BigTV English

IND vs ENG Test Series : ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్..! తొలి రెండు మ్యాచ్ లకు ఇండియా టీం ఇదే..!

IND vs ENG Test Series : ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్..! తొలి రెండు మ్యాచ్ లకు  ఇండియా టీం ఇదే..!

IND vs ENG Test Series: ఇండియన్ ప్రీమియర్ లీగ్ తో క్రికెట్ ఆడే క్రీడాకారులు తళుక్కుమని మెరుస్తున్నారు. ఇది టీమ్ ఇండియా సెలక్షన్ కమిటీకి కత్తిమీద సాముగా మారింది. అందరూ కూడా అద్భుతంగా ఆడుతున్నారు. ఎవరికి వారుగానే అదరగొడుతున్నారు. వీరికిప్పుడు అంతర్జాతీయ అనుభవం కావాలి. అవకాశాలు విరివిగా రావాలి. అన్ని దేశాల జట్ల బౌలర్లతోనూ ఆడగలగాలి. అప్పుడు రాటుదేలుతారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరిగే మొదటి రెండు టెస్టులకు జట్టుని ఎంపిక చేశారు. మళ్లీ ఇక్కడ బాగా ఆడేవారుంటారు. పెర్ ఫార్మెన్స్ చేయలేని వారు బయటకు వెళ్లాల్సి ఉంటుంది.


ప్రస్తుతం టీమ్ ఇండియాలో ఫైనల్ టీమ్ లోకి ఎవరిని తీసుకోవాలో అర్థంకాక, బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఏం చేసిందంటే, ఒకొక్క ఫార్మాట్ కి ఒకొక్క టీమ్ ని ఎంపిక చేస్తోంది. ఇందులో బాగా ఆడేవారిని కూడా ఒకొక్కసారి విధిలేని పరిస్థితుల్లో పక్కన పెట్టాల్సి వస్తోంది. అలాగే కొత్తవారికి అవకాశం ఇవ్వాల్సి వస్తోంది. ఉదాహరణకి టీ 20లో కేఎల్ రాహుల్ ని అలాగే పక్కన పెట్టారు. శ్రేయాస్ అయ్యర్ మాత్రం వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవడం లేదనే విమర్శలున్నాయి.

ఇకపోతే రెండు టెస్ట్ లకి ఎంపికైన టీమ్ సభ్యుల్లో  ధృవ్ జురెల్ కొత్తవాడున్నాడు. అలాగే కేఎస్ భరత్ ని వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ గా తీసుకున్నారు. మరి జట్టులో ఆడే అవకాశం వస్తుందో రాదో తెలీదు. 2023లో ఆస్ట్రేలియాపై ఆరంగ్రేటం చేశాడు. కానీ ఎక్కువ మ్యాచ్ లు ఆడలేదు. అలా స్టాండ్ బైగానే ఉండిపోయాడు. ధృవ్ జురెల్ మాత్రం కొత్తవాడు. అవకాశం వస్తే తొలి టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం లభిస్తుంది.


ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు ఇండియా టీమ్ : రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), శుభ్ మన్ గిల్ , యశస్వి జైశ్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్  కీపర్ ), కేఎస్ భరత్  (వికెట్  కీపర్ ), ధృవ్ జురెల్ (వికెట్  కీపర్ ), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆవేశ్ ఖాన్

Related News

Watch Video : ఇదెక్కడి క్రికెట్ రా.. ఇలా ఆడితే అస్సలు రన్ అవుట్ కాబోరు

Sanju Samson : సంజూ అరాచకం.. వరుసగా 6,6,6,6,6,6

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Big Stories

×