Chine Foxconn Company : చైనాలో అతిపెద్ద ఐఫోన్ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ ఇప్పుడు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అందులో సుమారు 2 లక్షల మంది కార్మికులు ఐఫోన్ తయారీలో పాలుపంచుకుంటారు. చైనాలో జీరో కోవిడ్ నిబంధనలు ఉండడంతో ఈ ప్రభావం ఈ ఫాక్స్‌కాన్ సంస్థపై పడింది. సోషల్ డిస్టెంన్సింగ్ పాటించలేక.. సంస్థ కఠిన నిబందనలను ఫాలో కాలేక ఇప్పటికే ఆ సంస్థ నుంచి సుమారు లక్ష మంది కార్మికులు విడిచి వెళ్లిపోయారు.
ప్రపంచంలో ఉన్న అనేక దేశాలకు ఫాక్స్‌కాన్ నుంచి ఐఫోన్లు తయారై సప్లై అవుతాయి. జీరో కోవిడ్ నిబంధనలతో ఫాక్స్‌కాన్‌కు గట్టి దెబ్బే తగిలింది. అందులో కార్మికులు పనిచేయడానికి ఇక ఎంత మాత్రం ఆసక్తి చూపించడం లేదు. వేతనాలు పెంచి.. అక్కడే వారికి భోజనం, బస ఏర్పాటు చేస్తోంది ఫాక్స్‌కాన్ సంస్థ. అయితే ఫాక్స్‌కాన్‌లో సంస్థలో ఎంతమంది కార్మికులకు కోవిడ్ సోకింది.. ఎంత మంది క్వారంటైన్‌లో ఉన్నారు.. ఎంత మంది చనిపోయారన్న విషయాలను మాత్రం ఫాక్స్‌కాన్ సంస్థ ఇప్పటి వరకు బయటపెట్టలేదు.
ప్రపంచంలో దేశాలన్నీ కోవిడ్ బారి నుంచి బయటపడుతోంటే.. చైనాలో కోవిడ్ క్రమక్రమంగా పెరిగిపోతుంది. కోవిడ్ నిబంధనలు కూడా ఇప్పుడు చైనాలోనే అధికంగా ఉన్నాయి. ప్రస్తుతం కోవిడ్ వల్ల ఫాక్స్‌కాన్ సంస్థలో 30 శాతం ప్రొడక్టివిటీ పడిపోనుందని నిపుణుల అంచనా. దీంతో ఐఫోన్ 14 సిరీస్ లిమిటెడ్‌గానే మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి.