BigTV English

Rohit Sharma Fan Latest News : రోహిత్ కాళ్లు మొక్కిన ఫలితం .. వీరాభిమానికి 14 రోజుల రిమాండ్..!

Rohit Sharma Fan Latest News : రోహిత్ కాళ్లు మొక్కిన ఫలితం .. వీరాభిమానికి 14 రోజుల రిమాండ్..!
Rohit Sharma Fan Meet

Rohit Sharma Fan Latest News : అభిమానం హద్దులు మీరితే ఎలా ఉంటుందనేది 20 ఏళ్ల కుర్రాడికి అనుభవంలోకి వచ్చింది. అంతేకాదు చాలాచోట్లా వదిలేసినట్టు , ఈసారి అత్యుత్సాహంతో క్రికెట్ గ్రౌండ్ లో పరుగెత్తిన యువకుడిని హైదరాబాద్ పోలీసులు వదల్లేదు. ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కోర్టుకి తీసుకువెళ్లారు. దీంతో ఆ యువకుడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.


హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న తొలిటెస్ట్ మ్యాచ్ లో మొదటిరోజు టీమ్ ఇండియా బ్యాటింగ్ చేస్తోంది. నాన్ స్ట్రయిక్ ఎండ్ లో ఉన్న రోహిత్ శర్మ దగ్గరకు ఒక యువకుడు పరిగెత్తుకుంటూ వెళ్లి, తన కాళ్లు పట్టుకున్నాడు. అంతేకాదు రోహిత్ ని ఆలింగనం చేసుకోడానికి ట్రై చేశాడు. దీంతో రోహిత్ శర్మ తనని వారించి, బయటకి వెళ్లమని సూచించాడు.

ఇంతలో సెక్యూరిటీ సిబ్బంది వచ్చి బయటకు తీసుకువెళ్లారు. ఇటీవల ఆఫ్గాన్ తో జరిగిన టీ20లో కూడా కొహ్లీ వద్దకు ఒక వీరాభిమాని ఇలాగే గేట్ దూకి వచ్చాడు. కాకపోతే తను లాంగ్ ఆన్ లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. అంతేకాదు కొహ్లీ కూడా సున్నితంగా తీసుకువెళ్లమని సూచించాడు. దీంతో ఆ అభిమాని బతికిపోయాడు. కానీ ఇక్కడా పరిస్థితి కనిపించ లేదు.


అంతేకాదు రోహిత్ కి కాళ్లు మొక్కిన అభిమాని నిజానికి కొహ్లీ జెర్సీ ధరించాడు. కానీ తను మ్యాచ్ లో ఆడకపోవడంతో ఎలాగైనా గ్రౌండ్ లోకి వెళ్లి, ఎవరో ఒకరిని కలవాలని చెప్పి దూకేశాడు. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నాడు. ఇప్పుడాభిమాని పరిస్థితేమిటని నెట్టింట ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. చదువుకున్న కుర్రాడు ఒకసారి రిమాండ్ కి వెళితే, తన భవిష్యత్ ఏమిటి? అని అడుగుతున్నారు.

భారతదేశంలో క్రికెట్ ని వేలంవెర్రిగా మార్చేసిన వ్యవస్థలు కూడా దోషులేనని నెట్టింట కామెంట్లు వినిపిస్తున్నాయి. పోలీసులు కూడా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం సంధించారని, బయట బడాబడా చోరులను వదిలేసి, ఒక కుర్రాడిని పట్టుకుని ప్రతాపం చూపించడం సరికాదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×