BigTV English

Donald Trump: బాంబులేస్తే నోబెల్ శాంతి బహుమతి ఇచ్చేస్తారా? ట్రంప్ లాజిక్ ఏంటి?

Donald Trump: బాంబులేస్తే నోబెల్ శాంతి బహుమతి ఇచ్చేస్తారా? ట్రంప్ లాజిక్ ఏంటి?

ఓవైపు నోబెల్ శాంతి బహుమతి కావాలంటున్న ట్రంప్, మరోవైపు ఇరాన్ పై బాంబుల వర్షం కురిపించారు. ఆయన లాజిక్ ఏంటి..? వారం రోజులు గడువిచ్చి మరీ ఇరాన్ పై రెండు రోజుల్లోనే విరుచుకు పడటం ఏంటి..? అలాంటి నాయకుడికి ప్రపంచంలో ఎవరైనా శాంతి బహుమతి ఇస్తారా..? యుద్ధోన్మాది అనే బిరుదు ఇస్తారా..?


ట్రంప్-యుద్ధం
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఏ రెండు దేశాల మధ్య ఘర్షణ మొదలైనా వెంటనే ట్రంప్ అక్కడ దూరేస్తున్నారు. తాజాగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో తలదూర్చారు ట్రంప్. వాస్తవానికి అది పూర్తిగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం. మూడో దేశం ఏదీ అందులో ఇన్వాల్వ్ కాలేదు. కానీ ఎక్కడో ఉన్న అమెరికా మాత్రం ఇరాన్ కి వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్ చెప్పినట్టు అణ్వాయుధ కేంద్రాలను మూసివేయాలని చెప్పింది. ఇరాన్ సుప్రీం లీడర్ ని చంపేయడం పెద్ద పనేం కాదన్నది. వారం రోజుల్లోగా చర్చలకు సిద్ధం కావాలని లేకపోతే ఇరాన్ అంతూ చూస్తామన్నారు ట్రంప్. అయితే ఆయన అంతవరకు వేచి చూడలేదు. వారం రోజులు అని గడువు విధించి రెండు రోజులు కూడా కాకముందే ట్రంప్ ఇరాన్ పై ఆకస్మిక దాడులు చేశారు. బీ-2 స్పిరిట్‌ బాంబర్లతో ఇరాన్ పై అమెరికా దళాలు విరుచుకుపడ్డాయి. ఈ దాడులపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. పశ్చిమాసియాలోని అమెరికా పౌరులు, సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని ఇరాన్‌ అధికారిక మీడియా తెలిపింది.

దాడులు, ప్రతిదాడులతో ఒక్కసారిగా వాతావరణం మరింత వేడెక్కింది. దీనంతటికీ కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కావడం విశేషం. అరేబియా సముద్రంలో సరకు రవాణా ఓడలపై దాడులు జరిగితే దానికి పరోక్షంగా ట్రంపే కారకుడు అవుతాడు. యుద్ధం చేయాలనుకోవడం, చేయడం, చేయకపోవడం.. అమెరికా ఇష్టం. కానీ యుద్ధం చేయాలనే ఉద్ధేశం ఉన్న ట్రంప్.. నోబెల్ శాంతి పురస్కారం తనకు కావాలని డిమాండ్ చేయడం ఇక్కడ అన్నిటికంటే పెద్ద జోక్. అలాంటి ట్రంప్ కి పాకిస్తాన్ మద్దతివ్వడం మరింత పెద్ద జోక్. నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరుని పాకిస్తాన్ ప్రతిపాదించింది. ట్రంప్ ని ప్రత్యక్షంగా, పరోక్షంగా కాకా పట్టేందుకే పాకిస్తాన్ ఈ ఉపాయం ఆలోచించిందని ప్రపంచ దేశాలంటున్నాయి.


పదే పదే తనకు నోబెల్ శాంతి బహుమతి కావాలంటున్న ట్రంప్ కి.. అది ఎప్పటికీ తనకు దక్కదని తెలుసు. అందుకే తన అక్కసునంతా ఇటీవల వెళ్లగక్కారు. ప్రపంచ దేశాల మధ్య యుద్ధాల్ని ఆపేస్తున్న తనకు ఆ అవార్డు కచ్చితంగా ఇవ్వాాలని డిమాండ్ చేస్తున్నారు. యుద్ధాల్ని నిజంగా ఆపేస్తే అవార్డు ఇచ్చే అవకాశముంది. కానీ భారత్-పాక్ యుద్ధాన్ని తానే ఆపానని తప్పుడు ప్రచారం చేసుకుంటే అవార్డు ఎందుకిస్తారు. పోనీ ఆ తప్పుడు ప్రచారాన్ని ప్రపంచం నమ్మినా, ఇప్పుడు ఇరాన్ పై బాంబులేయించిన అమెరికా అధ్యక్షుడు శాంతికాముకుడు అంటే ఎవరైనా నమ్ముతారా..? అందుకే ట్రంప్ కి శాంతి బహుమతి అనేది ప్రపంచ జోక్ గా మారిపోయింది.

Related News

Donald Trump: ఆ వ్యాధితో బాధపడుతున్న ట్రంప్.. అందుకేనా ఇంత తేడాగా ఉన్నాడు?

Botulism Outbreak: ఆ సాండ్‌విచ్ తిన్న కొద్ది సేపట్లోనే ప్రముఖ గాయకుడు మృతి.. ఆ కూరగాయే కారణమా?

Trump Tariffs: ట్రంప్ డబుల్ గేమ్! చైనాకు గడువు, ఇండియాపై భారీ పన్ను

planes collided: విమానంపైకి దూసుకెళ్లిన మరో విమానం.. తగలబడిన విమానాలు, వైరల్ వీడియో

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Big Stories

×