BigTV English

Rishi Sunak : రిషి సునక్ ముందున్న సవాళ్లివే..

Rishi Sunak : రిషి సునక్ ముందున్న సవాళ్లివే..

నూతన ప్రధానిగా ఎన్నికైన రిషి సునక్ ముందు ఇప్పుడు అనేక సవాళ్లు ఉన్నాయి. ఆర్థిక సంక్షోభం, అక్రమ వలసలు, ఉక్రెయన్ యుద్ధం బ్రిటన్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. వీటిని రిషి ఎలా ఎదుర్కొంటాడనేదానిపైనా అందరి ఆశ, ఆసక్తి ఉంది.


బ్రిటన్ ద్రవ్యోల్బణం జీ7 దేశాల్లో అన్నింటికంటే ఎక్కువగా ఉంది. లిజ్ ట్రస్ ఈ ద్రవ్యోల్బనాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేసినా విఫలం అయ్యారు. ఇప్పుడు రిషి సునక్ ఏ యాక్షన్ తీసుకుంటారో వేచి చూడాల్సిందే..

బ్రిటెన్‌ను ఆర్ధిక సంక్షోభం ఇప్పటికే కమ్ముకోవడం ప్రారంభించింది. యూనియన్ల పెద్ద ఎత్తున సమ్మె చేయడానికి సిద్ధమయ్యారు. బ్రిటెన్‌లో గత 100 ఏళ్ల నుంచి ఎప్పుడూ లేని ఉదృతంగా సమ్మె చేయడానికి సిద్ధమయ్యారు బ్రిటెన్ యూనియన్ వర్కర్లు.


భారత సంతతికి చెందిన వ్యక్తికి బ్రిటన్ ప్రధాని కావడం వల్ల బ్రిటన్ భారత్ ద్వైపాక్షిత సంబంధాలు మరింత మెరుగుపడతాయని విశ్లేషకులు, నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్ నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని రిషి ఇప్పటికే అనేక సార్లు ప్రకటించారు. బ్రిటన్ విద్యార్ధులు, యువకులు యూకేకు వెళ్లి చదువుకొని ఉద్యోగం చేసేలా చర్యలు చేపడతామన్నారు రిషి సునక్..

మరోవైపు రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ దారుణంగా దెబ్బతింటోంది. ఇప్పటికే ఉక్రెయిన్‌కు బ్రిటన్ అనేక విధాలుగా సహాయపడుతోంది. 2.6 బిలియన్ డాలర్ల విలువ చేసే వార్ ఎక్విప్మెంట్స్‌ను అందించింది. రష్యాతో ఈ అంశాన్ని ఎలా డీల్ చేస్తారనే దానిపైనా ఉత్కంఠ నెలకొంది. చైనాతో బ్రిటన్‌కు ముప్పు పొంచి ఉందని ఇదివరకే అనేక సార్లు ప్రకటించారు రిషి.. చైనాతో ఎలా తేల్చుకుంటారనే చర్చ కూడా జరుగుతోంది.

Tags

Related News

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

Big Stories

×