Ram Gopal Varma: టాలీవుడ్‌లో సెన్సేషనల్ డైరెక్టర్ ఎవరు అనగానే చాలామంది ప్రేక్షకులకు గుర్తొచ్చే పేరు రామ్ గోపాల్ వర్మ. అసలు ఆర్జీవీ అనేది ఒక పేరు కాదు.. అది ఒక బ్రాండ్ అని అంటుంటారు ఫ్యాన్స్. తను ఒకప్పుడు తెరకెక్కించిన సినిమాలకు ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. కానీ గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా కాంట్రవర్సీలకు దగ్గరగా ఉంటున్నారు వర్మ. ఎవరైనా వచ్చి కెమెరా ముందు మైక్ పెడితే చాలు.. కచ్చితంగా కాంట్రవర్సీ క్రియేట్ అయ్యేలాగా లేదా వైరల్ అయ్యేలాగా ఏదో ఒక స్టేట్‌మెంట్ ఇవ్వడం రామ్ గోపాల్ వర్మకు కామన్ అయిపోయింది. తాజాగా చెన్నైలో ఒక స్టోర్ ప్రమోషన్‌కు వెళ్లినప్పుడు కూడా తాను మళ్లీ చిన్నపిల్లవాడిని అయిపోయానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు వర్మ.
ప్రమోషన్ కోసమే
చెన్నైలో ఒక అడ్వెంచర్ స్టోర్ ఓపెనింగ్ కోసం రామ్ గోపాల్ వర్మ వెళ్లారు. తనతో పాటు ‘శారీ’ హీరోయిన్ కూడా వెళ్లింది. అక్కడికి వెళ్లిన తర్వాత ఐస్‌లో, మంచులో అన్నీ మర్చిపోయి ఆటలు ఆడుకున్నాడు వర్మ. అక్కడ తన ఎక్స్‌పీరియన్స్ అద్భుతంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు. మామూలుగా ఏ విషయాన్ని అయినా వ్యంగ్యంగా చెప్పడం వర్మకు అలవాటు. అందుకే తను చెప్పేది నిజమా కాదా అని నమ్మడానికే ప్రేక్షకులకు చాలా సమయం పడుతుంది. కానీ మొదటిసారి ఈ అడ్వెంచర్ స్టోర్ గురించి పాజిటివ్‌గా మాట్లాడాడు ఈ సెన్సేషనల్ డైరెక్టర్. దీన్ని ప్రమోట్ చేయడం కోసం రామ్ గోపాల్ వర్మ పాజిటివ్ రివ్యూలు ఇవ్వడం పెద్ద విషయమే అని ఫ్యాన్స్ అంటున్నారు.
చిల్ ఉంది
‘‘ఇక్కడ ఆడుతుంటే నేను మళ్లీ ఆ వయసులో చిన్నపిల్లాడిని అయిపోయాను అనిపించింది. చాలా ఎంజాయ్ చేశాను. రెండు, మూడుసార్లు స్లైడ్ చేశాను. అంతా చిల్ ఉంది. చాలా బాగుంది’’ అని చెప్పుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ. అసలైతే వో*డ్కా అంటే వర్మకు ప్రాణం. దానిని పక్కన పెట్టి ఐస్‌లో ఆడుకుంటూ తను చిన్నపిల్లవాడు అయిపోయాడంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కెమెరా కనిపిస్తే చాలు రామ్ గోపాల్ వర్మ ఇలా గుర్తుండిపోయే కామెంట్స్ చేయడం ఆపలేదు అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన ‘శారీ’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది థియేటర్లలో విడుదల అవుతుందా లేక తన మునుపటి సినిమాల్లాగా ఆన్‌లైన్‌లో విడుదల అవుతుందా చూడాలి.
Also Read: ‘అర్జున్ రెడ్డి’ మూవీలో గోల్డెన్ ఛాన్స్ మిస్ అయ్యింది.. స్టార్ నటుడి ఆవేదన మీరే చూడండి
సినిమాలన్నీ ఫ్లాప్
1989లో విడుదలయిన ‘శివ’ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు రామ్ గోపాల్ వర్మ. మొదటి సినిమాతోనే లాండ్‌మార్క్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత తను తెరకెక్కించిన ప్రతీ క్రైమ్ థ్రిల్లర్ బ్లాక్‌బస్టరే అయ్యింది. అలా తెలుగులో ఎన్నో లాండ్‌మార్క్ సినిమాలు క్రియేట్ చేసిన వ్యక్తిగా రామ్ గోపాల్ వర్మ నిలిచాడు. తెలుగులోనే కాదు.. హిందీలో కూడా దర్శకుడిగా అడుగుపెట్టాడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma). అక్కడ కూడా డైరెక్టర్‌గా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు. అలా కొన్నాళ్ల పాటు రామ్ గోపాల్ వర్మ తీసిన ప్రతీ సినిమా హిట్ అయినా.. తర్వాత ఆయన డైరెక్షన్ మారిపోయింది. అందుకే ఆయన సినిమాలు కూడా హిట్ అవ్వడం ఆగిపోయింది.