BigTV English

China gold mines: వామ్మో.. 2వేల టన్నుల బంగారం, చైనాకు ఇక తిరుగులేదు

China gold mines: వామ్మో.. 2వేల టన్నుల బంగారం, చైనాకు ఇక తిరుగులేదు

బంగారం గనుల్లో, నిల్వల్లో ప్రపంచ దేశాల్లోనే అమెరికాది టాప్ ప్లేస్. ఇక అత్యంత ప్రసిద్ధి చెందిన గనుల విషయానికొస్తే సౌత్ ఆఫ్రికాలోని సౌత్ డీప్ గోల్డ్ మైన్ పురాతనమైనది, ప్రపంచంలోనే అతి పెద్దది. 75 ఏళ్లు తవ్వి తీసుకున్నా తరిగిపోని బంగారం అక్కడ ఉంది. భూమి లోపల దాదాపు 3వేల మీటర్ల వరకు బంగారం కోసం గనిని తవ్వారు. 2032 వరకు ఇక్కడ మైనింగ్ చేసే అవకాశం ఉంది. ఇలాంటి టాప్ మోస్ట్ బంగారు గనిని బీట్ చేసే రెండు గనులు చైనాలో బయటపడ్డాయి. బంగారం గనుల అన్వేషణలో చైనాకు జాక్ పాట్ తగిలింది.


ప్రపంచంలోనే టాప్ ప్లేస్..
ప్రపంచ వ్యాప్తంగా బంగారు నిల్వల్లో చైనా ఆరో ప్లేస్ లో ఉంది. తాజాగా బయటపడిన బంగారు గనుల నుంచి పూర్తి స్థాయిలో బంగారం బయటకు తీస్తే చైనా ప్రపంచంలోనే టాప్ ప్లేస్ లో ఉంటుందనే అంచనాలున్నాయి. ఈగనుల్లో దాదాపు వెయ్యి టన్నుల బంగారం ఉంటుందని చైనా భావిస్తోంది. దీన్ని పూర్తి స్థాయిలో వెలికి తీసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. తూర్పు నుండి పడమర వరకు 3,000 మీటర్లు, ఉత్తరం నుండి దక్షిణం వరకు 2,500 మీటర్లకు పైగా ఈ గనులు విస్తరించి ఉన్నాయి.

చైనాలో ఎక్కడ..?
చైనాలోని హునాన్, లియోనింగ్ ప్రావిన్సులలో ఈ కొత్త బంగారు గనులు బయటపడ్డాయి. అధునాతన ప్రాస్పెక్టింగ్ టెక్నాలజీని ఉపయోగించి ఈ ప్రాంతంలో బంగారం ఉందని చైనా ప్రభుత్వం గుర్తించింది. ఒక్క హునాన్ ప్రావిన్స్ గనిలో బంగారం తవ్వితీస్తే దాని విలువ 83 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.


బంగారమే సేఫ్..
భౌగోళిక ఆర్థిక పరిస్థితులన్నీ ఇప్పుడు అంత సానుకూలంగా లేవు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు కూడా అంత సేఫ్ కాదు. అంటే నగదు విషయంలో ఎప్పుడు ఏం జరుగుతుందోననే టెన్షన్ అందరిలో ఉంది. ఈ దశలో చైనాకు దొరికిన ఈ గనులు నిజంగా జాక్ పాట్ లాంటివే. చైనా ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు ఈ బంగారం కీలకంగా మారే అవకాశం ఉంది.

2023లో బంగారం ఉత్పత్తిలో చైనా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండటం విశేషం. 2023లో మొత్తం 377 టన్నుల బంగారాన్ని చైనా వెలికి తీసింది. అయితే బంగారు నిల్వల్లో మాత్రం దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, రష్యాకంటం చైనా వెనకబడి ఉంది. ప్రస్తుతం చైనాలో బయటపడిన బంగారు గనుల్లో పూర్తి స్థాయిలో వెలికితీత మొదలైతే మాత్రం చైనా నెంబర్-1 గా మారే అవకాశం ఉంది.

అయితే చైనా అప్పుడే ఈ విషయంలో ఆనందపడటం లేదు. ఆ రెండు గనుల గురించిన ప్రాథమిక సమాచారమే ఇప్పుడు బయటకు వచ్చింది. అక్కడ దొరికే బంగారం ఎంతమొత్తంలో ఉంటుందనేది కేవలం ఒక అంచనా మాత్రమే. అయితే దీనిపై ఇంకా పూర్తి స్థాయిలో పరిశోధనలు జరిగితేనే అసలు విలువలు బయటకొస్తాయని అంటున్నారు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×