Game Changer: ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఎదురుచూసిన అన్ని సినిమాలు వచ్చేసాయి. కల్కి, దేవర, పుష్ప 2.. ఇలా అభిమానులందరినీ స్టార్ హీరోలు పలకరించారు. అన్ని బావుండి ఉంటే గేమ్ ఛేంజర్ కూడా ఈ ఏడాదిలోనే వచ్చేసింది. కానీ , కొన్ని కారణాల వలన ఈ సినిమా సంక్రాంతికి షిఫ్ట్ అయ్యింది. ఇప్పుడు అందరి చూపు గేమ్ ఛేంజర్ పైనే ఉంది. పుష్ప 2 టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పటివరకు చూడని రికార్డ్ కలక్షన్స్ ను రాబట్టింది.
మొన్నటివరకు బాహుబలి రికార్డ్ ను బద్దలుకొట్టాలి అనే టార్గెట్ ప్రతి హీరోకు ఉండేది. ఏ ఫ్యాన్ అడిగినా ఈ మీ హీరో బాహుబలి రికార్డ్ ను బద్దలుకొట్టాడా.. ? అని అడిగేవారు. కానీ, ఇప్పటినుంచి పుష్ప 2 రికార్డ్ ను బద్దలు కొట్టాలి. అలా సెట్ చేశాడు అల్లు అర్జున్. దీంతో గేమ్ ఛేంజర్ పై మరింత ప్రెషర్ పెరిగింది. ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది.. ? పుష్ప 2 రికార్డ్ ను దాటుతుందా.. ? అని అందరు ఎదురుచూస్తున్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు.
Vidaamuyarchi First Single: అజిత్ స్టైల్.. అనిరుధ్ మ్యూజిక్.. డెడ్లీ కాంబో అబ్బా.. అదిరిపోయింది అంతే
కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేశాయి. ఇక గేమ్ ఛేంజర్ పై అభిమానులు ఆశలు పెట్టుకోవడానికి కారణం.. ఆర్ఆర్ఆర్ తరువాత చరణ్ సోలోగా నటించిన చిత్రం ఒకటి అయితే.. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించడం రెండో విషయం. ఈ కాంబో సెట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఆ హైప్ అలా పెరుగుతూనే ఉంది.
ఇక ప్లస్ లు ఉంటే మైనస్ లు కూడా ఉంటాయి కదా. మైనస్ లు ఏంటంటే.. రాజమౌళి సెంటిమెంట్. దేవర సినిమాతో ఎన్టీఆర్ ఆ గండాన్ని గట్టెక్కాడు. ఇప్పుడు చరణ్ వంతు. ఇక రెండోది శంకర్. ఈ ఏడాది ఆయన డైరెక్షన్ లో వచ్చిన ఇండియన్ 2 భారీ పరాజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఎలా ఉండబోతుందో అనే భయం ఫ్యాన్స్ లో ఉంది. రిలీజ్ డేట్ దగ్గరపడేకొద్దీ ఫ్యాన్స్ లో ఆందోళన మొదలవుతుంది.
Naveen Polishetty : మామూలు టాలెంట్ కాదు, ఆ వాయిస్ కూడా తనదే
ఇక తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా ఇన్ సైడ్ టాక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమాను ఇప్పటికే వీక్షించిన వారు సినిమా సూపర్ హిట్ అని రివ్యూస్ చెప్పుకొస్తున్నారు. మొదటి నుంచి గేమ్ ఛేంజర్ మొదటి భాగం కాస్త ఫర్వాలేదనిపిస్తుందట.. రెండో భాగం సూపర్ హిట్ అని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ లో చరణ్ కాలేజ్ డేస్, ఎస్ జె సూర్య తో ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ లో గెలవడానికి హీరో ఏం చేశాడు.. ? లాంటి సీన్స్, కియారా అందాలు ఇలా సాగిపోతుందట.
ఇక సినిమాకు ప్రధాన బలం మాత్రం సెకండ్ హాఫ్ అని చెప్పుకొస్తున్నారు. చరణ్ తండ్రి ఫ్లాష్ బ్యాక్, పొలిటికల్ సీన్స్, అంజలి నటన మరింత ఎంగేజ్ చేస్తాయని అంటున్నారు. రెండు పాత్రల్లో చరణ్ ఇచ్చిపడేశాడని, ముఖ్యంగా తండ్రి పాత్రలో మరింత మెప్పించినట్లు చెప్పుకొస్తున్నారు. సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని, మొదటి నుంచి మిక్స్డ్ టాక్ రాకుండా పాజిటివ్ టాక్ అందుకుంటే కనుక పుష్ప 2 ను మించి ఉంటుందని చెప్పుకొస్తున్నారు. మరి ఇదే కనుక నిజమైతే.. గ్లోబర్ స్టార్ మరో హిట్ కొట్టినట్టే అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.