EPAPER

Yashoda Movie : ‘యశోద’ చిత్రానికి పాన్ ఇండియా హీరోల సపోర్ట్

Yashoda Movie : ‘యశోద’ చిత్రానికి పాన్ ఇండియా హీరోల సపోర్ట్

Yashoda Movie : సమంత ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘యశోద’. ఇటీవల విడుదలైన టీజర్ కి అనూహ్య స్పందన లభించిన విషయం తెలిసిందే. దాంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ ఆసక్తిని మరింత పెంచుతూ పాన్ ఇండియా హీరోలతో ట్రైలర్ విడుదల ప్లాన్ చేసింది చిత్ర బృందం. నవంబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘యశోద’ ట్రైలర్‌ను అక్టోబర్ 27న పేరొందిన పాన్ ఇండియన్ హీరోలు విడుదల చేయనున్నట్లు తెలపడంతో అటు అభిమానుల్లో, ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.


తెలుగులో హీరో విజయ్ దేవరకొండ, తమిళంలో సూర్య, కన్నడలో రక్షిత్ శెట్టి, మలయాళంలో దుల్కర్ సల్మాన్, హిందీలో వరుణ్ ధావన్ ‘యశోద’ ట్రైలర్ విడుదల చేయనున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ‘యశోద’ విడుదల కానుంది. చిత్ర నిర్మాణంలో ఖర్చుకు వెనకాడనట్టే, ప్రమోషన్స్ కూడా రొటీన్ కి భిన్నంగా పాన్ ఇండియా ఇమేజ్‌కు ఏమాత్రం తగ్గకుండా వినూత్నంగా జరుపుతున్నారు దర్శకులు హరి, హరీష్ మరియు నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్. ఈ చిత్రానికి పులగం చిన్నారాయణ, చల్లా భాగ్యలక్ష్మి రచయితలుగా వర్క్ చేశారు. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.


Tags

Related News

Harsha Sai : హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ… అవన్నీ రూమర్లేనా?

Game Changer : ‘గేమ్ ఛేంజర్’కి పెయిడ్ ప్రమోషన్స్.. క్లారిటీ ఇచ్చిన మెహబూబ్

Sudheer Babu : మంచు హీరోను మోసం చేసిన సుధీర్ బాబు… వాడుకున్నంత వాడుకుని సారీ చెప్పేస్తే సరిపోతుందా?

Posani Murali Krishna : కొండా సురేఖ వివాదంపై స్పందించని బాలయ్య… పోసాని షాకింగ్ కామెంట్స్

Rocking Rakesh – Sujatha : పండండి బిడ్డకు జన్మనిచ్చిన జబర్దస్త్ సుజాత

Sai Rajesh : మా ప్రొడ్యూసర్ తిట్టుకున్న పర్లేదు, చెప్తే ఇది కాంట్రవర్సీ అవుతుంది

Trump Advice To Israel: ‘ఇరాన్ అణు స్థావారాలపై వెంటనే దాడి చేయండి’.. ఇజ్రాయెల్ కు ట్రంప్ సలహా

Big Stories

×