BigTV English
Advertisement

Cow dung : రాకెట్ ఇంజన్‌కు ఆవుపేడే ఇంధనం

Cow dung : రాకెట్ ఇంజన్‌కు ఆవుపేడే ఇంధనం

Cow dung : ఆవుపేడ ద్వారా లభించే గ్యాస్‌తో వంట చేయడం చూశాం. విద్యుత్తు తయారీ కూడా తెలిసిందే. ఇక ఆవుపేడ రాకెట్ ఇంజన్‌కు ఇంధనంగా ఉపయోగపడే రోజులు అతి దగ్గర్లోనే ఉన్నాయి. పశువుల పేడ నుంచి తీసిన లిక్విడ్ బయోమిథేన్(LBM)తో రాకెట్ ఇంజన్‌ను విజయవంతంగా నడిపించగలిగారు శాస్త్రవేత్తలు.


ఇందులో భాగంగా జపనీస్ స్పేస్ స్టార్టప్ ‘ఇంటర్‌స్టెల్లార్ టెక్నాలజీస్ ఇంక్(IST)’ వరుస ప్రయోగాలు నిర్వహించింది. హొకైడోలోని హొకైడో స్పేస్‌పోర్ట్ లాంచ్ కాంప్లెక్స్‌లో వీటిని చేపట్టింది. ఇందులో భాగంగా జీరో లాంచ్ వెహికల్ రాకెట్‌కు ‘స్టాటిక్ ఫైర్ టెస్ట్’‌లను నిర్వహించింది. ఈ ప్రయోగంలో జీరో ఇంజన్ 10 సెకన్ల పాటు నీలం, నారింజ రంగుల్లో జ్వాలలను వెలువరించింది.

స్థానిక డెయిరీ సంస్థల నుంచి సేకరించిన పేడ ద్వారా బయోమీథేన్‌ను పొందినట్టు ISTకి చెందిన పరిశోధకులు వెల్లడించారు. బయోమీథేన్ పర్యావరణ‌హిత రాకెట్ ఇంధనమని అభివర్ణించారు. జపాన్‌కు చెందిన ఎయిర్ వాటర్ అనే కంపెనీ సాయంతో ఈ గ్యాస్‌ను ఉత్పత్తి చేయగలిగామని వివరించారు.


ద్రవ బయోమీథేన్ పర్యావరణ అనుకూలమే కాకుండా సమృద్ధిగా లభిస్తుంది. పైగా కారుచౌక. ఇంధన సామర్థ్యమూ ఎక్కువే. ఇంజన్‌లోని పింటల్ ఇంజెక్టర్ గ్యాస్ మండే సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. సంప్రదాయ ఇంజన్లతో పోలిస్తే విడిభాగాల సంఖ్య పదోవంతుకు తగ్గించేలా ఈ రాకెట్ ఇంజన్‌ను డిజైన్ చేశారు. దీని వల్ల తయారీ ఖర్చులు సగానికి పైగా తగ్గించే వీలుంది.

ప్రొపెల్లెంట్(ద్రవ ఇంధనం, ఆక్సిడైజర్)ను పింటల్ ఇంజెక్టర్ ఓ నియంత్రిత పద్ధతిలో రాకెట్ ఇంజన్ కంబశ్చన్ చాంబర్‌లోకి పంపుతుంది. స్పేస్-ఎక్స్ ఇంజన్లలోనూ ఇదే టెక్నిక్‌ను వినియోగిస్తున్నారు. చాంబర్‌లో గ్యాస్ మండే సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు టోక్యో యూనివర్సిటీ, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లొరేషన్ ఏజెన్సీ(జాక్సా) సంయుక్త ఆధ్వర్యంలో జీరో ఇంజన్ కంబశ్చన్ చాంబర్‌ను అభివృద్ధి చేశారు.

రానున్నరెండేళ్లలో అతి చిన్న శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపేందుకు తాజా ప్రయోగ ఫలితాలు దోహదపడతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బయోమిథేన్ ఇంధనాన్ని వినియోగించి లో-ఎర్త్ ఆర్బిట్‌లోకి శాటిలైట్లను ప్రయోగించాలనేది ఐఎస్‌టీ లక్ష్యం.

.

.

Related News

United States: డయాబెటిస్‌, ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా కష్టమే!

Crime News: 10 మంది రోగులను చంపేసిన నర్స్.. కావాలనే అలా చేశాడట, ఎందుకంటే?

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

H1B Visa VS EB5 Visa: పర్మినెంట్‌‌గా అమెరికాలోనే.. ఈ వీసాపై ఇండియన్స్ కన్నేశారా?

Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

Big Stories

×