BigTV English

Balapur Laddu: బాలాపూర్ ల‌డ్డూకు రికార్డ్ ధ‌ర‌.. ఎవరు దక్కించుకున్నారంటే..?

Balapur Laddu: బాలాపూర్ ల‌డ్డూకు రికార్డ్ ధ‌ర‌.. ఎవరు దక్కించుకున్నారంటే..?

Balapur Laddu: హైదరాబాద్‌లోని బాలాపూర్ గణేష్ ఉత్సవం ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తుంద ప్రత్యేకించి దీని లడ్డూ వేలం కారణంగా.. 2025 సెప్టెంబర్ 6న జరిగిన ఈ వేలంలో బాలాపూర్ గణనాథుని లడ్డూ రూ.35 లక్షల రికార్డు ధరకు లింగాల దశరథ్ గౌడ్ దక్కించుకున్నారు. గతేడాది ఈ లడ్డూ రూ.30.01 లక్షలకు కొలను శంకర్ రెడ్డి సొంతం చేసుకున్నారు. ఈ సంవత్సరం ధర మరోసారి రికార్డు సృష్టించింది. 38 మంది భక్తులు ఈ వేలంలో పాల్గొన్నారు.


ఏడుగురు ప్రముఖ బిల్డర్లు:
మర్రి రవికిరణ్ రెడ్డి (చంపాపేట్)
సామ ప్రణీత్ రెడ్డి (ఎల్బీ నగర్)
లింగాల దశరథ్ గౌడ్ (కర్మాన్‌ఘాట్)
కంచర్ల శివారెడ్డి (కర్మాన్‌ఘాట్)
సామ రాంరెడ్డి (కొత్తగూడెం)
పీఎస్‌కే గ్రూప్ (హైదరాబాద్)
జిట్టా పద్మా సురేందర్ రెడ్డి (చంపాపేట్).

లడ్డూ తీసుకుంటూ.. లింగాల దశరథ్‌గౌడ్ ఎమోషనల్
బాలాపూర్ లడ్డు సొంతం చేసుకున్న లింగాల దశరథ్ గౌడ్ గారు లడ్డూను తీసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. బాలాపూర్ లడ్డూ అంటే నాకు చాలా ఇష్టం.. ఈ లడ్డూ కోసం 2018 నుంచి వెయిట్ చేశాను. దేవుడి దయతో ఇవాళ దక్కిందచుకున్న.. కావున చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్పారు.


రూ.450 నుంచి ప్రారంభమైన బాలాపూర్ లడ్డు ఇప్పుడు రికార్డ్ ధర
ఈ వేలం 1994లో రూ.450తో ప్రారంభమై, క్రమంగా లక్షలకు చేరింది. భక్తులు ఈ లడ్డూ సంపద, విజయం, ఐశ్వర్యం తెస్తుందని నమ్ముతారు, అందుకే తీవ్ర పోటీ ఉంటుంది. వేలం పారదర్శకంగా జరిగేలా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. బిల్డర్లు ముందుగా రూ.5,000 నాన్-రిఫండబుల్ డిపాజిట్‌తో పాటు గతేడాది ధర రూ.30.01 లక్షలు డిపాజిట్ చేయాలి.

గ్రామ విధుల్లో గణేషుడు శోభయాత్ర..
వేలం ఉదయం 9:30 గంటలకు బొడ్రాయి వద్ద ప్రారంభమైంది. దీనికి ముందు గణేషుడి శోభాయాత్ర గ్రామ వీధుల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి లక్షలాది భక్తులు తరలివచ్చారు. భద్రత కోసం 30,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు, సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ నిఘా, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాటు చేశారు. వేలం తర్వాత, గణేష విగ్రహం హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం కోసం 16 కి.మీ. శోభాయాత్ర సాగింది. ఇందులో చాంద్రాయణగుట్ట, చార్మినార్, అఫ్జల్‌గంజ్, అబిడ్స్ వంటి ప్రాంతాలు ఉన్నాయి.

వేలంలో వచ్చిన ఆదాయాన్ని సామాజిక కార్యక్రమాల అభివృద్ధి..
వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని గ్రామాభివృద్ధి కోసం, పాఠశాలల మరుగుదొడ్ల నిర్మాణం వంటి సామాజిక కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. ఇప్పటివరకు రూ.1.60 కోట్లు ఖర్చు చేసినట్లు సమితి తెలిపింది. ఈ సంప్రదాయం హైదరాబాద్ గణేష్ ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Related News

Ganesh Nimajjanam: ఖైరతాబాద్ వినాయకుడికి ఘన వీడ్కోలు.. ముగిసిన నిమజ్జనం

Hyderabad: వినాయకుడి నిమజ్జనంలో అపశృుతి.. కిందపడిన విగ్రహాలు.. గాయపడిన భక్తులు

Bandlaguda Laddu: రికార్డులు బ్రేక్.. బండ్లగూడ జాగీర్ లడ్డూ ఏకంగా రూ. 2.31 కోట్లు

Balapur Ganesh Laddu: బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం.. రికార్డు బ్రేక్ చేస్తుందా?

Hyderabad: గణేశ్ శోభాయాత్రకు భారీ భద్రత.. 40 లక్షల మంది భక్తుల పాల్గొంటారని అంచనా

Big Stories

×