BigTV English

China’s World Largest Ship : అతిపెద్ద యుద్ధ నౌకను తయారు చేసిన చైనా.. భారత్ జాగ్రత్తగా ఉండాల్సిందేనా

China’s World Largest Ship : అతిపెద్ద యుద్ధ నౌకను తయారు చేసిన చైనా.. భారత్ జాగ్రత్తగా ఉండాల్సిందేనా

China’s World Largest Ship : దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు పెరిగిపోతున్న తరుణంలో చైనా తన నావికా బలాన్ని మరింత పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే.. అంతర్జాతీయంగా అతిపెద్ద ఉభయచర యుద్ధ నౌకను ప్రారంభించింది.  షాంఘైలోని హుడాంగ్-జోంగ్‌హువా షిప్‌యార్డ్‌లో అట్టహాసంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ నౌకను జాతికి అంకితం చేసి.. విధుల్ని ప్రారంభించారు. దీంతో.. ఇతర దేశాలు, ముఖ్యంగా పొరుగున్న ఉన్న భారత్ ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నాయి.


ఉభయచర యుద్ధ నౌకల్ని ఎక్కువగా ఆమెరికా నావీలో కనిపిస్తుంటాయి. ‘ల్యాండింగ్‌ ప్లాట్‌ఫామ్‌ డాక్స్‌’ (ఎల్‌పీడీ)గా పేర్కొనే ఆ యుద్ధనౌకలు.. బలగాలు, ట్యాంకులు, హెలికాప్టర్లను సముద్ర మార్గం గుండా యుద్ధ ప్రాంతాల్లోకి తరలించేందుకు వినియోగిస్తారు. అదే సందర్భంలో వీటిని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లుగాను వినియోగిస్తుంటారు. యుద్ధ సమయాల్లో ఇలాంటి నౌకల ఉపయోగం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే.. వీటి నిర్మాణంపై దృష్టి పెట్టిన చైనా.. పూర్తి దేశీయ పరిజ్ఞానంతోనే ఈ నౌకను అభివృద్ధి చేసినట్లుగా చెబుతున్నారు.

చైనా అధికారిక మీడియా సీసీ టీవీ వెల్లడించిన సమాచారం మేరకు.. టైప్ 076 కేటగిరీలోని మొదటి తరం నౌకను ప్రస్తుతం ప్రారంభించారు. ఈ నౌకకు సిచువాన్ అని నామకరణం చేసి జాతికి అంకితం చేశారు. దీనిని కీలక జాతీయ వనరుగా అక్కడి మీడియా అభివర్ణిస్తోంది. కాాగా చైనా నౌకాదళ ఆధునీకరణలో ఇదో కీలక ఘట్టంగా చెబుతున్నారు. ఇలాంటి ఉభయచర యుద్ధ నౌక కారణంగా.. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దీర్ఘ శ్రేణి ప్రయోజనాలు నెరవేరతాయని వెల్లడించింది.


ఈ యుద్ధ నౌకలో అత్యాధునిక ఎలక్ట్రోమాగ్నటిక్ కాటాపుల్ట్ సిస్టమ్ ను అమర్చారు. కాటాపుల్డ్ సిస్టమ్ అంటే.. డెక్ మీద నిలిచిన యుద్ధ విమానాలు గాలిలోకి లేచేందుకు కావాల్సిన వేగాన్ని కొద్ది దూరంలో అందుకోవడం కష్టం. అందుకే.. యుద్ధ విమానాలకు బయటి నుంచి వేగాన్ని అందిస్తుంటారు. అందుకోసం.. యుద్ధ విమాన రన్ వే పై.. ఫైటర్ జెట్ లను వేగంగా ముందుకు లాగి గాల్లోకి వదిలే వ్యవస్థ ఉంటుంది. గతంలో ఇవి ఆవిరితో నడిచేవి ఉండగా.. చైనా తయారు చేసిన ప్రస్తుత నౌకలో విద్యుత్ అయస్కాంత సిస్టమ్ ను ఏర్పాటు చేసింది. దాంతో.. చాలా వేగంగా, సమర్థవంతంగా ఈ నౌక నుంచి ఫైటర్ జెట్లు దూసుకుపోయేందుకు వీలవుతుంది.

సిచువాన్ నౌక 40 వేల టన్నుల లోడింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని చైనా ఆర్మీ తెలిపింది. ఓడ పొడవు సుమారు 864 అడుగుల కాగా, వెడల్పు 141 అడుగుల మేర ఉంది. ఈ నౌక .. అమెరికాకు చెందిన అమెరికా క్లాస్ వంటి అంతర్జాతీయ సేవల్లో ఇతర ఉభయచర వార్‌ఫేర్ షిప్‌ల కంటే డిజైన్ లో చాలా పెద్దగా ఉందని రక్షణ రంగ నిపుణులు తెలుపుతున్నారు. 

ఈ నౌకలో వినియోగించిన విద్యుదయస్కాంత కాటాపుల్డ్ వ్యవస్థ చైనా తయారు చేసిన ఫుజియాన్ విమాన వాహక నౌకలోనూ ఉంది. ఇది 2022లో ప్రారంభించగా.. ఈ విధానంలో  ప్లాట్‌ఫారమ్ నుంచి విమానాల టేకాఫ్‌ల ఫ్రీక్వెన్సీని పెంచుతుంది చైనా నేవీ ప్రకటించింది. అందుకే.. ప్రస్తుత ఉభయచర సిచువాన్ లోనూ ఈ పరిజ్ఞానాన్ని వినియోగించారు. 

Also Read : ఇరాన్ కు సవాళు విసురుతున్న సిరియా రెబల్స్.. మరో యుద్ధానికి సిద్ధం

కాగా.. ఈ నౌక ద్వారా తన నావికా దశ శక్తి సామర్థ్యాల్ని మరింత పెంచుకోవాలని చైనా భావిస్తోంది. ఇప్పటికే.. తైవాన్ ఆక్రమణకు అనేక మార్పు సంకేతాలిచ్చిన చైనా, అక్కడ అంతర్జాతీయంగా వేరే ఏ దేశ నాయకులు, అధికారులు పర్యటించినా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×