BigTV English

Donald Trump: మీరు ధనవంతులు అయ్యేందుకు ఇదే సరైన టైమ్.. ట్రంప్ పిలుపు

Donald Trump: మీరు ధనవంతులు అయ్యేందుకు ఇదే సరైన టైమ్.. ట్రంప్ పిలుపు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ లతో ప్రపంచ మార్కెట్లన్నీ తల్లకిందులవుతున్నాయి. ఇన్నాళ్లూ మనం మోసపోయాం, ఇప్పుడు లాభపడతామంటూ ట్రంప్ చెప్పిన మాటలు నిజం కావేమో అనిపిస్తోంది. ఎందుకంటే అమెరికా మార్కెట్లు కూడా దాదాపు కుప్పకూలాయి. అయితే ట్రంప్ మాత్రం తగ్గేది లేదంటున్నారు. తన నిర్ణయాలను వెనక్కు తీసుకునేది లేదని తేల్చి చెప్పారు. అదే సమయంలో మంచి తరుణం మించిన దొరకదు అంటూ పెట్టుబడిదారులకు ఉపదేశాలిస్తున్నారు. తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ ద్వారా ట్రంప్ వరుస పోస్ట్ లు పెడుతున్నారు.


బంపర్ ఆఫర్..
“అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన వారికి, ఇక్కడ భారీగా పెట్టుబడులు పెడుతున్న వారికి నా మనవి. నా విధానాలు ఎప్పటికీ మారవు. మీరు ధనవంతులు కావడానికి ఇదే సరైన సమయం. ధనవంతులుగా మారండి, గతంలో ఎప్పుడూ లేనంత సంపద సృష్టించండి.” అంటూ ట్రంప్ ఊరిస్తున్నారు. ఓవైపు ట్రంప్ నిర్ణయాలతో, ఇతర దేశాలపై విధించిన టారిఫ్ లతో షేర్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. మదుపరుల సంపద ఆవిరైపోతోంది. అయినా కూడా ట్రంప్ దాని వల్ల నష్టమేమీ లేదంటున్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలకోసమే తాను ఇదంతా చేస్తున్నాని చెప్పుకుంటున్నారు.

ఆర్థిక విప్లవం..
ట్రంప్ దుందుడుకు చర్యల వల్ల అమెరికా ఆర్థిక మాంద్యం గుప్పెట్లో చిక్కుకుపోతోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ ట్రంప్ మాత్రం తన చర్యలను పూర్తిగా సమర్థించుకుంటున్నారు. ఇది ఒక ఆర్థిక విప్లవం అంటున్నారు ట్రంప్. ఇతర దేశాలు ఇప్పటి వరకూ అమెరికా సంపదను దోచుకున్నాయని, ఇకపై అలా జరగదని, అమెరికా సంపద, ఉద్యోగాలు, వ్యాపారాలు ఇక్కడే ఉంటాయని చెప్పారు. ఇప్పటికే 5 ట్రిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. ఈ ప్రక్రియ సులభం కాకపోయినా, కష్టాల బాటగా కనపడినా కూడా అంతిమ విజయం తమదేనంటున్నారు ట్రంప్. తుది ఫలితం చారిత్రాత్మకంగా ఉంటుందని చెప్పారు. పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఎప్పుడూ సుంకాల గురించి ఆందోళన చెందడంలేదని, వారు ఎప్పుడూ ఇక్కడే ఉంటారని, మన ఆర్థిక వ్యవస్థను వారు మరింత పెద్దదిగా మారుస్తారని చెప్పుకొచ్చారు ట్రంప్.


ట్రంప్ విధించిన టారిఫ్ లతో అమెరికాతో వ్యాపార రావాదేవీలు నడుపుతున్న దాదాపు అన్ని దేశాలు ఆర్థికంగా కుదేలవుతున్నాయి. అదే సమయంలో అటు అమెరికాలో కూడా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. దిగుమతులు భారంగా మారిపోతాయని, అమెరికాలో ఆయా ఉత్పత్తుల రేట్లు విపరీతంగా పెరిగిపోతాయని, దీనివల్ల అమెరికన్లకే నష్టం అని కొందరు అంటున్నారు. అయితే ఈ టారిఫ్ ల వల్ల విదేశాలు తమ దృక్పథాన్ని మార్చుకునే అవకాశముందని, అమెరికా ఉత్పత్తులపై ఆయా దేశాలు టారిఫ్ లను తగ్గిస్తాయని ట్రంప్ అంచనా వేస్తున్నారు. మరి చివరికి ఏమవుతుందో చూడాలి. ఒకవేళ ట్రంప్ అంచనాలే నిజమవుతాయని అనుకున్నా.. అది జరగడానికి మరింత సమయం పట్టే అవకాశముంది. ఆలోగా అమెరికాకు జరగాల్సిన నష్టం జరుగుతుందేమోనని ఆర్థిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ట్రంప్ కి భయపడి ఇతర దేశాలు టారిఫ్ లను తగ్గించకపోగా.. వేరే మార్కెట్ ని చూసుకుంటే అప్పుడు అమెరికా పరిస్థితి ఏంటనేది వారి ఆందోళనకు ప్రధాన కారణం.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×