iPhone 18 Pro: ఐఫోన్ 18 ప్రో సిరీస్ కోసం ఎదురుచూస్తున్న యాపిల్ అభిమానులకు ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. కంపెనీ తమ తదుపరి మెగా లాంచ్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 9న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. యాపిల్ పార్క్‌లోని స్టీవ్ జాబ్స్ థియేటర్ వేదికగా జరిగే ఈ కార్యక్రమంలో భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా iPhone 18 Pro, iPhone 18 Pro Maxతో పాటు మరికొన్ని ఉత్పత్తులు కూడా పరిచయం అయ్యే అవకాశం ఉంది.
Surprise and Shine అనే ట్యాగ్‌లైన్‌తో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రధానంగా కొత్త ఐఫోన్‌లపైనే దృష్టి ఉండే అవకాశం కనిపిస్తోంది. అయితే యాపిల్ పూర్తి ప్రొడక్ట్ లిస్ట్‌ను ఇంకా వెల్లడించలేదు.
Also Read: ట్విట్టర్ పేరు మళ్లీ వచ్చింది.. Xతో ట్రేడ్‌మార్క్ వివాదం మధ్య Twitter.now లాంచ్!
భారత్‌లో iPhone 18 Pro ధర పెరిగే అవకాశం ఉందని రిపోర్టులు చెబుతున్నాయి. దీని ప్రారంభ ధర సుమారు రూ.1,39,900 ఉండొచ్చని అంచనా. 256GB వేరియంట్ ధర రూ.1,44,900 వరకు ఉండొచ్చని సమాచారం. iPhone 18 Pro Max ప్రారంభ ధర రూ.1,54,900కు చేరొచ్చని తెలుస్తోంది. అయితే ఇవి అధికారిక ధరలు కావు.
iPhone 18 Proలో A20 Pro చిప్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇది TSMC 2nm టెక్నాలజీ ఆధారంగా రూపొందుతుందని సమాచారం. మెరుగైన పనితీరు, తక్కువ పవర్ వినియోగంతో పాటు 12GB RAM కూడా ఉండొచ్చని రిపోర్టులు సూచిస్తున్నాయి. చిన్న డైనమిక్ ఐలాండ్, మరింత ప్రకాశవంతమైన LTPO ప్లస్ డిస్‌ప్లే కూడా రావచ్చని తెలుస్తోంది.
48MP మెయిన్ కెమెరాతో పాటు వేరియబుల్ ఎపర్చర్ టెక్నాలజీని యాపిల్ తీసుకురావచ్చని సమాచారం. స్టాక్డ్ సెన్సార్ వల్ల ఫొటో, వీడియో పనితీరు మెరుగుపడే అవకాశం ఉంది. Pro Maxలో పెద్ద బ్యాటరీ, కొత్త C2 మోడెమ్, మెరుగైన శాటిలైట్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. సెప్టెంబర్ 9న వీటిపై పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Also Read: Best Gaming Phones: పవర్‌ఫుల్ ప్రాసెసర్, కూలింగ్‌తో అదరగొడుతున్న 3 స్మార్ట్‌ఫోన్లు!