E-Paper
Advertisement

నేపాల్‌కు కూతవేటు దూరంలో.. చైనా సిచువాన్‌ ప్రావిన్స్‌లో భూకంపం, తీవ్రత 5 కు పైగానే

నేపాల్‌కు కూతవేటు దూరంలో.. చైనా సిచువాన్‌ ప్రావిన్స్‌లో భూకంపం, తీవ్రత 5 కు పైగానే
Advertisement

Earthquake: ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు యాక్టివేట్ అవుతున్నాయి. ఎప్పుడు, ఏ ప్రాంతంలో భూకంపం వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. మూడు రోజుల కిందట నేపాల్‌ జల ప్రళయం కళ్ల ముందు కదులుతూనే ఉంది. తాజాగా నేపాల్‌కు కొద్ది దూరంలో ఉన్న చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదు అయ్యింది.

 

చైనాలో సిచువాన్‌ ప్రావిన్స్‌లో భూకంపం

Advertisement

నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లోని లాంగ్‌చాంగ్ సిటీలో శుక్రవారం మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదు అయ్యింది. ఈ విషయాన్ని చైనా భూకంప నెట్‌వర్క్స్ సెంటర్- CENC వెల్లడించింది. బీజింగ్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.10 గంటలకు సంభవించింది.

 

రిక్టర్ స్కేలుపై  5.1గా నమోదు

Advertisement

భూకంపం యొక్క కేంద్రం ఉత్తర అక్షాంశం- తూర్పు రేఖాంశం మధ్య ఏర్పడింది. ఈ భూకంపం భూమికి 13 కిలోమీటర్ల లోతులో సంభవించినట్టు పేర్కొంది. ఆ ప్రాంతమంతా హిమాలయాలు ఉండడంతో దీని ప్రభావం మిగతా ప్రాంతాలపై పడే అవకాశముందని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు.

 

నేపాల్-టిబెట్ సరిహద్దుకు దగ్గరగా

ఆగ్నేయ సిచువాన్‌లో నెయిజియాంగ్ పరిపాలనలోవున్న కౌంటీ స్థాయి సిటీ లాంగ్‌చాంగ్. చోంగ్‌కింగ్ మునిసిపాలిటీ సరిహద్దుకు సమీపంలో ఉంది. చెంగ్డూ-చోంగ్‌ కింగ్‌ నగరాలకు దాదాపు మధ్యలో ఉంటుంది. సిచువాన్ ప్రాంతం మిగతా పొరుగు ప్రాంతాలకు ఒక ముఖ్యమైన రవాణా కేంద్రం. సమీప ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించే అవకాశం ఉంది.

ప్రాణ, ఆస్తి నష్టం గురించి ఇంకా వివరాలు వెల్లడికాలేదు. కాకపోతే నేపాల్-టిబెట్ సరిహద్దుకు దగ్గర ప్రాంతంగా చెబుతున్నారు. అన్నట్లు ఆ ప్రాంతంలో భూకంపాలు రావచ్చని గురువారం అధికారులు వెల్లడించారు. అంతలోనే భూకంపం చోటు చేసుకుంది. దీంతో నేపాల్, టిబెట్, చైనా పర్వత ప్రాంతాల్లో ప్రజలకు అప్పుడే వణుకు మొదలైంది.

ALSO READ: మరో 3 రోజుల్లో నేపాల్‌లో మళ్లీ వరదలు.. మీడియాపై ఆంక్షలు విధించిన చైనా 

Related News

అతిపెద్ద చమురు సంస్థ అరామ్కోపై క్షిపణి దాడి.. హౌతీ దూకుడుతో సౌదీకి వణుకు

తన బొమ్మలకు పని చెప్పిన కిమ్.. క్షిపణులతో డిష్యుం డిష్యుం.. పొరుగు దేశాల్లో కలవరం!

ఫ్లైట్ కోసం ఎదురుచూస్తుంటే.. తలపై పడ్డ బాంబు, ఇండియన్స్‌తో పాటు 13 మంది…

భూమికి సౌర తుఫాను ముప్పు.. ఉపగ్రహాలు- జీపీఎస్ వ్యవస్థల మాటేంటి? రాత్రికి ఆకాశంలో ఏం జరుగుతోంది?

నేపాల్‌లో మరోసారి ఆకస్మిక వరదలు.. సల్లేరి బజార్‌ను ముంచెత్తిన ప్రళయం, అధికారులు హెచ్చరిక జారీ

రియాద్ ఎయిర్‌పోర్టుపై హౌతీల మెరుపుదాడి, 12 మంది మృతి, అలర్టయిన అమెరికా

అమెరికాలో కాల్పుల కలకలం.. గర్భిణి, పిల్లలు సహా 9 మంది మృతి!

కుప్పకూలిన నెట్‌వర్క్‌లు, మూతపడ్డ ఎయిర్‌పోర్ట్.. పనామాలో మహా విపత్తు!

Big Stories

Advertisement
×