
Mansion 24: ఓంకార్ దర్శకత్వం వహించిన తాజా వెబ్ సిరీస్ ‘మ్యాన్షన్ 24’. వరలక్ష్మీ శరత్ కుమార్, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ సిరీస్ డిస్నీ హాట్‌స్టార్‌లో ఈనెల 17 నుంచే ప్రసారం అవుతోంది. రావు రమేష్, సత్యరాజ్, అభినయ, రాజీవ్ కనకాల, అవికా గోర్ కీలక పాత్రల్లో నటించారు.
కథ..
అమృత (వరలక్ష్మీ శరత్ కుమార్) ఓ ఇన్వెస్టిగేటివ్‌జర్నలిస్ట్. ఆమె తండ్రి కాళిదాసు (సత్యరాజ్) ఆర్కియాలజీ విభాగంలో పనిచేస్తూ ఒకరోజు కనిపించకుండా పోతాడు. కాళిదాస్ విలువైన సంపదతో పారిపోయాడని వార్తలు వస్తాయి. ఈ వార్తలు విన్న అమృత తల్లి (తులసి) మంచాన పడుతుంది. తన తండ్రి నిర్దోషని నిరూపించడానికి అమృత ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది? ఇంతకీ కాళిదాసు ఏమయ్యాడు? తెలియాలంటే మ్యాన్షన్ 24 చూడాల్సిందే!
ఎలా ఉందంటే?
ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అమృతగా వరలక్ష్మి శరత్‌కుమార్ కనిపించింది. ఇలాంటివి ఆమెకు కొత్తేమీ కాదు. రాజీవ్ కనకాల పాత్ర చూస్తే, ఈ సిరీస్ మొదలు పెట్టి చాలా నెలలే అవుతోందని అర్థమవుతోంది. ఎందుకంటే ఇటీవల ఆయన ముఖంలో వచ్చిన మార్పును స్పష్టంగా గమనించవచ్చు. అయితే వరలక్ష్మి శరత్ కుమార్, సత్యరాజ్ పాత్రలను పూర్తి స్థాయిలో వాడుకోలేదేమో అనిపిస్తుంది.
Revanth Reddy : కొడంగల్ లో పోటీకి కేసీఆర్ సిద్ధమా? కామారెడ్డిలో పోటీపై రేవంత్ క్లారిటీ ..