BigTV English

Dubai Princess Perfume: అప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో విడాకులు.. ఇప్పుడు ఏకంగా డివోర్స్ పేరుతో కొత్త బిజినెస్!

Dubai Princess Perfume: అప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో విడాకులు.. ఇప్పుడు ఏకంగా డివోర్స్ పేరుతో కొత్త బిజినెస్!

Dubai Princess Perfume| ఇస్లాం మతాన్ని కఠినంగా పాటించే గల్ఫ్ దేశాల్లో ఒక రాజకుమారి సంప్రదాయాలకు వ్యతిరేకంగా పనిచేసింది. కొంతకాలం క్రితమే తన భర్తకు సోషల్ మీడియా ద్వారా విడాకులు ప్రకటించిన ఈ రాజకుమారి ఇప్పుడు ఏకంగా డివోర్స్ పేరుతో బిజినెస్ చేస్తోంది.


వివరాల్లోకి వెళితే.. దుబాయ్ శాసకుడు, యుఎఈ దేశానికి ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ రాషిద్ అల్ మక్తూమ్ కుమార్తె.. షేఖా మహ్రా అల్ మక్తూమ్ తాజాగా తన పర్‌ఫ్యూమ్ బిజినెస్ లో కొత్త బ్రాండ్ లాంచ్ చేసింది. ఆ బ్రాండ్ పేరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. 30 ఏళ్ల రాజకుమారి మహ్రా అల్ మక్తూమ్ కు ఎన్నో బిజెనెస్ లు న్నాయి. అందులో భాగంగానే సుగంధ ద్రవ్యాల (పర్‌ఫ్యూమ్) కంపెనీ కూడా నడుపుతోంది.

ఆ పర్ ఫ్యూమ్ కంపెనీలో ‘డివోర్స్’ అనే పేరుతో కొత్త బ్రాండ్‌ని లాంచ్ చేసింది. 2023 మే నెలలో దుబాయ్ రాజు కుమార్తె ప్రిన్సెస్ మహ్రా అల్ మక్తూమ్ అదే దేశానికి చెందిన పెద్ద బిజినెస్ మెన్- ‘షేక్ మనా బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్’ ని పెళ్లి చేసుకుంది. జూలై 2024లో ఆమెకు తన భర్త ద్వారా ఒక పాప పుట్టింది. కానీ పాప పుట్టిన రెండు నెలల తరువాతనే ఆమె తన భర్తకు మూడు సార్లు తలాక్ తలాక్ తలాక్ అని చెప్పి విడాకులు ఇవ్వడంతో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఆమె విడాకులు కూడా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ప్రకటించడంతో రాజకుమారి వ్యక్తిగత జీవితం చర్చనీయాంశంగా మారింది.


ఇప్పుడు ఏకంగా డివోర్స్ అనే పేరుతో ఆమె పర్ ఫ్యూమ్ లాంచ్ చేయడం కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం.. మహిళలు బాహాటంగా విడాకులు గురించి ప్రకటించరు. అసల ప్రస్తావన కూడా తీసుకురావడం అరుదు. అలాంటిది ఇంటర్నెట్ ద్వారా విడాకులు ప్రకటించడం.. ఇప్పుడు డివోర్స్ అనే పేరు పెట్టి బిజినెస్ చేయడం ఒక రకంగా ఇస్లామిక్ దేశాల్లో విప్లవం లాంటిదే.

Also Read: కుటుంబాన్ని పోషించడానికి ఆ పనిచేస్తున్న మహిళ.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజెన్లు!

రాజకుమారి షేఖా మహ్రా అల్ మక్తూమ్ డివోర్స్ పేరుతో పర్ ఫ్యూమ్ లాంచ్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో ఉంది. అందులో ఆమె ఒక నల్లని పర్ ఫ్యూమ్ బాటిల్ ని చేతిలో పట్టుకొని కనిపిస్తోంది. ఆ బాటిల్ బ్రోకెన్ గ్లాస్ డిజైన్ లో నల్లని పూల రేకులు, బ్లాక్ పాంథర్ గుర్తు కనిపిస్తోంది.

దుబాయ్ శాసకుడు మొహమ్మద్ బిన్ రాషిద్ అల్ మక్తూమ్ 26 మంది సంతానం. వారిలో రాజకుమారి షేఖా మహ్రా అల్ మక్తూమ్ కూడా ఒకరు. ఆమె తల్లి గ్రీస్ దేశానికి చెందిన మహిళ. రాజకుమారి తల్లిదండ్రులు చాలా కాలం క్రితమే విడాకులు తీసుకున్నారు. రాజకుమారి షేఖా మహ్రా అల్ మక్తూమ్ కు సోషల్ మీడియా ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో 9.8 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

 

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×