E-Paper
Advertisement

విమానంలో భోజనాలేందిరా? ఇదేమైనా బస్సు, రైలు అనుకున్నారా? వీడియో వైరల్!

విమానంలో భోజనాలేందిరా? ఇదేమైనా బస్సు, రైలు అనుకున్నారా? వీడియో వైరల్!
Advertisement

Picnic in the Sky: విమానంలో ప్రయాణం అంటే సాధారణంగా నిశ్శబ్దంగా సీట్లో కూర్చొని గమ్యస్థానానికి చేరుకుంటారు. కానీ, కొందరికి ప్రయాణం అంటే కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయడం. తాజాగా ఇండిగో విమానంలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద రచ్చకు కారణం అయ్యింది. ఒక ఇండియన్ ఫ్యామిలీ ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనాన్ని విమానంలో అందరూ కలిసి తిన్న వీడియో వైరల్ గా మారింది. కుటుంబ సభ్యులు డిస్పోజబుల్ ప్లేట్లు తీసుకుని, ఇంటి నుంచి తెచ్చుకున్న పరాటాలు, కూరలు, స్నాక్స్ వడ్డించుకుని తింటూ కనిపించారు. ఈ వీడియోను చూసి కొందరు సమర్థించగా, మరికొందరు రూల్స్ కు విరుద్ధం అంటున్నారు.

ప్లేట్లు పంచి.. అందరికీ భోజనం..

వీడియోలో ఒక మహిళ మొదట కుటుంబ సభ్యులకు డిస్పోజబుల్ ప్లేట్లు అందిస్తుంది. ఆ తర్వాత ఇంటి నుంచి తీసుకొచ్చిన ఆహారాన్ని అందరికీ వడ్డిస్తారు. కుటుంబ సభ్యులు ఒకరికొకరు భోజనం అందించుకుంటూ కలిసి తింటారు. విమానం క్యాబిన్‌ లోనే చిన్న ఫ్యామిలీ పార్టీ జరిగినట్లు అర్థం అవుతోంది. అందరూ కలిసి భోజనం చేయడం, మాట్లాడుకోవడం సందడిగా మారింది.

నెటిజన్లు ఏమంటున్నారంటే?

Advertisement

చాలా మంది నెటిజన్లు ఆ కుటుంబానికి సపోర్టుగా నిలుస్తున్నారు. భారతీయ కుటుంబాల్లో ప్రయాణం చేసేటప్పుడు ఇంటి నుంచి ఆహారం తీసుకెళ్లడం కామన్ అంటున్నారు. రైలు, బస్సు, కారులో ప్రయాణించినా చాలా మంది ఇంటి వంటకాలను ప్యాక్ చేసుకుని తీసుకెళ్తారని చెప్తున్నారు. ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా, క్యాబిన్‌లో గందరగోళం సృష్టించకుండా ఉంటే ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. విమానయాన సంస్థ, సిబ్బందికి అభ్యంతరం లేకపోతే ప్రయాణికులు ఇంటి ఆహారం తినడంలో సమస్య ఉండకూడదని మరికొందరు అభిప్రాయపడ్డారు.

నిబంధనలకు విరుద్ధం అంటున్న మరికొంత మంది!

మరికొంత మంది.. విమానంలో ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం అంటున్నారు. విమానంలో ఫుడ్ అలా తింటే, నిజంగా చాలా మందికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉందంటున్నారు. అందుకే, విమాన ప్రయాణంలో ప్రయాణికులు కొంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇండిగో విమానంలో ఇలాంటి విషయాలపై ఇప్పటికే ఏమైనా నిబంధనలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. విమాన సిబ్బంది దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయకపోతే ఇతరులు కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

పెరుగుతున్న విమాన ప్రయాణం

Advertisement

దేశంలో విమాన ప్రయాణం గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ మందికి అందుబాటులోకి వస్తోంది. దీంతో రైలు, బస్సు ప్రయాణాల్లో ఉండే కొన్ని అలవాట్లు విమాన ప్రయాణంలో కూడా కనిపిస్తున్నాయి. అయితే, ఆధునిక ప్రయాణంలో ఇతరుల సౌకర్యాన్ని కూడా గౌరవించాల్సిన అవసరం ఉందని ఈ వైరల్ వీడియో మరోసారి గుర్తు చేసింది.

Read Also: ప్రకృతి అందాల నడుమ వందేభారత్ ప్రయాణం.. ఈ 6 రూట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

Tags

Related News

రైలు ప్రయాణంలో నవరాత్రి జోష్.. లోకల్ ట్రైన్‌లో మహిళల ‘గర్భా’ డ్యాన్స్.. నెటిజన్లు ఫిదా!

సినిమా చూస్తూ ఆటో డ్రైవింగ్.. డ్రైవర్‌పై సీపీ సజ్జనార్ సీరియస్!

భక్తుల కోసం టీటీడీ కొత్త యాప్.. ‘వేంకటాద్రి’ ప్రత్యేకతలు ఇవే!

బీహార్ యువకుడితో రష్యా యువతి ప్రేమ.. గుడిసెలోనే ఉంటానంటూ ఇండియాకు వచ్చేసి..

ఎయిరిండియా విమానానికి హైజాక్ ముప్పు.. జైపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్, అసలు ఏం జరిగింది?

జోగులాంబ దర్శనానికి వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. హైదరాబాద్ నుంచి బస్సులు!

డ్రీమ్ కారు కోసం ఇంత పిచ్చా? ఏకంగా వృషణా**లను అమ్మేశాడు!

దసరాకు 5 వేల స్పెషల్ బస్సులు.. గుడ్ న్యూస్ చెప్పిన ఏపీఎస్ ఆర్టీసీ!

Big Stories

Advertisement
×