
Telangana : తెలంగాణలో నిరుద్యోగ లెక్కలను విడుదల చేసింది కాంగ్రెస్. తెలంగాణలో నిరుద్యోగం ఆకాశాన్నంటిందని.. రాష్ట్రంలో నిరుద్యోగశాతం 15.1 శాతానికి చేరిందని తెలిపింది. ఇది జాతీయ సగటు నిరుద్యోగశాతం కంటే ఎక్కువని ప్రకటించింది. తెలంగాణలో నిరుద్యోగుల సంఖ్య 40 లక్షలు ఉందని.. బిశ్వాల్ కమిటీ రిపోర్ట్ ప్రకారం లక్షా 90 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు.
ఇక 9 ఏళ్లలో నిరుద్యోగం కారణంగా3 వేల 607 మంది యువత ఆత్మహత్య చేసుకున్నారని తెలిపింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం 65 లక్షల ఉద్యోగాలు రావాలని.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వల్లే ఉద్యోగాలు రాలేదని తెలిపింది. 20 వేల టీచర్ల పోస్టులను బీఆర్‌ఎస్ ప్రభుత్వం భర్తీ చేయలేదని తెలిపింది కాంగ్రెస్.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం 3 వేల 16 రూపాయలు ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించింది కాంగ్రెస్. ప్రతి నిరుద్యోగికి ప్రభుత్వం లక్షా 71వేల 912 బాకీ పడిందని గుర్తు చేసింది కాంగ్రెస్.