BigTV English
Advertisement

Tomatoes Price| కిలో టమోటా రూ.100.. దేశ రాజధానిలో మండిపోతున్న కూరగాయల ధరలు!

Tomatoes Price| కిలో టమోటా రూ.100.. దేశ రాజధానిలో మండిపోతున్న కూరగాయల ధరలు!

Tomatoes Price| దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వాతావరణ మార్పుల తీవ్ర ప్రభావం సామాన్యలు వంటిల్లుపై పడుతున్నట్లు కనిపిస్తోంది. శనివారం దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కిలో టమోటా ధర రూ.100 పలికింది. ఎప్పుడూ రూ.20, రూ.30 కిలో ఉండే టమోటా ధర వంద రూపాయల అంటే విచిత్రమే అనిపిస్తుంది.


ఢిల్లీలోని మదర్ డెయిరీకి చెందిన సఫల్ రిటైల్ ఔట్ లెట్‌లో కిలో టమోటా వంద రూపాయలకు విక్రయిస్తున్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్‌జ్యూమర్ ఎఫైర్స్ డేటా ప్రకారం.. ఢిల్లీలో హోల్ సేల్ మార్కెట్ లో శనివారం, జూలై 20న టమోటా కిలో రూ.93.

ప్రభుత్వ డేటా ప్రకారం.. జూలై 20న దేశంలోని పలు నగరాల్లో టమోట కిలో ధర సగటున రూ.73.76 ఉంది.


కన్‌జ్యూమర్ ఎఫైర్స్ శాఖ సీనియర్ అధికారి టమోటా ధర ఇంతలా పెరగడానికి కారణాలు వివరించారు. దేశంలో విపరీతమైన వేడి వల్ల టమోటా ఉత్పత్తి భారీ తగ్గడం అదే సమయంలో ఒక్కసారిగా భారీ వర్షలు కురవడంతో టమోటా పంటలు దెబ్బతిన్నాయి. ఈ కారణాల వల్ల మార్కెట్‌కు టమోటా సరఫరా చాలా తక్కువగా ఉంది. ఫలితంగా ధరలు భారీగా పెరిగాయని ఆ అధికారి మీడియాకు తెలిపారు.

ఒక్క టమోటా ధరలే కాదు మిగిలిన కూరగాయల ధరలు కూడా సామాన్య ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. ఢిల్లీలో శనివారం మదర్ డైరీ సూపర్ మార్కెట్లో.. ఉల్లిపాయ ధర కిలో రూ.46.9 ఉండగా.. బంగాళదుంప (ఆలుగడ్డ) ధర కిలో రూ.41.90 గా ఉన్నాయి.

Also Read: బజాజ్ సంచలన నిర్ణయం.. ఫ్లిప్‌కార్ట్ నుంచి బైకులను ఆర్డర్ చేయవచ్చు!

అయితే ప్రభుత్వ డేటా ప్రకారం.. ఉల్లిపాయ ధర కిలో రూ.50, బంగాళదుంప ధర కిలో రూ.40 గా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ధరలు చూస్తే.. ఉల్లిపాయ ధర కిలో రూ.44.16, ఆలు ధర కిలో రూ.37.22గా ఉన్నాయి.

టమోటా, ఉల్లిపాయ, బంగాళదుంప ధరలతో పాటు మిగతా కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. శనివారం మదర్ డైరీ రిటైల్ ఔట్ లెట్ లో బీరకాయ కిలో రూ.59, కాకరకాయ కిలో రూ.49, ఫ్రెంచ్ బీన్స్ రూ.89, బెండకాయ రూ.49, క్యాప్సికమ్ రూ.119, వంకాయ (పెద్దవి రూ.59) (చిన్నవి రూ.49), దోసకాయ రూ.39. అన్నింటి కంటే గోబి పువ్వు- కాలిఫ్లవర్ కిలో రూ.139 భారీ ధర పలుకుతోంది.

మరోవైపు హైదరాబాద్ లో కూడా కిలో టమోటా రూ.80పైగా పలుకుతోంది.

Tags

Related News

Gold Rate Increased: వామ్మో.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతుందంటే?

Digital Gold: డిజిటల్ గోల్డ్‌ తో జాగ్రత్త.. సెబీ సీరియస్ వార్నింగ్!

JioMart Winter Offer: జియోమార్ట్‌ భారీ వింటర్‌ ఆఫర్లు.. బియ్యం, సబ్బులు, మసాలాలు అన్నీ సగం ధరకే..

Luxury Mattresses: అమెజాన్‌లో లగ్జరీ మెట్రెస్‌పై భారీ తగ్గింపు.. ఈ ఆఫర్ మిస్ అవ్వకండి..

DMart Offers: నవంబర్ లో డిమార్ట్ క్రేజీ ఆఫర్లు, ఆ వస్తువులపై ఏకంగా 80% తగ్గింపు!

Gold Rate: గుడ్ న్యూస్.. నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..

JioMart Offers: జియో మార్ట్‌ ఆఫర్లు రేపటితో లాస్ట్.. ఫ్రీ హోమ్ డెలివరీతో గ్రాసరీ వెంటనే కొనేయండి

Earbuds At Rs 749: ఫ్లిప్‌కార్ట్‌లో మాస్ ఆఫర్.. రూ.749లకే అద్భుతమైన బ్లూటూత్ ఇయర్‌బడ్స్

Big Stories

×