BigTV English

Donald Trump | ‘రూ.692కోట్లు నష్టపరిహారం చెల్లించండి’.. అత్యాచారం కేసులో ట్రంప్‌నకు ఎదురుదెబ్బలు!

Donald Trump | అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్ష ఎన్నికలు పోటీ చేయబోతున్న తరుణంలో.. ఆయనకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అమెరికాలో ప్రఖ్యాత జర్నలిస్ట్, రచయిత్రి జీన్ కెరోల్‌పై అత్యాచారం, ఆమె పరువుకు సమాజంలో భంగం కలిగించిన కేసులో డొనాల్డ్ ట్రంప్‌నకు శుక్రవారం అమెరికాలోని మాన్ హటన్ కోర్టు తీర్పు వెలువరిస్తూ 83.3 మిలియన్ డాలర్లు(రూ.692 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది.

గురువారం కోర్టులో ట్రంప్ తనపై ఉన్న ఆరోపణలు ఖండించారు. కానీ ఆయనకు వివరణ ఇవ్వడానికి కేవలం మూడు నిమిషాలు మాత్రమే ఇచ్చారని అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. విచారణ మధ్యలోనే ఆయన కోర్టు నుంచి బయటికి వచ్చేశారు. అయితే ఈ కేసులో శుక్రవారం తుది విచారణ జరిగింది.

కోర్టు తీర్పుపై ట్రంప్ మాట్లాడారు. అసలు తనకు రచయిత్రి కెరోల్ ఎవరో తెలియదని అన్నారు. ఆమె చెప్పినదంతా కట్టు కథ అని మండిపడ్డారు. ట్రంప్ లాయర్లు మాట్లాడుతూ.. కెరోల్ కేవలం ఫేమస్ అవ్వడానికే ట్రంప్‌పై కేసు పెట్టారని చెప్పారు. మాన్ హటన్ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని తెలిపారు.

1996లో డొనాల్డ్ ట్రంప్ తనపై అత్యాచారం చేశారని రచయిత్రి కెరోల్‌ కేసులో పేర్కొన్నారు. ఒక సూపర్ మార్కెట్‌లో తనతో పరిచయం చేసుకొని.. తన గర్ల్‌ఫ్రెండ్ కోసం లోదుస్తులు కొనేందుకు సహాయం చేయాలని చెప్పి ట్రంప్ తనను ట్రయల్ రూమ్ తీసుకెళ్లి లైంగిక దాడి చేశారని ఆమె ఆరోపణలు చేశారు. అయితే తాను భయంతో ఆ సమయంలో పోలీసుల వద్దకు వెళ్లలేదన్నారు. ఆమె రాసిన ఓ పుస్తకంలో కెరోల్ ఈ విషయాలను వెల్లడించారు.

అయితే ఆ పుస్తకం 2019లో ప్రచురితమై సంచలనంగా మారింది. దీంతో ట్రంప్ ఆమె గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత ఆమె న్యాయస్థానంలో ట్రంప్‌పై కేసు వేశారు.

అక్టోబర్ 2022లో ఇదే కోర్టులో మరో జ్యూరీ కూడా ట్రంప్ నేరం చేశారని చెబుతూ.. ఆయన రచయిత్రి కెరోల్‌పై అత్యాచారం చేసి.. ఆ తరువాత ఆమె గురించి సమాజంలో అసభ్యంగా మాట్లాడినందుకు 5 మిలియన్ డాలర్లు చెల్లించాలని తీర్పు చెప్పింది. అయితే తనకు కనీసం 10 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని కెరోల్ కోర్టులో మరోసారి అపీల్ చేసింది. ఆమె అపీల్‌పై విచారణ చేసిన మరొక జ్యూరీ ఆమె అడిగిన దాని కంటే 8 రెట్లు ఎక్కువ ఇవ్వాలని తీర్పు చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ తీర్పును ట్రంప్ హాస్యాస్పదం అని అన్నారు. న్యాయవ్యవస్థను రాజకీయ ఆయుధంగా బైడెన్ ప్రభుత్వం ఉపయోగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Donald Trump, Jean Caroll, Physical abuse, rape, defamation, Manhattan Jury, America,

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×