Static Shock: ఎప్పుడైనా మీరు కుర్చీని ముట్టుకున్నప్పుడు సడెన్‌గా షాక్ కొట్టినట్లుగా అనిపించిందా..? కొన్నిసార్లు డోర్ హ్యాండిల్‌ని పట్టుకున్నప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది. ప్లాస్టిక్ కుర్చీకి జుట్టు తగిలినా వెంట్రుకలు నిటారుగా నిల్చుంటాయి. ఇలా ఎందుకు జరిగింది అనే సందేహం చాలా మందికి వచ్చే ఉంటుంది. కొన్ని రకాల వస్తువులను తాకినప్పుడు ఇలా షాక్ కొట్టడాన్ని స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అని పిలుస్తారట. దీనికి వెనుక పెద్ద ఫిజిక్స్ దాగి ఉందని చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది.
శరీరంలో తేమ శాతం తక్కువగా ఉన్నప్పుడు ఇలా జరుగుతుందని సైంటిస్ట్‌లు చెబుతున్నారు. ఏవైనా రెండు రకాల మెటీరియల్స్‌తో తయారైన వస్తువులు ఒకదానికి మరొకటి తాకినప్పుడు ఇలా జరుగుతుందట. అయితే ఈ వస్తువులలో ఉండే ఎలక్ట్రాన్స్ ట్రాన్స్‌ఫర్ అయినప్పుడు చార్జెస్ ఇంబాలన్స్ అయిపోతాయి. దీంతో షాక్ కొడుతుందట.
ALSO READ: బైపోలార్ డిజార్డర్ వల్లే మూడ్ స్వింగ్స్
రెండు వేరు వేరు మెటీరియల్స్‌తో తయారు చేసిన రెండు వస్తువులను ఒకదాని పక్కన మరొకటి ఉన్నప్పుడు అందులోని ఎలక్ట్రాన్స్ జంప్ చేయడం స్టార్ట్ చేస్తాయట. అయితే, కార్బన్, ఐరన్ వంటివి వీటిలోని ఎలక్ట్రాన్స్‌ని చాలా గట్టిగా పట్టుకుంటాయట. అదే ప్లాస్టిక్ వంటివి అయితే ఎలట్రాన్స్‌ని త్వరగా వదిలేయడం లేదా పొందడం చేస్తాయి. అందుకే ఎక్కువగా ప్లాస్టిక్ వస్తువులను తాకినప్పుడే చాలా సార్లు షాక్ కొట్టినట్లుగా అనిపిస్తుందట. దీన్నే స్టాటిక్ షాక్ తేదా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అని పిలుస్తారు.
స్టాటిక్ షాక్ రావొద్దంటే..?
కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ రాకుండా ఉంటుందట. చర్మాన్ని ఎప్పటికప్పుడు తేమగా ఉంచుకోవడం వల్ల స్టాటిక్ షాక్ రాదట. చుట్టుపక్కల ప్రదేశం లేదా, వాతావరణం పొడిగా ఉడడం వల్ల ఎక్కువగా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ వచ్చే ఛాన్సెస్ అధికంగా ఉంటాయి. అలాంటి సమయంలో కొన్ని నీటి చుక్కలను చల్లితే గాలిలో తేమ పెరుగుతుందట. దీంతో షాక్ కొట్టకుంగా ఉంటుంది.