Akshay Navami : ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో శుక్ల పక్షంలో నవమి తిథి నాడు అక్షయ నవమి పండుగను జరుపుకుంటారు. నవంబర్ 2న ఈతిథి వచ్చింది. ఈ పవిత్రమైన పర్వదినాన లక్ష్మీదేవిని ఆరాధించడం, జపం చేయడం, తపస్సు చేయడం, ధ్యానం, దానం చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయి. ఇవాళ ఉసిరిచెట్టు పూజల విశేషలాభాన్ని చేకూరుస్తాయి. అంతే కాదు జామచెట్టుకు ప్రదక్షిణలు చేయడం వల్ల రోగాలు, పాపాలు తొలగిపోతాయి.
అక్షయ నవమి రోజున ఏం చేసినా రెట్టింపు ఫలితం ఉంటుంది. లోక కళ్యాణం కొరకు కూష్మాండుడు అనే రాక్షసుడిని శ్రీమహావిష్ణువు సంహరించిన రోజే ఈ అక్షయ నవమి. ఈ రోజునే కృతయుగం ఆరంభమైన రోజుగా సత్యయుగాదిగా చెబుతారు.లక్ష్మీ నారాయణుల సన్నిధిలో విజయలక్ష్మిని లేక వీరలక్ష్మిని గాని నిలిపి, రావి, ఉసిరి, తులసి మొక్కలను ఉంచి పూజ చేయాలి.
అక్షయ నవమి రోజు విష్ణు విజయ స్తోత్రం, కనకధారా స్థవం, దుర్గా స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తరం పటిస్తే మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అక్షయ నవమి రోజున చేసిన ఏ పని మొదలుపెట్టినా విజయవంతం అవుతుందని నమ్మకం.ఈ రోజున రహస్య విరాళాలు చేయడం కూడా ప్రాధాన్యం ఉంటుంది. కష్టాల్లో ఉన్న వారికి వీలైనంత వరకు విరాళం ఇవ్వాలి.
ఈ పుణ్య తిధి వేళ శుభ సమయాల్లో చెట్టుకు నూలి పోగులు చుట్టడం వల్ల సంపద, వివాహం, పిల్లలు, వైవాహిక జీవితానికి సంబంధించిన అన్ని సమస్యలు దూరమవుతాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఉపశమనం లభిస్తుంది. పేదరికం, ఇతర సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఉసిరి చెట్టును పూజించాలని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
ఉదయం ఆరాధన ముహూర్తం: 06:34 నుంచి 12:04 వరకు
అభిజిత్ ముహూర్తం: 11.55 నుంచి 12.37 వరకు