకె ప్రధాన మంత్రి బాధ్యతుల చేపట్టిన బోరిస్.. 2022లో కొన్ని వివాదాల కారణంగా తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుత యూకె ప్రధాని రిషి సునక్ కూడా బోరిస్ జాన్సన్ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా పనిచేశారు.
బోరిస్ జాన్సన్ 2024 ప్రారంభం నుంచి ప్రెజెంటర్, ప్రోగ్రామ్ మేకర్, వ్యాఖ్యాతగా తమ ఛానెల్‌లో పని చేస్తారని, వచ్చే ఏడాది బ్రిటన్ తో జరుగనున్నజాతీయ ఎన్నికలను కవర్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తారని ‘జీబీ న్యూస్’ న్యూస్ తెలిపింది. అలాగే యునైటెడ్ స్టేట్స్‌లో జరిగే ఎన్నికలను కూడా కవర్ చేస్తారని పేర్కొంది.
Revanth Reddy : రైతుల కోసం ఆ పని చేస్తే పోటీ నుంచి తప్పుకుంటా.. కేసీఆర్ కు రేవంత్ మరో సవాల్..