Ex MLA Shakeel son case : బోధన్ మాజీ ఎమ్మెల్యే షకిల్ కుమారుడి కేసులో మరో ట్విస్ట్ బయటికొచ్చింది. బోధన్ మాజీ సీఐ ప్రేమ్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. పంజాగుట్ట పోలీసులపై సీఐ ఒత్తిడి తీసుకొచ్చారని నిర్థారించారు. షకిల్ అనుచరుడు అబ్దుల్ వాసేను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్నిరోజుల క్రితం బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ ఆమీర్… ప్రగతిభవన్ బారికేడ్లను కారుతో ఢీకొట్టారు. అనంతరం పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రధాన నిందితుడైన ‘సాహిల్ ను తప్పించడంలో పలువురు పోలీసులు సహకరించారు. దీంతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు కేసును ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పారిపోయేందుకు సహకరించిన పోలీసులు, ఇతర వ్యక్తులను అరెస్టు చేస్తున్నారు.
షకీల్ కుమారుడు సాహిల్ విదేశాలకు పారిపోవడానికి బోధన్ సీఐ ప్రేమ్ కుమార్ సహకరించాడు. ఆయన నిజాంబాద్ సిసిఎఎస్‌లో సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. అదివారం ఇన్‌స్పెక్టర్ ప్రేమ్ కుమార్, షకీల్ అనుచరుడు అబ్దుల్ వాసేను బోధన్ లో పోలీసులు అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు.