BigTV English

Trump – Putin : పుతిన్ ని హెచ్చరించే ధైర్యం ఎవరికీ లేదు.. ఆ వార్తలపై రష్యా క్లారిటీ.. ఏం జరిగిందంటే

Trump – Putin : పుతిన్ ని హెచ్చరించే ధైర్యం ఎవరికీ లేదు.. ఆ వార్తలపై రష్యా క్లారిటీ.. ఏం  జరిగిందంటే

Trump – Putin : ట్రంప్ గెలుపు ఖాయమైన తర్వాత అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో ఇజ్రాయిల్ – ఇరాన్ యుద్ధం, ఉక్రెయిన్ – రష్యా పోరాటం గురించి నిత్యం వివిధ వార్తలు బయటకు వస్తున్నాయి. వాటిలో.. అమెరికా ఎలక్టెడ్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) రష్యా అధినేత పుతిన్ (Putin)తో మాట్లాడారనే వార్త ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ పత్రిక వాషింగ్టన్ పోస్ట్ వెలువరించడంతో.. అంతా నిజమేనని భావించారు. కానీ.. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని రష్యా వెల్లడించింది. తమ అధ్యక్షుడు (Putin) ఎవరితోనూ మాట్లాడలేదని వెల్లడించింది.


డోనాల్డ్ ట్రంప్ నతో మాట్లాడినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవాన్న క్రెమ్లిన్.. అవన్నీ తప్పుడు ప్రచారాలని కొట్టిపారేసింది. ప్రస్తుతం తప్పుడు సమాచారం ఎలా వైరల్ అవుతుందో, అందులోని విశ్వసనీయత ఏపాటిదో… ఈ వార్తల్ని చూస్తుంటే అర్థం అవుతుంది అంటూ.. వాషిగ్టంగ్ పోస్టును ఉద్దేశించి రష్యా వ్యాఖ్యానించింది. పేరున్న సంస్థలు సైతం.. ఇలాంటి తప్పుడు వార్తల్ని ప్రచురించడం సరైనది కాదన్న క్రెమ్లిన్.. ఇదంతా ఊహాజనితమని వెల్లడించింది. ప్రస్తుతానికి.. తమ అధ్యక్షుడు పుతిన్ (Putin), అమెరికా అధ్యక్షుడు (Trump) మధ్య ఎలాంటి చర్చల ప్రతిపాదనలు, ప్రణాళికలు లేవని స్పష్టం చేసింది.

కాగా.. వాషింగ్టన్ పోస్టు కథనంలో.. గత గురువారం నాడు ఫోర్లిడాలోని తన ఎస్టేట్‌ నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ట్రంప్ ఫోన్లో మాట్లాడినట్లు రాశారు. ఉక్రెయిన్‌ తో యుద్ధాన్ని మరింత విస్తరించొద్దని పుతిన్ ని కోరిన ట్రంప్… పరస్పరం చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకుందామని కోరినట్లు తెలిపింది. ఈ సందర్భంగానే ఐరోపాలో మోహరించిన అమెరికా సైనిక సంపత్తి స్థాయిని పుతిన్ కు ట్రంప్‌ గుర్తు చేసినట్లు పేర్కొంది. ఇప్పుడు ఇవ్వన్నీ తప్పుడు వార్తలంటూ రష్యా కొట్టేసింది.


పుతిన్.. అమెరికా అధ్యక్షుడితో నేరుగా మాట్లాడలేదు కానీ… మీడియా సమక్షంలో ట్రంప్ నకు అభినందనలు తెలిపారు. ఎన్నికల ఫలితాలపై అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. ట్రంప్‌ (Donald Trump) ధైర్యవంతుడని అన్నారు. ఆయనతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నానంటూ వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ఉక్రెయిన్ – రష్యా (Russia-Ukrain) యుద్ధం గురించి మాట్లాడుతూ.. తాను అధ్యక్షుడిని అయితే.. ఒకే ఒక్కరోజులో యుద్ధాన్ని ఆపేస్తానంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. దానికి అనుగుణంగానే.. ఎన్నికల ప్రణాళిక తర్వాత ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్.. ఇకపై అమెరికా అధ్యక్షుడిగా తాను యుద్ధాన్ని ప్రారంభించాలనుకోవడం లేదని, దానిని ముగించేందుకు సాయం చేస్తానంటూ వ్యాఖ్యానించారు.

Also Read : దీపావళి వేడుకల్లో మందు. మాంసం.. ఏకంగా ప్రధానికే తప్పని తిప్పలు

గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే సైతం ఇలాంటి వార్తలు అనేక చక్కర్లు కొడుతుండేవి. అందులో.. ట్రంప్ వీరితో మాట్లాడారు, వారికి సలహా ఇచ్చారు అంటూ వార్తలు వెలువడుతుండేవి. కొన్నిసార్లు స్వయంగా ట్రంపే కొన్ని విషయాల్ని వెల్లడించే వారు. కానీ.. తర్వాత సదరు కామెంట్లతో సంబంధం ఉన్న వాళ్లు అలాంటిది ఏమీ లేదని చెబుతుండే వాళ్లు. ఇప్పుడు.. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు ముందే.. ఇలాంటి వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×