E-Paper
Advertisement

జిమ్ వర్కౌట్స్ తో సెగలు రేపుతున్న అనసూయ.. వీడియో వైరల్..!

జిమ్ వర్కౌట్స్ తో సెగలు రేపుతున్న అనసూయ.. వీడియో వైరల్..!
Advertisement

Anasuya:బుల్లితెర నుంచి వెండితెర వరకు తన గ్లామర్, నటనతో సందడి చేసే నటి అనసూయ భరద్వాజ్, తాజాగా షేర్ చేసిన ఒక జిమ్ వర్కవుట్ వీడియోతో ఇంటర్నెట్‌లో సెగలు రేపుతోంది. ఫిట్‌నెస్ మీద ఎంత శ్రద్ధ చూపిస్తుందో నిరూపిస్తూ ఆమె చేసిన వర్కవుట్ పిక్స్, రీల్ ఇప్పుడు కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ఒకవైపు హాట్ లుక్స్‌తో ఫిట్‌నెస్‌ గోల్స్ ఇస్తూనే, మరోవైపు మనసులోని ఎమోషనల్ భావాలను పంచుకుంటూ అనసూయ నెటిజన్ల దృష్టిని పూర్తిగా తనవైపు తిప్పుకుంది. వివరాల్లోకి వెళితే..

జిమ్ లుక్‌లో కేక పుట్టిస్తున్న గ్లామర్ :

సాధారణంగా సెలబ్రిటీలు వర్కవుట్ వీడియోలు షేర్ చేయడం సహజమే అయినా, అనసూయ లేటెస్ట్ జిమ్ రీల్ మాత్రం వేరే లెవెల్‌లో ఉంది. బ్లాక్ రన్ రేసర్-బ్యాక్ కట్ స్లీవ్‌లెస్ స్పోర్ట్స్ బ్రా, కలర్‌ఫుల్ చీతా ఆకారపు యానిమల్ ప్రింట్ బిగించిన టైట్ షార్ట్స్ ధరించి ఆమె వర్కవుట్ చేస్తూ కనిపించింది. ఇక ఈ గ్లామరస్ స్పోర్టీ అవుట్‌ఫిట్‌లో అనసూయ టోన్డ్ బాడీని చూపిస్తూ ఇచ్చే పోజులు నెటిజన్లను షాక్‌కు గురి చేస్తున్నాయి.

తల్లి పరిస్థితిపై భావోద్వేగ పోస్ట్ :

Advertisement

కేవలం ఫిట్‌నెస్ మాత్రమే కాకుండా, అనసూయ ఇటీవల షేర్ చేసిన ఒక ఎమోషనల్ పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూడేళ్ల క్రితం తన తండ్రి మరణించిన తర్వాత తల్లి జీవితంలో వచ్చిన మార్పులను చూసి తాను ఎంతగా మథనపడుతున్నదీ పంచుకుంది. “మా అమ్మ ముస్తాబై బొట్టు, గాజులు, గజ్జెలు పెట్టుకుంటే చాలా ముచ్చటగా ఉంటుంది, కానీ నాన్న పోయాక సమాజపు మాటల వల్ల అవన్నీ వదిలేసింది” అని ఆవేదన వ్యక్తం చేసింది.

also read:ఓటీటీలోకి యశ్ టాక్సిక్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

సమాజపు ఆచారాలపై అనసూయ ప్రశ్నలు:

Advertisement

ఆడపిల్లలకు చిన్నప్పుడే అమ్మమ్మలు, అమ్మలు బొట్టు, గాజులు వేయడం నేర్పిస్తారని, అలాంటప్పుడు వాటిని భర్త జీవితంతో ఎందుకు ముడిపెడుతున్నారని అనసూయ ప్రశ్నించింది. పూజలు, శుభకార్యాల్లో విధించే బలవంతపు నియమాలు ఎక్కడ రాసి ఉన్నాయని నిలదీసింది. ఇక ఎవరినీ ఉద్దేశించి అనడం లేదని, తన మనసులో మెదిలిన ఒక సందేహాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నానని స్పష్టం చేసింది. ఈ ఆలోచనాత్మకమైన పోస్ట్‌కు మహిళల నుంచి విశేష మద్దతు లభిస్తోంది.

ట్రెండింగ్‌లో నిలిచిన గ్లామర్ అండ్ థాట్స్ :

ఒకవైపు జిమ్‌లో కష్టపడుతూ పర్‌ఫెక్ట్ ఫిట్‌నెస్ సాధిస్తూనే, ఇంకోవైపు సమాజంలోని మూఢాచారాలపై నిలదీసే ధైర్యాన్ని చూపించడం అనసూయ ప్రత్యేకత. హాట్ వర్కవుట్ లుక్స్‌తో పాటు ఆమె వ్యక్తపరిచిన నిజాయితీగల ఆలోచనలు కూడా ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

స్టైలిష్ అవుట్‌ఫిట్‌తో కుర్రాళ్లకు షాక్ ఇస్తూ, బోల్డ్ కామెంట్స్‌తో సమాజాన్ని ఆలోచింపజేస్తున్న అనసూయ, మరోసారి సోషల్ మీడియాలో రియల్ ట్రెండ్‌సెట్టర్‌ అని నిరూపించుకుంది.

?utm_source=ig_web_copy_link&igsi=MzRlODBiNWFlZA==

Related News

టీవీలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ.. ఎప్పుడు ఏ ఛానల్ లో చూడొచ్చంటే?

ఈవారం కెప్టెన్సీ వారి చేతుల్లోనే.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ భారీ షాక్!

రోహిత్ షాలిని పెద్ద ము**లు.. ఫైర్ అయిన మాజీ కంటెస్టెంట్!

ఈవారం నామినేషన్ లిస్ట్.. అంతా తోపులే.. మరి వెళ్ళేదెవరు?

Gundeninda GudiGantalu Today episode: పాపం మనోజ్.. రోహిణి దొరికిపోతుందా..? గుణకు మీనా వార్నింగ్..

Podarillu Today Episode : మహా మాటతో చక్రీ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఇదా..? జమున గుట్టు రట్టు..

Intinti Ramayanam Today Episode: అవని కోసం మీనాక్షి.. పోలీస్ దెబ్బకు షాక్.. అవని జైలుకేనా..?

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు ఘోర అవమానం.. పోలీస్ స్టేషన్లో రామరాజు.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్..

Big Stories

Advertisement
×