E-Paper
Advertisement

Gold Corruption: మాజీ మేయర్ ఇంట్లో 13.5 టన్నుల బంగారం.. మరణ శిక్షణ విధించిన కోర్టు

Gold Corruption: మాజీ మేయర్ ఇంట్లో 13.5 టన్నుల బంగారం.. మరణ శిక్షణ విధించిన కోర్టు
Advertisement

China Ex Mayor Corruption: చైనాలోని హైకౌ మాజీ మేయర్ జాంగ్ క్యూ తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణలపై విచారించిన ఆ దేశ న్యాయస్థానాలు.. జాంగ్ క్యూకు మరణశిక్షను విధించింది. అవినీతి కేసు దర్యాప్తులో భాగంగా జాంగ్ క్యూ వద్ద ఏకంగా 13.5 టన్నుల బంగారం, 23 టన్నుల నగదుతో పాటు విదేశాల్లో విలాసవంతమైన భవనాలు, కార్ల సేకరణను అధికారులు గుర్తించారు. ప్రభుత్వ భూ ఒప్పందాలు, కాంట్రాక్టుల ద్వారా ఆయన బిలియన్ల డాలర్ల మేర లంచాలు తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. భారీగా అవినీతి సొమ్ము బయటపడటంతో ఈ కేసు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. భారీ అక్రమ సంపదను గుర్తించిన చైనా కోర్టు అతనికి మరణశిక్ష విధించింది.

హైకౌ మాజీ మేయర్ వద్ద దొరికినవి:

  • 23 టన్నుల నగదు
  • 13.5 టన్నుల బంగారం
  • చైనా & విదేశాలలో లగ్జరీ రియల్ ఎస్టేట్
  • ఖరీదైన కార్లు

అవినీతి తిమింగలం

Advertisement

చైనాలోని హైకౌ మాజీ మేయర్ జాంగ్ క్యూను అవినీతి కేసులో దోషిగా నిర్ధారించింది కోర్టు. దీంతో ఆయనకు మరణశిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా ఆయన ఇంట్లో దొరికిన బంగారం, డబ్బు యావత్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. మాజీ మేయర్ అపార్ట్‌మెంట్‌లో 13.5 టన్నుల ప్యూర్ గ్లోడ్, 23 టన్నుల నగదు దొరికాయి. అలాగే, చైనాతో పాటు విదేశాలలో ఉన్న అతని ఎలైట్ రియల్ ఎస్టేట్, ఖరీదైన కార్లను అధికారులు జప్తు చేశారు.

Also Read:  ఫుడ్ ఇవ్వడానికి.. మహిళ ఇంటికి వెళ్లిన డెలీవరీ మ్యాన్, ఆమె తలగడపై రక్తంతో రాసింది చూసి..

10 ఏళ్లలో కోట్ల ఆదాయం

Advertisement

2009 నుంచి 2019 మధ్యలో ప్రభుత్వ కాంట్రాక్టులు, భూ వ్యవహారాల్లో జాంగ్ క్యూ లంచాలు తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. జాంగ్ 10 సంవత్సరాలలో మొత్తం 4.3 బిలియన్ల డాలర్లు అక్రమంగా సంపాదించాడు. అధికార దుర్వినియోగం, దేశ నిధుల దుర్వినియోగం వంటి నేరాలకు ఆయనను కోర్టు దోషిగా నిర్థారించింది. ఈ కేసు చైనా చరిత్రలో అతిపెద్ద, అత్యంత వివాదాస్పద అవినీతి నిరోధక కేసులలో ఒకటిగా రికార్డు సృష్టించింది.

Related News

చర్చిలో తీవ్ర విషాదం.. ప్రార్థన చేస్తుండగా పాస్టర్‌పై పడ్డ భారీ శిలువ.. వీడియో వైరల్!

నోరు విప్పిన జేడీ వాన్స్.. భారత్ విషయంలో నోరు జారాను, అది సరైనది కాదని క్లారిటీ

మంటల్లో ఫ్రాన్స్‌.. రోడ్లపైకి లక్షల్లో నిరసనకారులు, భవనాలు దగ్దం, షాపులు లూఠీ

షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?

19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

Big Stories

Advertisement
×