BigTV English

Charles Shobharaj : సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ విడుదల.. అప్పుడు డ్రగ్స్ పార్టీ ఇచ్చి జైలు నుంచి పరార్..

Charles Shobharaj : సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ విడుదల.. అప్పుడు డ్రగ్స్ పార్టీ ఇచ్చి జైలు నుంచి పరార్..

Charles Shobharaj : కరడుకట్టిన సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ 19 ఏళ్ల జైలు శిక్ష తరువాత రిలీజ్ అవుతున్నాడు. నేపాల్ సుప్రీం కోర్టు ఈ సీరియల్ కిల్లర్‌కు అనారోగ్యాల రీత్యా జైలు నుంచి విడుదల చేయడానికి అనుమతించింది. చార్లెస్ శోభరాజ్ అంటే సీరియల్ కల్లింగ్స్‌కి పెట్టింది పేరు.


2003లో నేపాల్ పోలీసులు చార్లెస్ శోభరాజ్‌ను అరెస్ట్ చేశారు. విచారణ తరువాత కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. 2003 నుంచి నేపాల్‌లో కారాగార జీవితం గడిపిన తరువాత ఈ రోజు అతన్ని జైలు నుంచి విడుదల చేశారు.

మొత్తం సుమారు 15 నుంచి 20 హత్యలు చేశాడు చార్లెస్ శోభరాజ్. 78 ఎనిమిదేళ్ల ఈ సీరియల్ కిల్లర్ భారత్‌లోను హత్యలు చేశాడు. విదేశీ టూరిస్టులతో స్నేహం చేసి తరువాత వారిని దారుణంగా హతమార్చేవాడు చార్లెస్. అలా 1970 కాలంలో సుమారు 15కు పైగా సీరియల్ కిల్లింగ్స్‌కు పాల్పడ్డాడు.


చర్లెస్ తండ్రి భారతీయుడు కాగా..తల్లి వియత్నంకు చెందింది. చార్లెస్ చిన్న వయసులో ఉన్నప్పుడే అతని తల్లిదండ్రులు విడిపోయారు. తల్లి రెండో పెళ్లి చేసుకోవడం.. తల్లి రెండో భర్తే చార్లెస్‌ను కొంత కాలం దగ్గరకి తీసి పెంచాడు. అయితే ఆయనకు పిల్లలు పుట్టడంతో చార్లెస్‌ను నిర్లక్ష్యం చేశాడు. అప్పటి నుంచి చార్లెస్ ఒంటిరిగా మారి క్రైమ్స్‌కు, హత్యలకు పాల్పడటం మొదలుపెట్టాడు.

1976లో ఢిల్లీలో ఓ ఫ్రెంచ్ పౌరుడికి విషయం ఇచ్చి చంపిన కేసులో అరెస్ట్ అయ్యాడు. భారత్‌లో కొంత కాలం జైలు శిక్ష కూడా అనుభవించాడు. జైలు సిబ్బందికి డ్రగ్స్ పార్టీ ఇచ్చి చార్లెస్ ఒక సారి తప్పించుకున్నాడు. మళ్లీ క్రైమ్స్, హత్యలు, దోపిడీలు చేసి ఎట్టకేలకు నేపాల్ పోలీసులకు చిక్కాడు.

నేపాల్ సుప్రీం కోర్టు 2003లో చార్లెస్‌కు జీవిత ఖైదు విధించింది. నేపాల్ చట్టాల ప్రకారం..20 ఏళ్లు జైలు శిక్ష అనుభవిస్తే..దాన్ని జీవిత ఖైదుగా పరిగణిస్తారు. చార్లెస్ 19 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో అనారోగ్యం రిత్యా నేపాల్ సుప్రీం కోర్టు చార్లెస్ విడుదలకు అనుమతినిచ్చింది.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×