E-Paper
Advertisement

బిగ్ స్క్రీన్ లవర్స్‌కు పండగే..మార్కెట్‌లోకి మరో కొత్త ప్రొజెక్టర్ వచ్చేసింది!

బిగ్ స్క్రీన్ లవర్స్‌కు పండగే..మార్కెట్‌లోకి మరో కొత్త ప్రొజెక్టర్ వచ్చేసింది!
Advertisement

boAt CineHead F1 Pro Projector: సౌండ్ సిస్టమ్స్, వేరబుల్స్ సెగ్మెంట్‌లో దుమ్మురేపుతున్న ప్రముఖ మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ బోట్, ఇప్పుడు ప్రొజెక్టర్ల కేటగిరీలోకి .. భారీ ఎంట్రీ ఇచ్చింది. హోమ్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ను.. ఇష్ట పడే సినిమా లవర్స్ కోసం సరి కొత్త మోడల్ స్మార్ట్ ప్రొజెక్టర్‌ను మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. 120 ఇంచుల భారీ స్క్రీన్ ప్రొజెక్షన్, ఇన్-బిల్ట్ గూగుల్ TV 5.0, డాల్బీ ఆడియో లాంటి లేటెస్ట్ ఫీచర్లతో వచ్చిన ఈ లేటెస్ట్ డివైజ్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం!

పూర్తి వివరాలు

స్క్రీన్ సైజ్:

ఈ ప్రొజెక్టర్ ఉంటే.. ఇక హాలులో పెద్ద టీవీ కూడా అవసరం లేదు. ఇది చిన్న 40 ఇంచుల నుంచి ఏకంగా 120 ఇంచుల వరకు పెద్ద పిక్చర్‌ను గోడ మీద ప్రొజెక్ట్ చేస్తుంది. ఇందులో 1080p ఫుల్ HD క్వాలిటీ ఉన్నప్పటికీ, 4K వీడియోలను కూడా చాలా స్మూత్‌గా ప్లే చేస్తుంది. దీని బ్రైట్‌నెస్ వల్ల గదిలో కాస్త వెలుతురు ఉన్నా సరే, బొమ్మ చాలా క్లారిటీతో, కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. అంతే కాకుండా దీనిలో HDR10 సపోర్ట్ ఉండటం వల్ల చీకటి సీన్లు కూడా చాలా క్లియర్‌గా చూడొచ్చు.

స్మార్ట్ ఫీచర్లు & యాప్స్:

Advertisement

ఈ ప్రొజెక్టర్ ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో గూగుల్ TV 5.0 ఉంటుంది. అంటే మనం ఎలాంటి స్టిక్‌లు లేదా ఎక్స్‌టర్నల్ డివైజులు తగిలించాల్సిన పనిలేదు. నేరుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి 10,000 కంటే ఎక్కువ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

సినిమా యాప్‌లు: నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి యాప్‌లు ముందే ఉంటాయి.

Advertisement

ఇతర ఫీచర్లు: వాయిస్ సెర్చ్ కోసం గూగుల్ అసిస్టెంట్, వేర్వేరు ప్రొఫైల్స్, పిల్లల కోసం కిడ్స్ మోడ్ , ఫోన్ స్క్రీన్‌ను నేరుగా గోడ మీద ప్రొజెక్ట్ చేసే (మిర్రరింగ్) ఆప్షన్ కూడా ఇచ్చారు.

స్పీడ్ & సెటప్:

ఇందులో మీడియాటెక్ ప్రాసెసర్‌తో.. పాటు 2GB ర్యామ్, 32GB మెమరీ ఇచ్చారు. దీని వల్ల ప్రొజెక్టర్ అస్సలు హ్యాంగ్ అవ్వకుండా చాలా ఫాస్ట్‌గా రన్ అవుతుంది. ఇక దీన్ని అమర్చడం కూడా పెద్ద కష్టమేమీ కాదు. పిక్చర్‌ను దానంతట అదే క్లియర్ చేసే ఆటో-ఫోకస్, గోడ కోణాన్ని సరి చేసే ఆటో కీస్టోన్ ఫీచర్లు ఉన్నాయి. గోడ మీద ఏవైనా ఆటంకాలు ఉంటే దానికి తగ్గట్టు పిక్చర్ సైజ్‌ను సెకన్లలో ఆటోమేటిక్‌గా సర్దేసుకుంటుంది.

సౌండ్ & కనెక్టివిటీ:

సినిమాకి విజువల్స్ ఎంత ముఖ్యమో ఆడియో కూడా అంతే ముఖ్యం కదా! అందుకే ఇందులో డాల్బీ ఆడియో సపోర్ట్‌తో 10W ఇన్-బిల్ట్ స్పీకర్లు ఇచ్చారు.

కనెక్ట్ చేసుకోవడం: వై-ఫై, బ్లూటూత్, HDMI, USB,ఆడియో జాక్ పోర్టులు దీనిలో ఉన్నాయి.

ఎక్స్‌టర్నల్ స్పీకర్లు: HDMI ARC సపోర్ట్ ఉంది కాబట్టి, మీకు ఇంకా పెద్ద సౌండ్ కావాలనుకుంటే.. బయటి హోమ్ థియేటర్లను ఈజీగా పేర్ చేసుకోవచ్చు.

Also Read: అతి తక్కువ ధరలో.. స్మార్ట్ టీవీ! హోమ్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ గ్యారంటీ

ధర వివరాలు:

మన దేశంలోఈ మోడల్ ఆఫర్ కింద రూ.32,999 కి లభిస్తోంది. ప్రొజెక్టర్ బోట్ అధికారిక వెబ్‌సైట్‌తో.. పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ , ఎలక్ట్రానిక్స్ షాపుల్లో అందుబాటులో ఉంది.

లక్షల రూపాయలు పెట్టి పెద్ద టీవీలు కొనకుండా, తక్కువ బడ్జెట్‌లోనే ఇంట్లో లేదా బయట ఫ్రెండ్స్‌తో కలిసి సినిమా థియేటర్ లాంటి ఫీల్ పొందాలనుకునే వారికి ఈ మోడల్ ఒక మంచి ఛాయిస్!

Related News

100W ఛార్జర్‌తో MacBook Air ఛార్జ్ చేయడం సేఫేనా?

YouTube Musicలో ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి.. ప్లేలిస్ట్ మజా డబుల్!

మూడు సార్లు మడతపెట్టే ఫోన్.. Huawei Mate XT 2లో ఇవన్నీ ఉంటాయా?

బడ్జెట్ ధరలోనే అల్ట్రా-ప్రీమియం స్మార్ట్‌వాచ్! క్లాసీ లుక్ ఖాయం

Poco F9 Ultraపై భారీ అంచనాలు.. కొత్త చిప్‌సెట్, ప్రీమియం డిజైన్‌తో ఎంట్రీ!

వీడియో ఎడిటర్లు, గేమర్లకు ఇక తిరుగులేదు.. ASUS నుండి బెస్ట్ ప్రాసెస్ ల్యాప్‌టాప్స్ వచ్చేశాయ్!

అతి తక్కువ ధరలో.. స్మార్ట్ టీవీ! హోమ్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ గ్యారంటీ

Big Stories

Advertisement
×