Deep-Sea Accident: కొచ్చి తీర సమీపంలో లైబీరియాకు చెందిన ఎంఎస్‌సీ ఎల్సా-3 నౌక సముద్రంలో పూర్తిగా మునిగిపోయింది. నౌకలోని 21 మందిని భారత కోస్ట్ గార్డ్స్ రక్షించారు. మునిగిపోయిన షిప్‌లో 640 కంటైనర్లు ఉండగా.. అందులో 13 కంటైనర్లలో ప్రమాదకర కెమికల్స్ ఉన్నట్లు ఇండియన్ కోస్ట్ గార్డ్ తెలిపింది. 12 కంటైనర్స్‌లో కాల్షియం కార్బైడ్, మిగిలిన వాటిలో 84.44 మెట్రిక్ టన్నుల డీజిల్, 367.1 మెట్రిక్ టన్నుల ఫర్నేస్ ఆయిల్ ఉన్నట్లు ప్రకటించింది. దీంతో తీర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మునిగిన కంటైనర్స్ లీక్ అయితే సముద్ర జలాలు తీవ్రంగా కాలుష్యం అయ్యే ప్రమాదం ఉంది. దీంతో కొచ్చి తీరంలో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు.
కంటైనర్లుగానీ, అందులో నుంచి వచ్చే ఇంధనం గానీ తీరంవైపునకు వస్తే అస్సలు తాకొద్దని కేరళ ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. ఈ క్రమంలో లీకైన ఆయిల్ సముద్రంలో ఎంత మేర వ్యాపించింది తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు. దానికోసం ఆయిల్ స్పిల్ మ్యాపింగ్ టెక్నాలజీ వినియోగించే విమానంతో సముద్రంలో చక్కర్లు కొడుతున్నారు. ఏదైనా సమస్యలు తలెత్తితే ఎదుర్కోవడానికి ముందస్తు చర్యలు చేపట్టారు.
184 మీటర్ల పొడవున్న ఈ షిప్.. మొదట కొచ్చి సముద్ర తీరానికి 38 నాటికల్ మైళ్ల దూరంలో ఒరగగా, కొన్ని కంటైనర్లు సముద్రంలో పడిపోయాయి. క్రమంగా ఇవాళ మొత్తం సముద్రంలో మునిగిపోయింది.
రసాయనాల నౌక మునక కారణంగా తలెత్తే పర్యావరణ సమస్యలను.. ఎదుర్కోవడానికి ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు అధికారులు. విఝింజమ్ పోర్టు నుంచి శుక్రవారం బయల్దేరిన 184 మీటర్ల పొడవున్న ఎంఎస్‌సీ ఎల్సా-3 నౌక ఈ నౌక మే 23న విజింజం ఓడరేవు నుండి బయలుదేరి.. మరుసటి మే 24న మధ్యాహ్నం 1:25 గంటల ప్రాంతంలో కొచ్చిన్ తీరానికి చేరుకోవాల్సి ఉండగా.. కొద్దిసేపటి ముందు సముద్రంలో మునిగిపోయింది.
Also Read: జపాన్ కంటే.. మనమే తోపు.. నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్..
కాగా, కంటెయినర్ నౌక సముద్రంలో మునగడాన్ని గమనించిన ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. అందులో ఉన్న మొత్తం 24 మంది సిబ్బందిని సురక్షితంగా తీరానికి చేర్చినట్లు కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు.
@IndiaCoastGuard #MRCC, #Mumbai responded to a distress alert from the Liberia-flagged container ship MSC ELSA 3, which developed a 26° list approximately 38 nautical miles southwest of #Kochi.
The vessel had departed #Vizhinjam Port on 23 May 25 and was en route to #Kochi, with… pic.twitter.com/m4OhGxAkk6— PRO Defence Kochi (@DefencePROkochi) May 24, 2025