Corona Symptoms: దేశంలో కరోనా మళ్లీ పుంజుకుంటుంది. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనాతో మహారాష్ట్ర, కర్నాటకలో ఇప్పటికే ఇద్దరు మృతిచెందారు. కొత్త వేరియంట్లతో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని అధికారులు చెబుతున్నారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తుల నుంచి ఎన్‌బీ 1.8.1, ఎల్ఎఫ్7 వేరియంట్లను వైద్యులు గుర్తించారు.
కొత్త కరోనా వైరస్ లక్షణాలివే..
కరోనా సోకిన వారిలో కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. జ్వరంతో పాటు నీరసం, అలసట, జలుబు, దగ్గు, తలనొప్పి, ముక్కు కారడం వంటి లక్షణాలు ఎక్కువగా బయటపడుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ లక్షణాలు కనబడితే.. వెంటనే వైద్యులను సంప్రదించి కరొనా టెస్ట్ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
⦿ అలసట
⦿ జలుబు
⦿ దగ్గు
⦿ తలనొప్పి
⦿ ముక్కు కారడం
పిల్లలు, పెద్దల్లో పై లక్షణాలు కనిపిస్తే.. వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోవడం మంచిదని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
గతంలో కరోనా వైరస్ ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ సమయంలో ఈ వైరస్ వల్ల ఎన్నో కుటుంబాలలో ప్రమాద బారిన పడ్డాయి. ఈ వైరస్ విషయంలో కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం కలిగే ఛాన్స్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడూ జాగ్రత్తలు వహించాలని వైద్యులు సూచిస్తున్నారు.ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు జాగ్రతగా ఉండాలి. వీరు పెళ్లిళ్లకు, ఈవెంట్లకు హాజరు కాకుండా ఉంటే మంచిది. గతంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు ఈ వ్యాధి బారిన పడే అవకాశం కొంచెం తక్కువగానే ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాలకు ప్రయాణాలు చేసే వాళ్లు కొంతకాలం ఆ ప్రయాణాలను పోస్ట్ పోన్ చేసుకోవడమే బెటర్.
ఒకవేళ మీకు కరోనా నిర్ధారణ అయితే వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు చెబుతున్నారు. చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం ద్వారా కూడా ఈ సమస్యను కొంతమేర అధిగమించవచ్చని సూచిస్తున్నారు. 60 ఏళ్లకు పై బడిన వాళ్లు ఈ వైరస్ బారిన పడకుండా మరింత జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు.
ALSO READ: ARMY PUBLIC SCHOOL: డిగ్రీ ఉంటే అప్లై చేసుకోవచ్చు.. నెలకు రూ.52,500 జీతం.. ఇంకెందుకు ఆలస్యం
ఈ జాగ్రత్తలు పాటించండి.
⦿ మన చేతులను తరుచుగా ఎప్పకప్పుడూ సానిటైజ్ చేసుకోవాలి.
⦿ మాస్క్ లు తప్పకుండా ధరించాలి.
⦿ రద్దీ ఉన్న చోటకు వెళ్లకుండా ఉండడమే మంచిది.
⦿ గుంపులు గుంపులుగా తిరగకూడదు.
⦿ ఎక్కువ జనాలు ఉన్న చోట తప్పకుండా మాస్క్ ధరించాలి.
⦿ జలుబుగా ఉన్నట్టయితే.. గోరువెచ్చని నీరు తాగాలి.
ALSO READ: Covid 19: కోవిడ్ కొత్త వేరియంట్ నుంచి రక్షణ.. చికెన్ తింటే సరిపోతుందా? నిజం ఏమిటి?