BigTV English

U.S :నేను ఉంటే అలా జరిగివుండేది కాదు: డొనాల్డ్ ట్రంప్

U.S :నేను ఉంటే అలా జరిగివుండేది కాదు: డొనాల్డ్ ట్రంప్

Donald Trump pledges to bring peace and end Russia ..Ukraine war 
గత ఏడాది రష్యా-ఉక్రెయిన్ దాడులు యావత్ ప్రపంచాన్ని కుదిపేశాయి. రెండేళ్లుగా ఇరు దేశాల మధ్య పోరు కొనసాగుతూనే ఉంది. చూడబోతే ఇప్పట్లో ఈ యుద్ధం ఆగేలా లేదు. దీనివలన రెండు దేశాలూ ఆర్థికంగా దెబ్బతిన్నాయి. పెద్ద ఎత్తున ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి. రెండు దేశాలు తగ్గేదే లే అన్నట్లుగా విద్వేషాలు రెచ్చగొట్టుకుంటున్నాయి. ఈ యుద్ధంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొలాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు తాను అధికారంలో ఉండి ఉంటే ఆ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగేదే కాదని అన్నారు. వ్యక్తిగతంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తనకు మంచి మిత్రుడని..తన మాట ఏనాడూ కాదనడని..తనంటే చాలా గౌరవమని చెప్పుకొచ్చారు. రెండేళ్ల క్రితం తాను అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఉంటే..ఈ ఇరు దేశాల మధ్య యుద్ధం రాకుండా చూసేవాడిని అన్నారు.


ఇజెలెన్ స్కీ కాల్ చేశారు

టీవల రిపబ్లికన్ నేషనల్ సదస్సు విజయవంతమైన సంగతి తెలిసిందే. అందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ట్రంప్ ను అభినందిస్తూ ఫోన్ కాల్ చేశారని..రాబోయే ఎన్నికలలో మంచి విజయం సాధించాలని కోరినట్లు తెలిపారు. అప్రమత్తంగా ఉంటే రష్యా సమయం చూసి దాడులకు ఎగబడుతోందని ఆరోపించారు జెలెన్ స్కీ. ఇప్పటికీ ఉక్రెయిన్ లో పలు గ్రామాలు, పట్టణాలు రష్యా సైనికుల దాడులకు గురవుతునే ఉన్నాయన్నారు. మళ్లీ తాను యూఎస్ ప్రెసిడెంట్ గా అధికారంలోకి రాగానే ఇరు దేశాధ్యక్షులతో చర్చలు జరిపి యుద్ధం రాకుడా చేస్తానని ట్రంప్ తెలిపారు. జో బైడెన్ ఏ రకంగా చూసినా ప్రజాభిమానాన్ని కోల్పోయారన్నారు. ఆయన పాలసీలతో జనం విసిగిపోయారని..బైడెన్ కూడా మతి స్థిమితం లేకుండా నిర్ణయాలు తీసుకొంటున్నారని అన్నారు. పబ్లిక్ డిబేట్ లోనూ ఆయన తడబడుతున్నారని అన్నారు. అందుకే అమెరికా ప్రజలు మళ్లీ తననే రావాలని కోరుతున్నారన్నారు.


అధికారంలోకి మళ్లీ ..

ఏది ఏమైనా 2025 జనవరిలో అధ్యక్షుడిగా తిరిగి తానే ఎంపికవడం ఖాయం అన్నారు. అధికార హోదాతోనే రష్యా అధ్యక్షుడు, ఉక్రెయిన్ అధ్యక్షుడిని వేర్వేరుగా కలుసుకుంటానని అన్నారు. ఇద్దరితో రాజీ కుదుర్చడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తానని ట్రంప్ అన్నారు. సమస్య ఏమిటో, ఎందుకు వారిద్దరూ రాజీ పడటం లేదో తెలుసుకుంటానని అన్నారు. తర్వాత ఇరు దేశాధినేతలను ఒకే చోట కూర్చోబెట్టి సత్వరమే సమస్యకు పరిష్కారం లభించేలా చర్చిస్తానని..ఆ విషయంలో తనకు పూర్తి విశ్వాసం ఉందని అుటున్నారు. తనకు ఇరు దేశాధినేతలూ కావలసిన వారే. గతంలోనూ విదేశీ వ్యవహారాలలో తాను అప్రమత్తంగా ఉంటానని తెలిపారు. ఎంతో సంయమనం పాటించేవాడిని గుర్తుచేసుకున్నారు. తన మాటకు ఇరు దేశాధినేతలూ విలువనిస్తారని అలాగే తాను కూడా అంతే గౌరవం ఇస్తానని తెలిపారు. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నానని అన్నారు.

Related News

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Big Stories

×