BigTV English

Dog Meat : కొరియాలో కుక్క మాంసం నిషిద్ధం..

Dog Meat : కొరియాలో కుక్క మాంసం నిషిద్ధం..
Dog Meat

Dog Meat : కుక్కలను వధించడం, మాంసాన్ని విక్రయించడం దక్షిణ కొరియాలో ఇకపై నిషిద్ధం. దీనికి సంబంధించి బిల్లును అక్కడి ఎంపీలు ఆమోదించారు. 2027 నుంచి కొత్త చట్టం అమల్లోకి రానుంది. తద్వారా కుక్క మాంసాన్ని భుజించే వందల సంవత్సరాల నాటి సంప్రదాయానికి తెరపడనుంది.


వాస్తవానికి పాత తరం దక్షిణ కొరియన్లు తప్ప.. ఇప్పటి యువత పెద్దగా ఈ సంప్రదాయాన్ని అనుసరించడం ఇష్టపడటం లేదు. నిరుడు నిర్వహించిన గ్యాలప్ సర్వేలో 8 శాతం మంది మాత్రమే ఈ మాంసాన్ని తినేందుకు ప్రయత్నించామని చెప్పారు. 2015లో ఇలాంటివారు 27% ఉండగా.. ప్రస్తుతం వారి శాతం గణనీయంగా తగ్గింది.

ఈ చట్టం ప్రకారం మాంసం కోసం కుక్కలను వధిస్తే మూడేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. మాంసం కోసమే కుక్కలను పెంచడం, అమ్మడం వంటివి చేస్తే గరిష్ఠంగా రెండేళ్ల శిక్ష ఉంటుంది. ఇప్పటి వరకు ఇదే వ్యాపారంలో ఉన్న రైతులు, రెస్టారెంట్ ఓనర్లు ఈ చట్టం అమల్లోకి వచ్చేలోపు ప్రత్యామ్నాయ ఉపాధిమార్గాలను చూసుకోవాలి. ఇందుకోసం మూడేళ్లు గడువు ఉంది.


2023 నాటికి దక్షిణ కొరియాలో 1600 డాగ్ మీట్ రెస్టారెంట్లు, 1150 డాగ్ ఫామ్స్ ఉన్నాయి. ప్రస్తుతం రెండు డజన్లకుపైగా దేశాల్లో కుక్క మాంసాన్ని తింటున్నారు. ఆసియాలో ఏడు దేశాలు, ఆఫ్రికాలో 20 దేశాల్లో శునకాలను ఆహారంగా తీసుకుంటున్నారు. ఇక ఈ అంశంలో చైనాదే అగ్రపీఠం. అక్కడ ఏటా కోటికి పైగా కుక్కలను లాగించేస్తున్నారట.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×