BigTV English

America: అమెరికా లెవెల్ 2 అడ్వైజరీ.. ఒంటిరిగా వెళ్లొద్దంటూ వార్నింగ్

America: అమెరికా లెవెల్ 2 అడ్వైజరీ.. ఒంటిరిగా వెళ్లొద్దంటూ వార్నింగ్

America: మధ్యప్రాచ్యంలో ఇరాన్-ఇజ్రాయెల్ వార్ నేపథ్యంలో అమెరికా అలర్ట్ అయ్యింది. శనివారం రాత్రి ఇరాన్ అణు స్థావరాలను ధ్వంసం చేసిన నేపథ్యంలో తమ దేశ పౌరులపై దృష్టి పెట్టింది అగ్రరాజ్యం. ఈ క్రమంలో లెవల్-2 ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. భారత్ వెళ్లే అమెరికన్లు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది ఆదేశ విదేశాంగ శాఖ.


భారత్ వెళ్లే అమెరికన్లు తగిన జాగ్రత్తలు పాటించాలని అమెరికా విదేశాంగ శాఖ సూచన చేసింది. ఈ క్రమంలో లెవెల్-2 ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. జూన్ 16న అడ్వైజరీ ఇష్యూ చేసింది. భారత్‌లో అత్యాచారాలు, ఉగ్రదాడులు పెరుగుతున్నాయని ప్రధాన కారణంగా పేర్కొంది. మహిళలు ఒంటరిగా పర్యటించొద్దని సూచించడం గమనార్హం.

భారతదేశంలో వేగంగా పెరుగుతున్న నేరాల్లో అత్యాచారాలు ఒకటిగా ప్రస్తావించింది. ముఖ్యంగా పర్యాటక ప్రదేశాలు, మార్కెట్లు, రవాణా కేంద్రాలు ఉగ్రవాద దాడులు జరుగుతున్నట్లు ప్రస్తావించింది. ప్రభుత్వ భవనాలపై హింసాత్మక నేరాలు జరుగుతున్నట్లు పేర్కొంది.


గ్రామీణ ప్రాంతాల్లో తమ పౌరులకు అత్యవసర సేవలు అందించే సామర్థ్యం అమెరికా ప్రభుత్వానికి పరిమితంగా ఉందన్నది కీలకమైన పాయింట్. తూర్పు మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలు ఎక్కువ ప్రమాదంలో ఉన్నట్టు ప్రస్తావించింది.

ALSO READ: వందే భారత్ ట్రైన్ ఎక్కుతున్నారా ఇలా చేయకుంటే నెక్ట్స్ స్టేషన్‌లో దింపేస్తారు? జాగ్రత్త సుమా?

ఈ నేపథ్యంలో భారత్‌లో పని చేస్తున్న అమెరికా ఉద్యోగులు ఈ ప్రాంతాలకు ప్రయాణించాలంటే ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సిందేనని సూచన చేసింది. అమెరికా ఉద్యోగులు భారత్‌‌లోని వివిధ రాష్ట్రాల రాజధానులను మినహాయించి ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రత్యేక అనుమతి తీసుకోవాలని తెలిపింది.

బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, బెంగాల్, మేఘాలయ, తూర్పు మహారాష్ట్ర, తూర్పు మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో ప్రయాణానికి ముందుగా అనుమతి ఉండాలని స్పష్టం చేసింది. శాటిలైట్ ఫోన్‌లు లేకుంటే జీపీఎస్ పరికరాలు కలిగి ఉండటం భారత్‌లో నిషేధమని తెలిపింది. అలా చేస్తే భారీ జరిమానా, మూడేళ్లు జైలు శిక్ష విధించ వచ్చని తెలియజేసింది.

మహిళలు ఒంటరిగా ప్రయాణించవద్దన్నది అందులో కీలకమైన పాయింట్.అత్యంత అప్రమత్తత అవసరమైన ప్రాంతాలుగా జమ్మూ కాశ్మీర్, భారత-పాకిస్థాన్ సరిహద్దు, తూర్పు, మధ్య భారతదేశం అని పేర్కొంది. రోడ్డు మార్గం నుంచి భారత-నేపాల్ సరిహద్దు దాటడం వల్ల ఇమ్మిగ్రేషన్ సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని సూచించింది. ఈశాన్య రాష్ట్రాల భద్రతా పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయన్నది హెచ్చరిక సారాంశం. ఇరాన్‌పై దాడి చేయాలని ముందుగానే భావించింది అమెరికా. ఈ క్రమంలో లెవల్-2 ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసిందని కొందరు నేతలు చెబుతున్నారు.

Related News

Free Food In Train: బ్రేక్ ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు.. ఈ రైల్లో తిన్నంత ఫుడ్ ఫ్రీ!

Tallest Bridge Restaurant: చైనాలో అతి ఎత్తైన వంతెన.. దాని పొడవైన స్తంభాలపై రెస్టారెంట్.. జూమ్ చేస్తేనే చూడగలం!

High Speed Train: విమానంలా దూసుకెళ్లే రైలు.. లోపల చూస్తూ కళ్లు చెదిరిపోతాయ్!

Passport Check: ఆ దేశంలో కేవలం 8 సెకన్లలోనే పాస్‌ పోర్ట్ చెకింగ్ కంప్లీట్.. అదెలా సాధ్యం?

Bullet Train: రైల్లో హైటెక్ వాష్ రూమ్, ఫైవ్ స్టార్ హోటల్లోనూ ఇలా ఉండదండీ బాబూ!

Falaknuma Express: మిర్యాలగూడలో ఆగిపోయిన ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్, కారణం ఏంటంటే?

Vande Bharat Train: లక్నో నుంచి ముంబైకి జస్ట్ 12 గంటల్లోనే.. వచ్చేస్తోంది వందే భారత్ స్లీపర్!

Trains Cancelled: కుండపోత వర్షాలతో పలు రైళ్లు రద్దు.. మీ రైళ్లు ఉన్నాయేమో చెక్ చేసుకోండి!

Big Stories

×