BigTV English

Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి ట్రంప్ దూరం?

Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి ట్రంప్ దూరం?

US President: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఇటీవలే కీలక పరిణామాలు చోటుచేసుకున్న నేపథ్యంలో అందరికీ ఆసక్తి ఏర్పడింది. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై హత్యాప్రయత్నం జరగడంతో ప్రపంచదేశాల్లో చర్చ మొదలైంది. ఆ తర్వాత డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి చుట్టూ రకరకాల ప్రచారాలు జరగడం.. చివరికి బైడెన్ అభ్యర్థిగా తప్పుకోవడం.. కమలా హ్యారిస్ అభ్యర్థిగా ముందుకు రావడం వంటి కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఇంతలో మరో ముఖ్యమైన మార్పు జరుగబోతున్నట్టు తెలుస్తున్నది. డొనాల్డ్ ట్రంప్ ఇకపై బహిరంగ ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉండే చాన్స్ ఉన్నది.


గత అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఉధృతంగా ప్రచారం చేశారు. అనేక బహిరంగ సభలు, సమావేశాలు ఏర్పాటు చేశారు. ఆయన కార్యక్రమాలకూ అమెరికా ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ ఎన్నికల ప్రచారంలో కూడా డొనాల్డ్ ట్రంప్‌కు మంచి ప్రజాదరణ కనిపించింది. ఇంతలో ఆయనపై హత్యా ప్రయత్నం జరిగింది. కొన్ని మిల్లిమీటర్ల దూరంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో రిపబ్లికన్లు డొనాల్డ్ ట్రంప్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయనను సురక్షితంగా కాపాడుకోవాలనే ఆలోచనలు చేస్తున్నది. ఇదిలా ఉండగా.. 2024 అధ్యక్ష ఎన్నికల ప్రచారం కోసం భారీ సభలు నిర్వహించడానికి భద్రత కల్పించాలని కోరగా.. అందుకు సీక్రెట్ సర్వీస్ నిరాకరించినట్టు సమాచారం.

Also Read: ఆగస్టు 2 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఈ నెల 26న సెలవు


ఈ నేపథ్యంలోనే ఆయన ప్రచారాన్ని ఇండోర్ ప్రదేశాలకే పరిమితం చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. ఈ మేరకు ఆయన బృందం నుంచి సమాచారం అందుతున్నది. ఒక వేళ ట్రంప్ బహిరంగ ప్రచారానికి వచ్చినా.. రాకపోకల కట్టడికి వీలుండే చిన్న పాటి స్టేడియాల వంటి వాటిలోనే క్యాంపెయినింగ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.

ట్రంప్ పై హత్యా ప్రయత్నం జరిగిన ఘటనకు బాధ్యత వహిస్తూ ఆ దేవ సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కింబర్లీ చీటల్ ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఈ తరుణంలోనే ట్రంప్‌నకు భారీ సభలకు సీక్రెట్ సర్వీస్ సేవలు అందించలేమని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×